E-Paper
Advertisement

Nagabandham: ‘నాగబంధం’లో ‘బైరాగి’ పాత్రలో ఎవరంటే? భయంకరంగా ఫస్ట్ లుక్!

Nagabandham: ‘నాగబంధం’లో ‘బైరాగి’ పాత్రలో ఎవరంటే? భయంకరంగా ఫస్ట్ లుక్!
Advertisement

Nagabandham: టాలీవుడ్‌లో కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతున్న పేరు ‘నాగబంధం’ (Nagabandham). అద్భుతమైన విజువల్స్, వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ, భారతీయ పురాణాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలను భారీగా పెరుగుతున్నాయి. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ పాన్-ఇండియా విజువల్ వండర్ నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ‘కెజియఫ్’ సినిమాతో తన విలనిజంతో దేశాన్ని వణికించిన గరుడ రామ్ (Garuda Ram), ఈ చిత్రంలో ‘బైరాగి’ (Bhairagi) అనే అత్యంత శక్తివంతమైన, భయంకరమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read- Queen Glimpse: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్‌గా ‘క్వీన్’.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

భయంకరంగా ‘బైరాగి’

Advertisement

ఫస్ట్ లుక్‌ని గమనిస్తే.. ‘గరుడ రామ్’ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆ భారీ కాయం, తీక్షణమైన చూపులు. అయితే ‘నాగబంధం’ కోసం ఆయనను మలిచిన తీరు మాములుగా లేదు. ఒళ్లంతా విభూతి పూసుకుని, జడలు కట్టిన జుట్టుతో, మెడలో రుద్రాక్షలు, ఎముకలతో చేసిన మాలలు ధరించి ఆయన కనిపిస్తున్న తీరు ఒక శక్తివంతమైన తాంత్రిక యోధుడిని తలపిస్తోంది.ఈ పోస్టర్‌లో గరుడ రామ్ చేతిలో కపాలాలు, పాములతో కూడిన భారీ దండం పట్టుకుని ఉన్నారు. ఇది ఆయన పాత్రలోని చీకటి కోణాన్ని, నిషిద్ధ శక్తులపై ఆయనకున్న పట్టును తెలియజేస్తుంది. అడవి నేపథ్యంలో, చుట్టూ పాములు, చెల్లాచెదురుగా ఉన్న పుర్రెలు వంటివి.. సినిమాలో మిస్టికల్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో హింట్ ఇస్తున్నాయి. గరుడ రామ్ పోషించిన ఈ ‘బైరాగి’ పాత్ర సినిమాకే మెయిన్ పిల్లర్‌గా నిలవనుందని ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది.

Also Read- MSVPG Film: మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్.. టెలివిజన్ ప్రీమియర్ కు మన శంకర వర ప్రసాద్..

మహా శివరాత్రి కానుకగా టీజర్ బ్లాస్ట్!

Advertisement

ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఏమాత్రం తగ్గడం లేదు. మహా శివరాత్రి శుభ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 15న సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. శివుని ఆజ్ఞతో మొదలయ్యే ఈ ‘నాగబంధం’ ప్రయాణం.. టీజర్‌తో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయమని చెప్పొచ్చు. అభిషేక్ నామా కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా, ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన లుక్స్, తాజాగా వచ్చిన ‘బైరాగి’ లుక్ చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద ‘నాగబంధం’ విధ్వంసం సృష్టించడం ఖాయమనిపిస్తోంది. చూద్దాం.. ఈ వేసవికి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో..

Also Read- Shiva jyothi: బేబీ జెండర్ రివీల్ చేసిన శివజ్యోతి… వీడియో వైరల్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×