E-Paper
Advertisement

దివ్వెల మాధురి నెలకు కొనే గోల్డ్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు.. అసలు ఎంతుందంటే?

దివ్వెల మాధురి నెలకు కొనే గోల్డ్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు.. అసలు ఎంతుందంటే?
Advertisement

Duvvada Madhuri: ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ మాధురిల బంధం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా బిగ్ టీవీ కిసిక్ టాక్స్ లో మాధురి కనిపించారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధురి, దువ్వాడ శ్రీను తనను ఎంతలా చూసుకుంటారో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఉన్న బంగారం గురించి మాట్లాడుతూ.. అసలు తను నెలకు ఎంత బంగారం కొంటారో కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఒక్క సారిగా అంతా షాక్ గురయ్యారు. దీంతో దువ్వాడ మాదురిపై శ్రీనుకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోంది.

Read also-కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి ‘గుర్తుందా’ సాంగ్ ప్రోమో.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

బంగారంపై మక్కువ..

Advertisement

ఈ ఇంటర్వ్యూలో మాధురి మాట్లాడుతూ, తనపై శ్రీను గారికి ఉన్న ప్రేమను కేవలం మాటల్లో చెప్పలేమని అన్నారు. ఆయన తనకు ప్రతిరోజూ లక్ష రూపాయల వరకు ఖర్చుల కోసం ఇస్తారని, ఆ డబ్బుతో తాను ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తానని వెల్లడించారు. ఈ లెక్కన నెలకు దాదాపు 30 నుండి 50 లక్షల రూపాయల వరకు బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కేవలం నగలు మాత్రమే కాకుండా, తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడంలో శ్రీను గారు ఎప్పుడూ అడ్డు చెప్పరని ఆమె చెప్పుకొచ్చారు.

Read also-Dhurandhar 2: అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన రణ్ వీర్ సింగ్.. అసలు ఏం జరిగిందంటే?

ఆర్థికంగా

Advertisement

అయితే, తాను కేవలం శ్రీను గారిపైనే ఆధారపడలేదని, రాజకీయాల్లోకి రాకముందే తాను వ్యాపారవేత్తగా నిలదొక్కుకున్నానని ఆమె స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంకుల నిర్వహణ ద్వారా తాను ఆర్థికంగా ఎప్పుడూ బలంగానే ఉన్నానని, ప్రస్తుతం కూడా తన బిజినెస్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతే కాకుండా.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. రాజకీయాల్లో ఒక మహిళ ఎదిగితే ఆమె క్యారెక్టర్‌పై బురద చల్లడం కొందరికి అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత నిర్ణయాలు, తన ఇష్టాఇష్టాలు తన వ్యక్తిగతమని, వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఆమె ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. మొత్తానికి, దువ్వాడ మాధురి చేసిన ఈ ‘లక్ష రూపాయల పాకెట్ మనీ’ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. శ్రీను పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతూనే, తన విలాసవంతమైన జీవనశైలిని ఆమె బహిరంగంగానే పంచుకున్నారు. తాజాగా దీనికి సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×