E-Paper
Advertisement

కళ్లకు చూపు లేదు.. కానీ పాటలతో ఫేమస్! రషీద్, సమీరా జీవితంలో ఇన్ని కష్టాలా?

కళ్లకు చూపు లేదు.. కానీ పాటలతో ఫేమస్! రషీద్, సమీరా జీవితంలో ఇన్ని కష్టాలా?
Advertisement

Folk Singer Rasheed:”మా వొళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ బువ్వలండుకున్న రంటో ..మా వొళ్ళు మా ఇంటి కాడా”అంటూ చిన్న తనంలోనే ఫోక్ సింగర్ గా అధ్బుతమైన జానపదాలని పాడిన రషీద్ గురించి పెద్దగా చెప్పాల్సినపని లేదు.కళ్ళు లేకపోయినా తనదైన సింగింగ్ టాలెంట్ తో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న రషీద్ తాజాగా తన భార్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా తన జీవితం గురించి ,ఎదురుకుంటున్న కష్ట నష్టాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు.

ఆరు ఏళ్ళ వయసు ఉన్నప్పుడే

Advertisement

నిజామాబాద్ కి చెందిన రషీద్ మాట్లాడుతూ తనకు ఆరు ఏళ్ళ వయసు ఉన్నప్పుడే పాటలు పాడేవానినని,అయితే తాను పాడగలను అన్న విషయాన్ని మాత్రం తన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించారని తెలిపాడు. ఇక తాను బ్లైండ్ లో స్కూల్ లో చదువుకున్నానని ,అక్కడికి వచ్చిన అష్ట గంగాధర్ అనే వ్యక్తి తన ప్రతిభని గుర్తించి బాగా ఎంకరేజ్ చేశాడని ,తానే తనకు మరిన్ని పాటలు నేర్పించి ఈవెంట్స్ కి తీసికెళ్ళేవాడని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.అయితే ఇలా ఒకవైపు పాటలు పాడటం,మరోవైపు చదువు కోసం స్కూల్స్,కాలేజీలు మారడంతో తన చదువు అంత సాఫీగా సాగలేదని అయినప్పటికీ పదోతరగతిని ఓపెన్ లో కంప్లీట్ చేసి,నిజామాబాద్ లోనే డిగ్రీ కూడా కంప్లీట్ చేశానని తెలిపాడు.అయితే ఎన్ని కష్టాలు పడ్డా ఎక్కడా వెనకడుగు వేయకుండా పాటలు పాడిన రషీద్ రాష్ట్ర స్థాయిలో జానపద బాలబ్రహ్మ పురస్కారం అందుకోవడం విశేషం.

సొంత ఇళ్ళు లేదు 

Advertisement

అయితే తనని ఇప్పటికీ ఎంతో మంది గుర్తు పట్టి తనని గౌరవిస్తారు .అందుకు సంతోషంగానే ఉంటుంది కాని కాని ఆ ఆదరణ, గుర్తింపు తన కష్టాలని తీర్చవని, పేరు వచ్చినంత మాత్రాన సమస్యలు తీరిపోవని స్పష్టం చేశారు.ఇక ప్రస్తుతం తాను సారధిలో ఉద్యోగం చేస్తున్నాని,ఐతే తాను ఉద్యోగం చేయడం, ఈవెంట్స్ చేయడం చూసి తాను వెల్ సెటిల్ అని అనుకోవద్దని,ఇప్పటికీ బస్ జర్నీనే చేస్తానని, తాను ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాననే విషయం తనని బాగా దగ్గరగా చూసిన వాళ్ళకే తెలుస్తుందన్నారు.

ఇక ఇంత పేరు వచ్చిందన్న మాటే కాని ఇప్పటికీ తనకు ఒక సొంత ఇల్లు లేదని, ప్రభుత్వ పథకాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కాని ,ఇందిరమ్మ ఇల్లు కాని పొందాలని ప్రయత్నిస్తున్నప్పటికీ రావట్లేదని,ఏంటో మంది నాయకులని కలిసి మోర పెట్టుకున్నా లాభం లేదని , ఎక్కడుందో తెలీదని వాపోయాడు.పైగా తనకి జాబ్ ఉందని ,పేరు కూడా ఉందని ,అలాంటి నీకు ఇళ్ళు ఎందుకంటూ ఎంతో మంది ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.తను ఎదుర్కున్న ఇబ్బందులు తన కూతురు ఫేస్ చేయకూడదనే తన తాపత్రయం అని చెప్పుకొచ్చాడు.

2020లో పెళ్లి

ఇక తన పెళ్లి విషయానికి వస్తే తానూ, సమీర 2020లో పెళ్లి చేసుకున్నామని ,అయితే సమీరా హిందూ అవడం, తను ముస్లిం అవడం వల్ల మొదట్లో ఎన్నో ఎన్నో ఇబ్బందుకు ఎదుర్కున్నామని బాధ పడ్డారు.అయినప్పటికీ ఇద్దరూ బ్లైండ్ కావడంతో తమ ఫ్యూచర్ ని తామే నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యామని తెలిపారు.

ఇక ఏంతో మంది తమని పిలిచి సరైన పారితోషికం ఇవ్వకుండా ఇవ్వకుండా పెట్టిన ఇబ్బందులని గుర్తు చేసుకున్నారు రషీద్, కొంతమంది తెలారితే ఫోన్ పే చేస్తామని పత్తా లేకుండా పోయేవారని ,మరికొందరు చెప్పిన దాని కన్నా చాలా తక్కువ ఇచ్చేవారని వాపోయారు.ఇక టీవీ ఛానల్స్ షోలకి పిలిస్తే చార్జీలు అడగడానికి చాలా మొహమాట పడ్డానని తెలిపాడు.

ఇక తనకి తోటి కళాకారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోందని మధుప్రియ, మంగ్లీ, హనుమంత్‌ యాదవ్‌, మిట్టపల్లి సురేందర్‌, సుద్దాల అశోక్‌ తేజ వంటి వారంతా తనని గుర్తుపెట్టుకొని పలకరిస్తారనిగుర్తుచేసుకున్నారు.

పాస్ పోర్ట్ కూడా లేదు 

ఇకపొతే  తనకి పాస్ పోర్ట్ లేదని అందువల్లే అమెరికా, మలేషియా, సింగపూర్‌, దుబాయ్‌ వంటి దేశాల్లో జరిగే సన్మాన కార్యక్రమాలకి హాజరు కాలేకపోయానని ఒక సారి దుబాయ్ లో సన్మానం ఉన్నప్పటికీ పాస్ పోర్ట్ లేకపోవడంతో ఆన్ లైన్ లోనే సన్మానం చేశారని గుర్తు చేసుకున్నాడు.మొత్తంగా రషీద్ తన జీవితంలో ఎదుర్కున్న అనుభవాలని ఇలా బయటపెట్టడం ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది.

తెలంగాణ యాంకర్ల పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారంటే!

Tags

Related News

రెండేళ్లలోపే అరుదైన ఘనత సాధించిన బిగ్ బాస్ మానస్ కొడుకు!

టాస్క్ ఎఫెక్ట్.. స్పీడ్ పెంచిన నరేష్.. వారిద్దరిపై వేటు తప్పదా?

నరేష్ కి బిగ్ బాస్ అన్యాయం.. ఆ ముగ్గురే విజేతలు!

Podarillu : కన్నా తల్లి నిజం చెప్తుందా..? ఇలాంటి ట్విస్ట్ నెవ్వర్ బిఫోర్..

Illu Illaalu Pillalu : సీరియల్లో మరో ట్విస్ట్.. ఆ క్యారక్టర్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనా పై ప్రశంసలు.. కన్నీళ్లు తెప్పించాడు భయ్యా..

Podarillu Today Episode : కన్నాకు మహా వార్నింగ్.. మహా నిజం చెప్తుందా..? మాధవ్ కన్నీళ్లు..

Big Stories

Advertisement
×