Gajulu Gajulu Gala Gala Song:గాజులు గాజులు.. గాజులు గల గల ..గాజులు గాజులు.. గాజులు గల గల..ఇపుడు ఎక్కడ చూసినా ఈ పాటే.దేవి నవరాత్రుల సందర్భంగా భవానీ మాల వేసిన రాధమ్మ కూతురు.కీర్తనలు అమ్మవారి సన్నిదిలో చేసిన ఈ పాట ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.అవును..ఎంతలా అంటే మూడు రోజుల్లోనే ఏకంగా 64 లక్షల మంది చూసేంతగా.దీంతో ఈ పాటకొచ్చిన క్రేజ్ చూసి ఇదెక్కడి మాస్ రా మామా.అసలు మూడు రోజుల్లోనే ఇన్ని వ్యూస్ రావడమెంట్రా అంటూ నోరెళ్ళ బెట్టేస్తున్నారు.
మూడు రోజుల్లోనే మిలియన్ల వ్యూస్
నిజానికి ఈ గాజులు గాజులు గాజులు గల గల పాట వచ్చిన మొదటి రోజు ఎక్కడా పెద్దగా వైరల్ అవ్వలేదు.కానీ చిన్నగా షేర్ అయిన ఈ పాట దసరా రోజు నాటికి ఒక్కసారిగా నెట్టింటిని చుట్టేసింది.దీంతో ఏ రీల్ చూసినా , ఏ పేజ్ ఓపెన్ చేసినా , ఎక్కడ మాట్లాడుకున్నా గాజులు గాజులు గాజులు గల గల అన్న పాట టాపిక్ లేకుండా ఉండట్లేదంటే పాట ఆడియన్స్ ని ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్థం అవుతుంది.సాధారణంగా కొత్తవాళ్ళు చేసిన కొత్త పాటలు ఆడియన్స్ లోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకుంటాయి.కానీ వచ్చిన మూడు రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు.
డివైన్ టచ్ కి మిక్స్ అయిన మాస్ టచ్
పాట విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా పాటని రాసిన రాధమ్మ కూతురు, కీర్తనలే పాటకి స్టెప్పులు వేయడం మెచ్చుకోతగ్గ విషయం.ఇక సింహాద్రి దుర్గం నిర్మాతగా , దర్శకుడిగా వ్యవహరించిన ఈ పాటకి నవీన్ సంబారి సంగీతం అందించిన ఈ పాటకి నరేందర్ నాయిని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డీఐ చేశారు.అయితే పాట డివైన్ టచ్ తోనే సాగినప్పటి కాసింత మాస్ టచ్ ఇవ్వడంతో ఆడియన్స్ ని,ముఖ్యంగా భక్తులని బాగా అట్రాక్ట్ చేసినట్టు కనిపిస్తుంది.
పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగెటివ్ కామెంట్స్
అయితే పాట రాగానే మిలియన్ల కొద్దీ వ్యూస్ రాగా పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగెటివ్ కామెంట్స్ రావడం గమనార్హం.ఇందులో కొందరు రాధమ్మ కూతురు, కీర్తన ల గొంతు బాగుందని, ఈ పాటకి సరిగ్గా సరిపోయిందని, అమ్మవారి దయ ఉండటం వల్లే వీరు ఇలా త్వరగా పాపులర్ అయ్యారని మెచ్చుకున్నారు.ఇక మరికొందరు అయితే ఇప్పటి వరకు వచ్చిన దుర్గమ్మ పాటలలో ఇదే హైలెట్ అంటూ ఆకాశానికి ఎత్తేయడం గమనార్హం.
ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !
అయితే పాటకి పాజిటివ్ కామెంట్స్ వచ్చినట్టే నెగెటివ్ గా కూడా కామెంట్స్ వదిలారు నెటిజన్లు. అసలు వీరికి ఏ మాత్రం భక్తి లేదని,కేవలం రీల్స్ కోసమే అయ్యప్ప మాల వేస్తున్నారని,సోషల్ మీడియాలో పాపులర్ కావడానికే ఇలా పాటలు పాడుతూ అమ్మవారిని అపహాస్యం చేస్తున్నారంటూ ఏకిపారేస్తున్నారు.అయితే కామెంట్స్ ఒకవైపు వస్తున్నప్పటికీ పాటకి ఎక్కడా క్రేజ్ తగ్గకుండా ఇంకా భారీ స్థాయిలో వ్యూస్ వచ్చి పడుతుండటం విశేషం. ఏది ఏమైనా కేవలం మూడు రోజుల్లోనే ఒక మామూలు భక్తీ పాట ఇలా వైరల్ బాట పట్టడం అంటే అంత ఆషామాషీ కాదు. చూడాలి మరి ముందు ముందు ఈ గాజులు గాజులు గాజులు గల గల పాట వచ్చే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !
ALSO READ :సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?