E-Paper
Advertisement

కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్‌ ఫ్రంట్‌ మాట..! నాన్న కోసం నేషనల్‌ రాజకీయాలు ఎదురుచూస్తున్నాయట..! మళ్లీ చక్రంతిప్పనున్నారట!

కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్‌ ఫ్రంట్‌ మాట..! నాన్న కోసం నేషనల్‌ రాజకీయాలు ఎదురుచూస్తున్నాయట..! మళ్లీ చక్రంతిప్పనున్నారట!
Advertisement

అది తత్తరపాటు, బిత్తరచూపు ప్రకటనైతే కాదు కదా! కచ్చితంగా అది అసందర్భ ప్రేలాపనే అనుకోవాల్సి ఉంటుంది.  కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్ ఫ్రంట్‌ మాటొచ్చింది. అచ్చంగా కేసీఆర్‌ గతంలో అన్న మాదిరిగానే. నాన్న కోసం జాతీయ రాజకీయాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయట. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారట జనం. అందుకే కేసీఆర్‌ మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీ రోల్‌ పోషించనున్నారని కేటీఆర్‌ తాజాగా ప్రకటించడం సర్వత్రా ఆసక్తి కలిగించింది.

ఆ పార్టీ క్యాడర్‌ను మాత్రం తీవ్ర అయోమయానికి గురి చేసిందీ ప్రకటన. తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట నియోజకవర్గ మీటింగులో ఆయన ఈ మాటలన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మళ్లీ మన కేసీఆర్‌ దేశ్‌కీ నేత కానున్నారని కేటీఆర్‌ కుండబద్దలు కొట్టేశాడన్నమాట. పాత చేదు అనుభవాలను మరిచాడా? చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందాన్ని విస్మరించాడా? తెలంగాణ సమాజం పెట్టిన వాతలు మానిపోయాయా? తెలియదు కానీ.. కేటీఆర్‌ నోటి వెంట ఇలాంటి కామెంట్స్‌ బ్లండర్ మిస్టేక్‌గానే చూడాలి.

Advertisement

దేశ్‌ కీ నేత పేరుతో కొత్త వేషం కట్టి.. పార్టీ పేరులోంచి తెలంగాణ అనే పదాన్నే తొలగించేసి… ఇక్కడి సొమ్మును అప్పనంగా పార్టీ ప్రచారాలకు వాడుకుని … తను దేశ ప్రధానిని అవుతున్నాననే బిల్డప్‌ ఇచ్చి.. ఇక్కడి జనాన్ని ఫూల్‌ చేసిన వైనాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదు. దీనికి ప్రతిఫలం కూడా తొందరగానే దొరికింది కేసీఆర్‌కు. ఇప్పుడు ఫామ్‌హౌజ్‌లో రెస్ట్‌లో ఉన్నారాయన.

కొడుకుకు పార్టీ పగ్గాలప్పగించి.. తను మాత్రం మౌనవ్రతాన్ని వీడటం లేదు. ప్రజలపై అలకగానే దీన్ని చూస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా ‘తమ ప్రజలపై అలిగిన నేత ఎవరైనా ఉన్నారా ?’ అంటే అది వన్‌ అండ్‌ ఓన్లీ కేసీఆరే అని చెప్పాలి. ‘మళ్లీ వస్తాడు.. జనాలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. కాబోయే సీఎం ఆయనే..’ అని కేటీఆర్‌ ఏ మీటింగుకు వెళ్లినా చెబుతూ వస్తున్నాడు.

Advertisement

బాగానే ఉంది. కనీసం పార్టీకి బూస్టింగ్‌ అయినా ఇలా దొరుకుతుందేమో. ఎందుకంటే.. కేటీఆర్ ను ఎవరూ నమ్మేలా లేరు. నేనే నెక్ట్స్‌ సీఎం.. అని ఎక్కడ చెప్పుకునే స్థితి లేదు. ‘కేసీఆర్‌ కాకుండా.. కేటీఆరే ఇక అంతా’ అని బయట ప్రచారం జరిగిన నాడు ఆ పార్టీ కొలాప్సేనని గులాబీ శ్రేణులే చెబుతారు.

మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. ఓ వైపు అధికార పక్షం, ప్రతిపక్షాలు బలంగా ఉన్న సమయంలో గెలిచి గట్టెక్కడమే కష్టమనుకుంటుంటే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల గోలేల కేటీఆర్‌? అని ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారట.

లేకపోతే కేసీఆరే మళ్లీ ఫామ్‌హౌజులో కూర్చుని .. జాతీయ రాజకీయాల లెక్కలేస్తున్నాడా? ‘ఇక నేను స్టేట్ పాలిటిక్స్‌లో ఉండను.. ఇది కేటీఆర్‌ చూసుకుంటాడు… నేను ఢిల్లీకే పరిమితమైతా!’ అని డిసైడ్‌ అయ్యి.. ఇదే ముచ్చట తన అంతరంగీకులతో చెప్పి ఉంటాడా.. ఏందీ? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారట.

ఈ నిర్ణయమే నిజమైతే.. ఇంకా దేశ్‌కీ నేత ఆశలు కేసీఆర్‌లో సజీవంగా ఉన్నాయనుకుంటే.. ఇక్కడ పార్టీ మట్టికొట్టుకుపోవడం ఖాయం. ఒకవేళ .. జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉంటే గింటే .. ఇప్పటికే బయట తిరగాలె. ఇదే మంచి తరుణంగా భావించి. కానీ ఇంట గెలవనప్పుడు.. అక్కడ ఎవరు రెస్సెక్ట్ ఇస్తారు.. ఎవరు రెస్పాండ్ అుతారు..? అనే భావన కావొచ్చు. మరి గెలిచిన తరువాత తిరుగుతాడా? అంటే .. అసలు ఆ గెలుపే కష్టసాధ్యం చేసి కూర్చుంటున్నారనిపించేలా ఇలాంటి కామెంట్లు చేసుకుంటున్నారు. స్వయంకృతాపరాధమే తప్ప ఇది మరోటి కాదనే కామెంట్లు తెలంగాణ భవన్‌ నుంచే వినిపిస్తున్నాయి మరి.

Tags

Related News

విశ్వనగరం అసలు రూపం ముందుంచుతాం..! మా పార్టీ నినాదం ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం..!

జగన్ దూకుడు.. ఏ ధైర్యంతో అలా చేస్తున్నారు?

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని పదే పదే శపథం! అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్!

తెలుగు రాష్ట్రాల్లో సన్నవడ్లకు రికార్డు గిరాకీ.. ఎన్నడూ లేనంతగా ధర ఇచ్చి కొంటున్న పొరుగు రాష్ట్రాల దళారులు..!

భారీగా పెరిగిన సోనా మసూరి, బీపీటీ బియ్యం ధరలు.. క్వింటల్ ఎంతో తెలుసా?

తెలంగాణలో సోలార్ గ్రామాల ప్రాజెక్ట్ సిద్దం.. ఇందులో మీఊరి పేరు ఉందా..?

రేవంత్ సర్కార్‌పై BRS కరెంట్ వార్.. క్షేత్రస్థాయిలోకి హరీష్ రావు టీమ్!

Big Stories

Advertisement
×