E-Paper
Advertisement

అమెరికాలో లక్ష డాలర్ల జీతం..  ఇండియాలో ఎంత సంపాదనతో సమానం?

అమెరికాలో లక్ష డాలర్ల జీతం..  ఇండియాలో ఎంత సంపాదనతో సమానం?
Advertisement

USA Salary: ‘దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయి’ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. కానీ కన్న వాళ్ళను వదిలి, పుట్టిన ఊరిని వదిలి పండగలకి పబ్బాలకి ఇంటికి రాలేక ఎన్నో కలలతో విదేశాలకు వెళ్తున్నారు నేటి యువత. ఊర్లో ఉంటే కుటుంబం కోసం బతుకుతాం. అదే అమెరికాకు వెళ్తే కుటుంబం బాగుంటుందనే ఎమోషన్ అన్నింటికీ దూరంగా ఉంచుతుంది. ఎందుకంటే అక్కడ లక్షల జీతం డాలర్లలో సంపాదన. ఇండియాలో ఉంటే ఎప్పటికీ సంపాదించలేని డబ్బు అక్కడ కొన్ని సంవత్సరాల్లోనే సంపాదించవచ్చు అని. కానీ, ఒక్క నిమిషం ఆలోచించండి. అమెరికాలో ఏడాదికి లక్ష డాలర్లు జీతం వస్తే నిజంగానే లైఫ్ సెటిల్ అయిపోయినట్లేనా..? ఆ జీతంలో ఎంత ఖర్చు అవుతుంది..? ఎంత సేవ్ చేసుకోగలుగుతాం..? రండి ఈ లెక్కలన్నీ ఇప్పుడు క్లియర్ గా చూద్దాం..

ఏడాదికి లక్ష డాలర్ల జీతం అనుకుందాం..

ఎగ్జాంపుల్.. ఒక వ్యక్తికి అమెరికాలో ఏడాదికి లక్ష డాలర్ల జీతం వచ్చింది అనుకుందాం. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే అటు ఇటుగా రూ. 83 లక్షలు. మనకి ఈ ఫిగర్ వినగానే.. అబ్బా ఏడాదికి రూ. 80 లక్షలకు పైగా జీతమా ఇక వాళ్ళకు డబ్బులకు ఏం ఇబ్బంది ఉండదు అనుకుంటాం. కానీ, ఇక్కడే ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఆఫర్ లెటర్ లో కనిపించే జీతాన్ని గ్రాస్ శాలరీ అంటారు. అంటే పన్నులు ఇతర వర్తించే కోతలు తగ్గించక ముందు ఉన్న మొత్తం.. ఈ మొత్తం అమౌంట్ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్ లో పడదు.

టాక్స్లు పోను చేతికి ఎంత వస్తుంది..?

Advertisement

అమెరికాలో ఉద్యోగి ఆదాయం నుంచి ఫెడరల్ ఇన్కమ్ టాక్స్ వర్తించే రాష్ట్ర పన్నులు, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లాంటి పన్నులు కట్ అయిపోతాయి. కానీ మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒకే లా పన్నులు పడవు. వాళ్ళు ఉండే రాష్ట్రం పన్ను చెల్లించే విధానం కుటుంబ పరిస్థితులు ఇతర మినహాయింపులపై ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష డాలర్ల గ్రాస్ శాలరీ నుంచి అన్ని టాక్స్లు తీసేసిన తర్వాత ఏడాదికి సుమారు 73000 వేల డాలర్లు చేతికి వస్తున్నాయి అనుకుందాం. అంటే నెలకు దాదాపు 6083 డాలర్లు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ 6083 డాలర్లతో అమెరికాలో లైఫ్ ని లీడ్ చేయాలి. ఇంటి రెంట్ కట్టాలి, తినాలి, ట్రావెల్ చేయాలి. ఇవే కాకుండా హాస్పిటల్ ఖర్చులు ఇంకా ఏమైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటే అవి కూడా వీటన్నింటి తర్వాతే మనకు నిజమైన సేవింగ్స్ ఎంత అనేది తెలుస్తుంది.

అమెరికాలో నెల వారి ఖర్చులు ఎలా ఉంటాయో చూద్దాం..

ముందుగా ఇంటి అద్దె గురించి మాట్లాడుకుందాం. ఒక నగరంలో మంచి ప్రాంతంలో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అనుకుందాం. అద్దే నెలకు 2500 డాలర్లు కావచ్చు. తర్వాత కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ లాంటి యూటిలిటీస్ కోసం దాదాపు 300 డాలర్లు అనుకుందాం. గ్రోసరీస్ అంటే ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, వంటకు కావలసిన వస్తువుల కోసం నెలకు 500 నుంచి 600 డాలర్లు ఖర్చు అవుతుంది అనుకుందాం. తర్వాత కారు ఖర్చులు అమెరికాలో చాలా ప్రాంతాల్లో కార్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కార్ లోనూ లేదా లీజ్ ఇన్సూరెన్స్, పెట్రోల్ మెయింటనెన్స్ అన్నీ కలిపి నెలకు 800 డాలర్లు ఖర్చు అవుతాయని అనుకుందాం. హెల్త్ కేర్ కోసం ఇంకో 300 డాలర్లు ఇక బయట తినడం చిన్న చిన్న షాపింగ్లు ఎంటర్టైన్మెంట్ లైఫ్ స్టైల్ ఖర్చుల కోసం మరో 300 నుంచి 400 డాలర్లు ఇవన్నీ కలిపితే నెలకు సుమారు 4700 నుంచి 4900 డాలర్లు ఖర్చు అయిపోతున్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఖర్చు అందరికీ ఒకేలాగా ఉండదు. కొందరికి ఎక్కువగా ఉండొచ్చు మరికొందరికి తక్కువ ఉండొచ్చు. ఇవన్నీ లెక్క వేస్తే.. ఏడాదికి దాదాపు 56,400 నుంచి 58,800 డాలర్లు ఖర్చు అవుతున్నాయి అన్నమాట. ఇది కూడా ఒక అంచన మాత్రమే.

ఖర్చు పోగా చివరికి ఎంత మిగులుతుందో ఇప్పుడు చూద్దాం..

Advertisement

ఏడాదికి టాక్స్ల పోను చేతికి వచ్చేది 73000 డాలర్లు. అందులో మనం అనుకున్న 58000 డాలర్లు తీసేస్తే చివరికి మిగిలేది దాదాపు 15000 డాలర్లు. అంటే మనం ఊహించినంత పెద్ద మొత్తంలో సేవింగ్స్ లేవు అక్కడ. ఈ 15000 డాలర్లను ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే.. ఎక్స్చేంజ్ రేటును బట్టి అటు ఇటుగా 12 నుంచి 13 లక్షలు వస్తాయి. డాలర్ రేటు మారితే ఈ మొత్తం కూడా మారుతుంది. అంటే ఏడాదికి 80 లక్షలకు పైగా గ్రాస్ శాలరీ ఉన్న వ్యక్తి ఖర్చులన్నీ పోను 12 నుంచి 13 లక్షలు సేవ్ చేస్తున్నాడు. ముందుగా చెప్పుకున్నట్టు ఇది పక్కా లెక్క కాదు. ఇది పెరగొచ్చు తగ్గొచ్చు.

అమెరికా ఇండియన్ శాలరీల కంపేరిజన్..

ఇలా కంపేర్ చేసే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదే పిపిపి. అంటే పర్చేసింగ్ పవర్ పారిటీ సింపుల్ గా చెప్పాలంటే రెండు దేశాల్లో ఒకే మొత్తంలో వచ్చిన శాలరీతో ఏ ఏ వస్తువులు కొనగలుగుతాము ఏ ఏ సేవలు పొందగలుగుతాము అని ఫైనాన్షియల్ గా కంపేర్ చేసే విధానం ఇది. ఇండియాలో కొన్ని సర్వీసులు చాలా తక్కువకే మనకు అందుబాటులో ఉంటాయి. ఇంట్లో వంట చేయడానికి అవసరమయ్యే హెల్పర్లు చిన్న చిన్న రిపేర్లకు అయ్యే ఖర్చు కావచ్చు లేదా ఫుడ్ డెలివరీ వంటి సర్వీసులకు అయ్యే ఖర్చు అమెరికాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కానీ, అమెరికాలో అలా కాదు. అక్కడ చాలా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే టైంలో అమెరికాలో కొన్ని వస్తువులు ఉద్యోగ రంగాలు జీతాల స్థాయిలు వేరుగా ఉంటాయి.

లక్ష డాలర్లు.. ఇండియాలో ఎంత జీతంతో సమానం..?

అందుకే అమెరికాలో ఏడాదికి లక్ష డాలర్లు సంపాదించడం.. ఇండియాలో 30, 40 లక్షలు సంపాదించడం దాదాపుగా ఒక్కటే. నిజానికి కొన్ని ఏళ్ల క్రితం వరకు ఇది 20 నుంచి 25 లక్షలుగా ఉండేది. బట్ డాలర్ బలపడుతుండడంతో ఇది 30 లక్షలకు చేరింది. ఎందుకంటే అమెరికాలో సంపాదించిన డబ్బును ఇండియాకు పంపినప్పుడు డాలర్ విలువ వల్ల ప్రయోజనం ఉండొచ్చు. కానీ అక్కడ సంపాదించిన ప్రతి డాలర్ ను ఇండియన్ రూపాయల్లోకి మార్చి చూసి అదే మన నిజమైన లాభం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సంపాదన ఒకటి, ఖర్చులు మరొకటి, సేవింగ్స్ ఇంకొకటి. ఎక్కువ జీతం రావడం మాత్రమే గొప్ప కాదు. ఆ జీతంలో ఎంత ఖర్చు అవుతోంది, ఎంత మిగులుతోంది భవిష్యత్తుకు ఎంత భద్రత కల్పించుకోగలుగుతున్నాం అనేదే ముఖ్యం.

బి కేర్ ఫుల్..

అందుకే విదేశాలకు వెళ్ళాలి అని కలలుగనే యువత.. జీతం ఫిగర్ ఒక్కటే చూసి నిర్ణయం తీసుకోకండి. అక్కడ టాక్స్లు లైఫ్ ను లీడ్ చేయడానికి అయ్యే ఖర్చులు, ఉద్యోగ భద్రత, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు అవకాశాలు అన్నీ లెక్క వేసుకోండి. ఎందుకంటే చివరికి మన బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యే జీతం కంటే మన భవిష్యత్తు కోసం మిగిలే డబ్బే ఎక్కువ ముఖ్యం.

Tags

Related News

రిటైర్మెంట్ ఫండ్ రూ.8 కోట్లు ఉంటే ఇక నో టెన్షన్.. కానీ నెలకు ఎంత SIP చేస్తే ఇది సాధ్యం?

భర్త సంపాదన నెలకు రూ.11 వేలు.. విడాకుల తరువాత భార్యకు నెలవారీ రూ.25000 చెల్లించాలన్న కోర్టు

ఏడాదికి రూ. కోటి వరకు జీతం కావాలా? వెంటనే ఈ కెరీర్ ఎంచుకోండి

రూ.కోటి జీతంతో జాబ్ వదులుకొని బిజినెస్ చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2.2 కోట్ల ఆదాయం

అమ్మో.. అప్పులు, గోల్డ్ లోన్‌తో తీర్చేద్దాం.. బ్యాంకులకు కొత్త తలనొప్పి?

రేపటి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి..ఎమర్జెన్సీ సేవింగ్స్ వల్ల కలిగే సూపర్ బెనిఫిట్స్!

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు..ఈ 6 తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×