VK Naresh: ప్రముఖ సీనియర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నరేష్ (Naresh ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దివంగత దర్శకురాలు విజయనిర్మల (Vijaya Nirmala) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్.. తొలుత హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయినా.. ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran), తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), అఖిల్ రాజ్ (Akhil Raj) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ క్రేజీ కళ్యాణం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నరేష్ నేటితరం పెళ్లిళ్లు, బంధాలపై స్పందించారు.
క్రేజీ కళ్యాణం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నరేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో మారుతున్న బంధాల గురించి చెప్పుకొచ్చారు.ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం అనేది చాలా కష్టంగా మారింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసినా పెళ్లిళ్లు కావడం లేదు. నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనింది. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి.. ముఖ్యంగా పెళ్లి కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, ఆ తర్వాత విడాకుల కోసం మళ్లీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇంకొన్ని కోట్లు వృధా చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది” అంటూ నరేష్ తెలిపారు.
ఇక ఇదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నరేష్ మాట్లాడుతూ..” ఇప్పుడు సహజీవనం కూడా చట్టబద్ధం అయిపోయింది. అందుకే పెళ్లి అనేది కేవలం ఒక ఈవెంట్ లాంటిదే. అందుకే చెబుతున్నాను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు కానీ పిల్లల్ని మాత్రం కనండి ” అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో జనాభా తగ్గిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందనే కోణంలో నవ్వుతూనే ఆ కామెంట్లు చేశారు నరేష్.
ఇదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనుపమకు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురవడంతో ఈ ప్రశ్న అడిగిన రిపోర్టర్ కే తనదైన శైలిలో రివర్స్ కౌంటర్ ఇచ్చింది అనుపమ. మీ పెళ్లి జరిగే రెండు నెలలే అవుతోంది కదా.. అందుకే ఎంత క్యూరియాసిటీ ఉంది ? ముందు మీ పెళ్లి లైఫ్ ఎలా ఉందో చెప్పండి.. అసలు పెళ్లి చేసుకోవాలా? వద్దా? నొప్పిని భరిస్తూనే మీరు నవ్వుతున్నారా? ఒకవేళ మీరు సంతోషంగా ఉన్నాము అంటే రెండేళ్ల తర్వాత కూడా ఇదే మాట చెబుతారా?” అంటూ కూడా అనుపమ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి అయితే పెళ్లికి సంబంధించిన విషయాలు ఈ ఈవెంట్లో చాలానే జరిగాయి..
ALSO READ: వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!
ఇకపోతే అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పుడు మరింత బజ్ క్రియేట్ అయిందని చెప్పాలి . ఏది ఏమైనా నరేష్, అనుపమ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటితరం బంధాలపై ప్రాక్టికల్గా నిజాలనే మాట్లాడారు అంటూ వీరికి సపోర్ట్ చేస్తున్నారు.