Mobile Ads Problem: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ప్రతీ చిన్న పనికి మనం ఫోన్‌పైనే పూర్తిగా ఆధారపడుతున్నాము. అయితే కొన్నిసార్లు మనం నమ్మదగిన యాప్‌లనే డౌన్‌లోడ్ చేసుకున్నామని భావించినా.. కొన్ని ప్రమాదకర మాల్వేర్ లేదా యాడ్వేర్ యాప్‌ల వల్ల ఫోన్ స్క్రీన్‌పై సడన్ గా విపరీతమైన యాడ్స్ వచ్చిపడుతుంటాయి. కేవలం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడే కాకుండా.. ఫోన్ లాక్ తీయగానే ఫుల్ స్క్రీన్ యాడ్స్ రావడం వల్ల యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయట పడి మీ ఫోన్‌ను సేఫ్ గా ఉంచుకోవడానికి కొన్ని ఈజీ పద్ధతులున్నాయి. ఈ సమస్యను మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా పరిష్కరించుకోవచ్చు.
మీ ఫోన్‌లో సగన్‌గా యాడ్స్ రావడం ప్రారంభమైందంటే.. ఇటీవలే మీరు డౌన్‌లోడ్ చేసిన ఏదైనా థర్డ్-పార్టీ యాప్ దీనికి ప్రధాన కారణం కావచ్చు. కొన్ని యాప్‌లు ఎలాంటి.. లోగో లేదా పేరు లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ యాడ్స్ రన్ చేస్తాయి.
ఏం చేయాలి: ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Apps’ లేదా ‘Application Manager’ ఓపెన్ చేయండి.’Recently Installed’ లేదా చివరిగా వాడిన యాప్‌లను చెక్ చేయండి. మీకు ఏమాత్రం సందేహం ఉన్నా ..ఆ యాప్‌లను వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయండి.
చాలా మంది గూగుల్ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్లలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు, అక్కడ కనిపించే ‘Allow Notifications’ ఆప్షన్‌ను తెలియకుండానే.. క్లిక్ చేస్తుంటారు. దీని వల్ల ఆ వెబ్‌సైట్లు మీ ఫోన్ నోటిఫికేషన్ బార్‌లో యాడ్స్ పంపుతుంటాయి.
ఏం చేయాలి: మీ బ్రౌజర్ (ఉదాహరణకు Google Chrome) ఓపెన్ చేసి, Settings > Site Settings > Notifications కి వెళ్లండి. అక్కడ మీకు తెలియని లేదా అనవ సరమైన వెబ్‌సైట్ల పర్మిషన్స్ ఉంటే వెంటనే.. ‘Block’ లేదా ‘Remove’ చేయండి.
కొన్ని సాధారణ యాప్‌లు (టార్చ్ లైట్, వాల్ పేపర్ లేదా స్కానర్ యాప్‌లు వంటివి) ఫోన్ స్క్రీన్ పై ఇతర యాప్‌లపైన కనిపించే పర్మిషన్‌ను దుర్వినియోగం చేస్తూ యాడ్స్ చూపిస్తుంటాయి.
ఏం చేయాలి: ఫోన్ సెట్టింగ్స్‌లో ‘Special App Access’ లేదా ‘Display over other apps’ సెర్చ్ చేయండి. ఏయే యాప్‌లకు ఈ పర్మిషన్ ఉందో చెక్ చేయండి. అవసరం లేని లేదా యాప్‌లకు ఈ పర్మిషన్‌ను డిసేబుల్ చేయండి.
మీ ఫోన్‌లో ఏ యాప్ వల్ల యాడ్స్ వస్తున్నాయో.. కచ్చితంగా గుర్తించలేకపోతే, సేఫ్ మోడ్ మీకు గొప్పగా సహాయ పడుతుంది. సేఫ్ మోడ్ ఆన్.. చేసినప్పుడు మీరు డౌన్ లోడ్ చేసిన థర్డ్-పార్టీ యాప్‌లన్నీ డిసేబుల్ అవుతాయి.
ఏం చేయాలి: మీ ఫోన్ పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి, ‘Power Off’ ఆప్షన్ మీద కాసేపు నొక్కి పడితే ‘Reboot to Safe Mode’ ఆప్షన్ వస్తుంది. సేఫ్ మోడ్‌లోకి వెళ్లిన తర్వాత మీ ఫోన్‌లో యాడ్స్ రావడం ఆగిపోతే..మీరు డౌన్ లోడ్ చేసిన యాప్‌ల వల్లే ఈ సమస్య వస్తోందని నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత సాధారణ మోడ్‌కి వచ్చి అనుమానాస్పద యాప్‌ను తొలగించండి.
Also Read: ఫోన్‌లో అనవసరమైన యాడ్స్ వస్తున్నాయా?ఈ 5 పద్ధతులతో చెక్ చేయండి!
పైన పద్ధతులు పని చేయకపోతే.. మీ ఫోన్ సిస్టమ్ ఫైల్స్‌లోకి యాడ్వేర్ రావొచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న నమ్మకమైన మొబైల్ సెక్యూరిటీ యాప్‌లు లేదా ఫోన్ డిఫాల్ట్ సెక్యూరిటీ స్కానర్‌ను ఉపయోగించి ఫుల్ సిస్టమ్ స్కాన్ చేయండి.
మీ ఫోన్‌లో సడన్ గా యాడ్స్ రావడం అనేది డిజిటల్ సేఫ్టీ పరంగా చిన్న హెచ్చరిక లాంటిది. కొంచెం అప్రమత్తంగా ఉండి, పైన తెలిపిన 5 పద్ధతులను పాటిస్తే.. మీ మొబైల్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు. ఎలాంటి తెలియని లింక్స్ క్లిక్ చేయకుండా.. అనధికారిక యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండటమే దీనికి శాశ్వత పరిష్కారం!