E-Paper
Advertisement

పెళ్లి, ప్రేమంటేనే గిట్టదు.. ఏకంగా ఆ బొమ్మల కంపెనీ ఓనర్‌తోనే… ట్రెండింగ్ కొరియన్‌ సిరీస్‌ తెలుగులో

పెళ్లి, ప్రేమంటేనే గిట్టదు.. ఏకంగా ఆ బొమ్మల కంపెనీ ఓనర్‌తోనే… ట్రెండింగ్ కొరియన్‌ సిరీస్‌ తెలుగులో
Advertisement

Korean Romantic Comedy Series: ప్రేమ, పెళ్లి విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరు ప్రేమ లేకుండా రిలేషన్‌షిప్‌ను ఊహించుకోలేరు. మరికొందరు ప్రేమకు, శారీరక ఆకర్షణకు సంబంధం లేదని భావిస్తారు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఒకే జీవితంలోకి వస్తే గొడవలు కామన్. కానీ పెళ్లి చూపుల్లో కలిసిన వ్యక్తే… కొన్నాళ్లకు ఆఫీస్‌లో క్లయింట్‌గా ఎదురైతే? అతడితో కలిసి పని చేయాల్సి వస్తే? అప్పటి వరకు ప్రేమ గురించి గట్టిగా నమ్మిన సిద్ధాంతాలు కూడా ప్రశ్నార్థకంగా మారితాయి. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘మేక్ మీ టింగిల్’ (Make Me Tingle). మరి ఈ బోల్డ్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

కథలోకి వెళ్తే…

గాంగ్ యోన్ సూ సంప్రదాయాలకు, కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇంట్లో పెరుగుతుంది. ప్రేమ విషయంలోనూ ఆమెకు కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. కేవలం ఆకర్షణ కోసం రిలేషన్‌షిప్‌ లోకి వెళ్లడం ఆమెకు ఇష్టం ఉండదు. తనకు కాబోయే వ్యక్తితో నిజమైన ప్రేమ, అనుబంధం ఏర్పడిన తర్వాతే జీవితంలో ముందడుగు వేయాలని అనుకుంటుంది. మరోవైపు యోన్ సూ కుటుంబ పెద్దలు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు.

Advertisement

అలా ఒకసారి పెళ్లి చూపుల్లో ఆమెకు డోక్గో దాల్ పరిచయమవుతాడు. అతను ఒక అడల్ట్ ప్రొడక్ట్స్ స్టార్టప్ కంపెనీకి సీఈఓ. ప్రేమ, శారీరక ఆకర్షణ గురించి యోన్ సూతో పోలిస్తే అతని ఆలోచనలు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రేమ లేకపోయినా శారీరక ఆకర్షణ ఉండొచ్చని అతను నమ్ముతాడు. అందుకే మొదటి పరిచయంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు బయటపడతాయి. ఆ పెళ్లి చూపులు కూడా వాళ్లిద్దరినీ దగ్గర చేయలేకపోతాయి.

అయితే కథ అక్కడితో ముగిసిపోదు. యోన్ సూ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మార్కెటర్‌ గా పని చేస్తుంటుంది. తన వృత్తిలో కొత్తగా ఏదైనా చేయాలని భావించి ఒక ప్రాజెక్ట్‌ బాధ్యత తీసుకుంటుంది. తీరా చూస్తే ఆ ప్రాజెక్ట్‌ కు క్లయింట్‌గా వచ్చిన వ్యక్తి మరెవరో కాదు… గతంలో పెళ్లి చూపుల్లో కలిసిన డోక్గో దాల్‌నే.

Advertisement

ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి ప్రొఫెషనల్‌ గా పని చేయాల్సిన పరిస్థితి యోన్ సూకు ఎదురవుతుంది. కంపెనీ ఉత్పత్తుల గురించి ఆమెకు పెద్దగా అవగాహన ఉండదు. మరోవైపు తన వ్యాపారాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని మార్కెటర్‌ తో కలిసి పని చేయడం దాల్‌ కు కూడా సవాలుగా మారుతుంది. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. చిన్న విషయాలకే వాదించుకోవడం, ఒకరి అభిప్రాయాలను మరొకరు తప్పుబట్టడం రొటీన్ అవుతుంది.

కానీ కలిసి పని చేసే కొద్దీ ఒకరి గురించి మరొకరికి తెలియని విషయాలు బయటపడతాయి. యోన్ సూ తన నమ్మకాల గురించి మరోసారి ఆలోచించాల్సి వస్తుంది. దాల్ కూడా ప్రేమను కేవలం శారీరక ఆకర్షణకే పరిమితం చేయగలమా అనే ఆలోచనలో పడతాడు. వీళ్లిద్దరి మధ్య మొదలైన గొడవలు క్రమంగా ఆకర్షణగా మారుతాయా ? ప్రేమ విషయంలో ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకుంటారా ? లేక తమ సిద్ధాంతాలే వాళ్లను దూరం చేస్తాయా ? అన్నదే ఈ సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం.

ఓటీటీలో తెలుగులో ఉందా?

‘మేక్ మీ టింగిల్’ అక్టోబర్ 2026లో విడుదలైన కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్. యోన్ సూ పాత్రలో నామ్ జీ-హ్యున్ (Nam Ji-hyun), డోక్గో దాల్ పాత్రలో కిమ్ జే-యంగ్ (Kim Jae-young) నటించారు. భారతదేశంలోని ఆపిల్ టీవీ (Apple TV) లిస్టింగ్‌లో తెలుగు ఆడియో అందుబాటులో ఉంది. అలాగే ప్రైమ్ వీడియోలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అదికూడా తెలుగులో. డిఫరెంట్ రొమాంటిక్ కథలు ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చొచ్చు. ముఖ్యంగా ఇద్దరు పూర్తిగా భిన్నమైన వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో వచ్చే కామెడీ, రొమాన్స్ ఈ కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Read Also: వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

Tags

Related News

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

Big Stories

Advertisement
×