E-Paper
Advertisement

Emmanuel: బిగ్ బాస్ డబ్బులతో వారికి సర్ ప్రైజ్ ఇచ్చిన ఇమ్మానుయేల్.. ఏం చేశాడంటే?

Emmanuel: బిగ్ బాస్ డబ్బులతో వారికి సర్ ప్రైజ్ ఇచ్చిన ఇమ్మానుయేల్.. ఏం చేశాడంటే?
Advertisement

Emmanuel: ఇమ్మానుయేల్ పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమం(Jabardasth Show) ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇమ్మూ తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఈటీవీ కార్యక్రమాలకు దూరమవుతూ స్టార్ మా కార్యక్రమాలలో సందడి చేశారు. ఇలా స్టార్ మా కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన ఇమ్మానుయేల్ బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు . ఈ రియాలిటీ షోలో ప్రేక్షకులను కంటెస్టెంట్లను ఎంటర్టైన్ చేస్తూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్(Bigg Boss) తర్వాత కెరియర్ పరంగా ఇమ్మానుయేల్ (Emmanuel) ఎంతో బిజీగా ఉన్నారు.

తల్లికి , సంజనకు చీరలు కొనిచ్చిన ఇమ్మూ…

ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.. తాజాగా ఈయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో ఇమ్మానుయేల్ తన అమ్మ అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజనకు ఖరీదైన చీరలు కొనిచ్చారని తెలుస్తోంది .తనకు బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులతో తన అమ్మకు అలాగే బిగ్ బాస్ హౌస్ లో తనని అమ్మలా చూసుకున్న సంజనకు(Sanjana) కూడా ఈయన చీరలు కొనిచినట్టు ఒక వీడియోని షేర్ చేశారు.

మాధురి వకుల సిల్క్స్..

Advertisement

ఇకపోతే ఇమ్మానుయేల్ చీరల కోసం మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి (Divvala Madhuri )వకుల సిల్క్స్ కు వెళ్లడంతో అక్కడ వీరు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురితో కలిసి ముచ్చటించారు. అదేవిధంగా వకుల సిల్క్స్ లో వెరైటీ చీరలను కూడా చూపించారు. అయితే తాను ప్రమోషన్లలో భాగంగా ఈ వీడియో చేయలేదని తాను తన అమ్మకు అలాగే సంజన గారికి చీర కొనివ్వడానికే వచ్చానని అయితే కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా దివ్వెల మాధురి వకుల సిల్క్స్ గురించి తెలియజేశారు.

Advertisement

ఇలా ఇమ్మానుయేల్ బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బులతో తన తల్లికి చీర కొనివ్వడం ఎంతో గొప్ప విషయం అయితే హౌస్ లో తనని అమ్మలా చూసుకున్న సంజనకు చీర కొనివ్వడం ఇంకా గ్రేట్ అంటూ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇమ్మానుయేల్ కెరియర్ విషయానికి వస్తే.. ఇమ్మూ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఆదివారం విత్ పరివారం షోలో సందడి చేస్తున్నారు. అదే విధంగా పలు సినిమాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది . మరి బిగ్ బాస్ తర్వాత ఇమ్మూకు ఎలాంటి సినిమాలకు కమిట్ అవుతున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది .

Also Read: Shiva jyothi: బేబీ జెండర్ రివీల్ చేసిన శివజ్యోతి… వీడియో వైరల్!

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×