E-Paper
Advertisement

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!
Advertisement

YouTuber Nandana: నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది నందన. ఫ్యామిలీ విషయాలను సరదాగా చిత్రీకరిస్తూ తన పిల్లలతో చిన్నపాటి సరదా గొడవలతో ఆడియన్స్ ని అలరిస్తూ లక్షలాదిమంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. అలాంటి నందన లండన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈమెపై కేసు నమోదు అవ్వడమే కాకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా ఈమెపై జారీ చేశారు .

నిజమే గెలుస్తుంది..

ఇక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని గంటల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత తాను ఏ మోసం చేయలేదని.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, కావాలనే తన వెనుక కొంతమంది కుట్ర పన్నుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అలాంటి ఈమె తాజాగా మరో పోస్ట్ పెట్టి ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. తాజాగా తన పోస్టులో అక్టోబర్ 4వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చినట్లు రాసకొచ్చింది.

గత 28 రోజులు నాకు ఎన్నో పాఠాలు నేర్పించాయి.

Advertisement

గత 28 రోజులు నాకు ఎన్నో విషయాలు నేర్పించాయి. నిజాయితీ, సత్యం, అంతర్గత బలం జీవితంలో ఎప్పటికీ ముఖ్యమైనవే. ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. బాధను కూడా అనుభవించాను. అయితే నేను చేదు భావాలతో తిరిగి రాలేదు. విలువైన పాఠాలు , ధైర్యం, ఆశతో మళ్ళీ తిరిగి వచ్చాను. నా అనుభవం ద్వారా నిజాయితీగా ఉండే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని, సత్యానికి ఇప్పటికీ విలువ ఉందని తెలుసుకున్నాను. ముఖ్యంగా నిజాయితీ కోసం నిలబడడం మన విలువలు ఎప్పటికీ కూడా విలువైనవే అని తెలుసుకున్నాను.

జీవితం పరీక్ష పెడుతుంది..

జీవితం అప్పుడప్పుడు మనం ఊహించని విధంగా మనల్ని పరీక్షిస్తుంది. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటి కారణంగా మన విలువలను కోల్పోకుండా మనల్ని మనం మరింత ముందుకు తీసుకువెళ్లాలి .ఈ 28 రోజుల అనుభవం నాకు జీవితాంతం గుర్తుండిపోయే పాఠాలు నేర్పింది. ఈ ప్రయాణం నన్ను మరింత బలమైన వ్యక్తిగా మార్చేసింది. చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, మంచితనమే గెలుస్తాయి అంటూ తన సుదీర్ఘ పోస్టులో రాసుకుంది నందన. మొత్తానికైతే నందనపై తప్పుడు ఆరోపణల కేసు నమోదయ్యాయని , అయితే తాను ఏ మోసం చేయలేదని, కచ్చితంగా మంచితనమే, నిజాయితీయే నిలబడుతుంది అంటూ నందన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ALSO READ: పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు.. నరేష్ ఊహించని కామెంట్!

ఆరోపణల మధ్య విమర్శలు ఎదుర్కొన్న నందన..

నిరుద్యోగులను నమ్మబలికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. లక్షల రూపాయలు సొంతం చేసుకుందనే ఆరోపణలు ఈమెపై వినిపించాయి . అంతేకాదు కొంతమంది బాధితులు మీడియా ముఖంగా కూడా ఈమెపై పై తమ ఆక్రోషం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు నందన ఇలాంటి పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు నిజం ఏంటి అన్నది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

కార్తీకదీపం 2 సీరియల్ లో జోత్స్న మిస్సింగ్… ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

నువ్వింకా శీలవతివేనా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన వేణుస్వామి భార్య!

రోహిత్ వర్సెస్ వంశీ.. శాలిని పై నీతూ ఫైర్.. అసలేం జరుగుతోంది?

వేలల్లో సబ్స్క్రైబర్స్..లక్షల్లో సంపాదన.. విష్ణు ప్రియ నెల సంపాదన తెలిస్తే మతి పోవాల్సిందే!

నామినేషన్ హీట్ మధ్య నరేష్ రిలీఫ్ వర్డ్స్.. లవ్ స్టోరీ అదుర్స్?

నామినేషన్స్ లో పెద్ద గొడవ.. ఈ వారం వారికి రెడ్ కార్డ్ తప్పదా?

విడాకులు తీసుకున్న నవ్య స్వామి వదిన.. పోస్ట్ వైరల్!

Gundeninda GudiGantalu Today episode: ఇదేం ట్విస్ట్ స్వామి.. అడ్డంగా బుక్కయిన విల్లా విజయ్.. రోహిణికి షాక్..

Big Stories

Advertisement
×