E-Paper
Advertisement

మనిషి ముసుగులో మృగాలు: చరిత్రలో అత్యంత క్రూరమైన సీరియల్ కిల్లర్లు

మనిషి ముసుగులో మృగాలు: చరిత్రలో అత్యంత క్రూరమైన సీరియల్ కిల్లర్లు
Advertisement

Serial Killers : ఒకరిని చంపితే కిల్లర్ అంటాం,వరుస పెట్టి చంపితే సీరియస్ కిల్లర్ అంటాం.అదే లెక్కపెట్టలేని సంఖ్యలో చంపితే వాళ్ళని మృగాళ్ళు అంటాం. మరి అంత్యంత పాశవికంగా అంతులేని రక్తపాతాన్ని పారించి చరిత్రలో తమకంటూ ఓ బ్యాడ్ చాప్టర్ రాసుకున్న ఆ మృగాళ్ళు ఎవరో అసలేం చేశారో చూసేద్దామా !

హెరాల్డ్ షిప్‌మన్

Advertisement

వీళ్ళలో మొదటగా చెప్పుకోవాల్సింది హెరాల్డ్ షిప్‌మన్ గురించి.పేరుకేమో పెద్ద డాక్టర్.కాని అదే డాక్టర్ వృత్తిని అడ్డం పెట్టుకొని ఏంతో మందికి అవసరం ఉన్నా లేకపోయినా ‘డయామార్ఫిన్’ ని అనే మందుకి వాళ్ళలోకి ఇంజెక్ట్ చేసేవాడు.దాంతో వాళ్ళు చనిపోయాక సహజంగానే చనిపోయారంటూ డెత్ సర్టిఫికేట్ ఇచ్చేవాడు. డాక్టర్ కదా నిజమై ఉంటుందిలే అనుకునే వారంతా.
అయితే హెరాల్డ్ చంపిన వాళ్ళలో ఎక్కువగా ముసలి వాళ్ళే ఉండేవారు.ట్రీట్ మెంట్ కంటూ రావడం, డాక్టర్ చేతిలో చావడం,నార్మల్ డెత్ అంటూ సర్టిఫికేట్ ఇవ్వడం అంతా సాఫీగానే సాగింది .అలాగే కంటిన్యూ అయుంటే మనమీపాటికి మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు కూడా. మరి ఇంతటి టాలెంటెడ్ ఫెలో ఎలా దొరికిపోయాడో తెలుసా..
థలీన్ గ్రుండీ అనే పేషెంట్ దగ్గర. మాములుగా మిగతా వాళ్ళలా అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ ఇతగాడు కక్కుర్తితో ఆమె పేరు మీద ఉన్న విల్లుని మార్చి 3,86,000 పౌండ్ల ఆస్తిని తన పేరు మీద రాసుకోవడంతోనే సీన్ రివర్స్ అయింది. థలీన్ కూతురు అసలే లాయర్.ఊరుకుంటుందా..ఆరాలు తీసి హెరాల్డ్ అసలు రంగు బయట పెట్టింది.ఇంకేం పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఈ మృగాన్ని పట్టుకొని బొక్కలో తోశారు.మరి చేసిన పాపాలకి ప్రాయిచిత్తం అనుకున్నాడో ఏమో ..2004లో జైలులోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

హెచ్.హెచ్. హోమ్స్

Advertisement

హెరాల్డ్ సంగతి ఇలా ఉంటె హెచ్.హెచ్. హోమ్స్ అనే మృగాడిది మరో స్టోరీ.ఇతగాడి కున్న తెలివితేటలని సరైన దారిలో పెట్టుంటే మరోలా ఉండేది.ఇతడెం చేశాడో తెలుసా.. 1893లో షికాగో వరల్డ్ ఫెయిర్ సమయంలో హోటల్ అంటూ ఒకపెద్ద బిల్డింగ్ కట్టాడు.అది హోటల్ లాగే ఉంటె బానే ఉండేది.కాని దాన్ని శవాల దిబ్బలా మార్చడంతోనే అసలు సమస్య. అవును ..ఆ హోటల్ లో ఆగుతూ,వెళ్ళే లిఫ్ట్ లు , ఎక్కడికి దారి తీయని మెట్లు,కిటీకీలు లేని గదులు,లోపల అసలేం జరుగుతుందో కూడా బయటికి తెలీని విధంగా సౌండ్ ప్రూప్ రూములు..ఇలా హోటల్ ని హోటల్ లా కాకుండా ఒక మిస్టీరియస్ బిల్డింగ్ లా మార్చేశాడు. అంటే ఎవరైనా ఆ హోటల్ లో అడుగుపెడితే బయటికి రావడం అనేది ఉండదన్న మాట. ఒకరకంగా చెప్పాలంటే ఆ బిల్డింగ్ ప్లాన్ హోమ్స్ దగ్గర మాత్రమె ఉండేది.హోటల్ కావాలని వచ్చిన వారిని గ్యాస్ చాంబర్స్ గా మార్చిన గదుల్లో, శవాలని తగలెట్టేలా ప్లాన్ చేసిన రూముల్లో బందించేవాడు. ఇక వారు బయటికి తప్పించుకోకుండా పాయిజన్ గ్యాస్ ని వదిలేవాడు.అలా చనిపోయిన వారిని బిల్డింగ్ కింద ఉన్న యాసిడ్ బాత్ లలో వేసి కరిగించేవాడు. అంటే కాదండోయ్ ఆ బాడీలలో ఎముకలని, ఆస్థి పంజరాలని వేరు చేసి మెడికల్ కాలేజీలకి కూడా అమ్మేవాడు.అంతటి క్రూర మృగాడైన హోమ్స్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని ‘ది డెవిల్ ఇన్ ద వైట్ సిటీ’ అనే పుస్తకం కూడా వచ్చింది.

టెడ్ బండీ

ఇక మూడవ వాడు టెడ్ బండీ. ..ఇతన్ని చూస్తె ఇప్పుడే రెడీ అయిన ఆఫీస్ మేనేజర్ లా చాలా పద్దతిగా ఉండేవాడు.కాని సూట్ వేసుకున్న సైకో అని అతని చేతిలో చనిపోయిన ఆడాళ్ళకే తెలీదు పాపం. కిల్లింగ్ చేయడంలో ఇతగాడి స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా ..టార్గెట్ చేసిన అమ్మాయిల ముందర చేయికి దెబ్బ తగిలినట్టు, ఒంట్లో ఎదో అయిపోయినట్టు ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేసేవాడు.అదీ వర్కౌట్ అవ్వకపోతే పోలీస్ ఆఫీసర్ గా నటించేవాడు.
వాళ్ళు గనుక పొరపాటున టెడ్ బండీ దగ్గరికి వచ్చారంటే వారికి మూడినట్టే.యస్ .ఇలా వచ్చారో లేదో వాళ్ళపై ఎటాక్ చేసి దారుణంగా చంపేవాడు.పైగా ఆ డెడ్ బాడీల వద్దకి మళ్ళీ మళ్ళీ వెళ్లి క్రూరంగా ప్రవర్తించేవాడు.అలా ఒకరిద్దరు కాదండోయ్ ..అతను చేసిన ఆ వరుస హత్యల కారణంగానే సీరియల్ కిల్లర్ అనే పేరు ప్రపంచానికి మరింత రీచ్ అయ్యింది.అయితే దొరికిపోయాక ఇంత చేసినా అతడు అబ్బే నేను నిర్దోషిని నాకేం సంబంధం లేదంటూ సొంతంగా వాదించుకోవడం గమనార్హం.ఫైనల్ గా ప్రూఫ్స్ చూపించి బొక్కలో వేస్తె ఒకసారి జైలు పైకప్పు నుండి, మరోసారి లైబ్రరీ కిటికీ నుండి రెండు సార్లు దూకి ఎస్కేప్ అయ్యాడు.కాని మనోడి దురదృష్టం బాగుండి చివరకు ఫ్లోరిడాలో అడ్డంగా దొరికిపోయాడు.చివరికి 1989లో ఎలెక్ట్రిక్ చైర్ తో మరణశిక్ష విధించారు.ఇక ఇతనిపై ‘ఎక్స్‌ట్రీమ్లీ విక్డ్, షాకింగ్లీ ఈవిల్ అండ్ విలే’ అనే సినిమా వచ్చింది కూడా.

ALSO READ:‘కట్’ చెప్పినా హీరోయిన్లను వదలరు.. హీరోల రాసలీలలపై అన్ను కపూర్ హాట్ కామెంట్స్!

జాన్ వేన్ గేసీ

ఇక నాలుగో వాడు జాన్ వేన్ గేసీ ..స్థానిక డెమోక్రటిక్ పార్టీలో మెంబర్ గా ఉండే ఇతగాడు ఎలాగోలా అమెరికా ప్రథమ మహిళ రోసలిన్ కార్టర్‌తో ఫోటో దిగి అది అడ్డం పెట్టుకుని యూత్ కి పని ఇస్తానని ఇంటికి పిలిచి బంధించి చచ్చిపోయేదాకా చిత్రహింసలు పెట్టేవాడు.ఇక సొసైటీలో పెద్ద మనిషిగా రాజకీయనాయకుడిగా, బిజినెస్ మ్యాన్ గా ముసుగు వేసుకున్న ఈ మృగాడు చిన్న పిల్లలపట్ల చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు.ఏ చిన్న పిల్లలని నవ్వించడానికి చారిటీ కార్యక్రమాల్లో ‘పోగో’ అనే క్లౌన్ వేషం వేసేవాడో అదే చిన్న పిల్లలని అత్యంత దారుణంగా చంపేవాడు.చేసిన పాపం ఎప్పుడైనా పండుతుంది అని చివరిగా 1978లో తప్పిపోయిన ఒక పిల్లాడిని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకి పెద్ద షాక్ తగిలింది. జాన్ వేన్ గేసీ ఇంట్లో సోదాలు చేస్తే ఫ్లోర్ కింద ఏకంగా 29 మంది చిన్న పిల్లల డెడ్ బాడీలు కుళ్ళిన స్థితిలో దర్శనమిచ్చాయ్.ఇంత చేసినా ఉరి తీసే ముందు ఏమన్నాడో తెలుసా.. “Kiss my ass ” అని .దీని బట్టే అర్థం చేసుకోవచ్చు అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉందొ.అలా హారర్ సినిమాల్లోని ఈవిల్ క్లౌన్ పాత్రలకు ఒక ఇన్స్పిరేషన్ గా అయిపోయాడు.

థగ్ బెహ్రామ్

ఇక ఈ జాబితాలో ఐదో వాడు థగ్ బెహ్రామ్ .ఇతనికున్న రికార్డ్ ఏంటో తెలుసా..ప్రపంచంలో ఎక్కువ మర్డర్స్ చేసింది ఇతనే అని.యస్ గిన్నీస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది మరి.ఇతగాడి కిల్లింగ్ స్టైల్ ఎలా ఉండేదంటే 1790-1840 మధ్య దాదాపు 200 మంది గ్యాంగ్‌తో టూరిస్టులతో ఫ్రెండ్లీ గా ఉంటూ వారిపై ఎటాక్ చేసేవాడు. దొరికిన వాళ్ళని ఒక పసుపు కలర్ ఉన్న కర్చీఫ్ లో ఒక కాయిన్ ని పెట్టి గొంతుకి బిగించి చంపేవాడు.ఇక ఈ గ్యాంగ్ మధ్య రామసి అనే ఒక సీక్రెట్ లాంగ్వేజ్ కూడా నడించేదంటే అర్థం చేసుకోవచ్చు.ఎంతలా ప్లాన్ చేసి పకడ్బందీగా హతమార్చేవారో.ఇక ఇతగాడి హత్యలకి హద్దు అదుపు లేకపోవడంతో చివరికి ఆపరేషన్ విలియం స్లీమాన్ అనే బ్రిటిష్ ఆఫీసర్ అండర్ లో ఏకంగా ‘థగ్గీ అండ్ డకాయిటీ డిపార్ట్‌మెంట్’ నే ఏర్పాటు చేసింది బ్రిటీష్ సర్కార్.ఎట్టకేలకి ఎన్నో ఎల్లా ఆపరేషన్ తర్వాత బెహ్రామ్‌ను 1840లో పట్టుకుని ఉరితీశారు. ఇక థగ్ స్టోరీని ఆధారం చేసుకొనే ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’వంటి సినిమాలు ఇన్స్పైర్ అయి వచ్చాయ్.

ALSO READ: చూడటానికి సాఫ్ట్.. కానీ మాటల్లో ఫైర్! కరిష్మా కపూర్ నెగెటివ్ వీడియో వైరల్!

పెడ్రో లోపెజ్

ఇదే జాబితాలో ఆరోవాడు పెడ్రో లోపెజ్. మాన్స్టర్ ఆఫ్ ది ఆండీస్ గా పిలవబడే ఇతగాడికి పేద కుటుంబాలకి బాలికలే టార్గెట్ .అలా దక్షిణ అమెరికా దేశాలను వణికించిన పెడ్రో ఎంతమందిని చంపాడో తెలుసా..అక్షరాల 310 మందిని.ఇతడి గురించి అసలు విషయం తెలీగానే చేసిన తనికీలో ఒక్క ఈక్వెడార్‌లోనే 110 మంది బాలికల అస్థిపంజరాలు దొరికాయంటే ఎంతటి మారణహోమం సాగించాడో అర్థమవుతుంది. అయితే ఇంతటి కారుడు కట్టిన మృగాడికి పడ్డ శిక్ష ఏంటో తెలుసా..కేవలం 18 ఏళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆ దేశ చట్టాల ప్రకారం అదే హయ్యెస్ట్ మరి.అయితే శిక్ష కంప్లీట్ చేసుకొని 1998లో రిలీజ్ అయిన యితడు మళ్ళీ హత్యలు చేయడం మొదలుపెట్టాడన్న అనుమానాలు ఉన్నాయ్.కానీ ఇతని కోసం ఇంటర్పోల్ “రెడ్ కార్నర్ నోటీసు” జారీ చేసినప్పటికీ ఇతగాడి జాడ ఇప్పటికీ దొరకకపోవడం గమనార్హం.

జాక్ ద రిప్పర్

ఇక వీరిలో చివరి వ్యక్తి జాక్ ద రిప్పర్ . రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని, లేదా ఒక సర్జన్ అని ప్రచారంలో ఉన్న ఇతను అందరిలా ఇతను వందల మందిని చంపలేదండోయ్.జస్ట్ ఐదంటే ఐదు మందినే హత్య చేశాడు,అయినప్పటికీ ఈ లిస్టు లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడో తెలుసా..చంపిన వాళ్ళని ఒక పద్దతిగా బాడీలోని ఒక్కో ముక్కని సర్జన్ కట్ చేసినట్టుగా కట్ చేస్తూ వికృతానందం పొందేవాడు.ఇక ఇతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకి From Hell’ అనే లేఖతో పాటు ఒక బాధితురాలి కిడ్నీ ముక్కను కూడా పంపడం గమనార్హం. అయితే డియర్ బాస్ అంటూ పోలీసులని సవాల్ చేస్తూ లెటర్స్ రాసినప్పటికీ వందల ఏళ్లుగా అతడు ఎవరో ఏంట ఎలా ఉంటాడో బయటపడకపోవడం విచిత్రం.ఇక జాక్ హత్యలు చేశాడని పేరున్న లండన్‌లోని ‘వైట్‌చాపెల్ ప్లేస్ ఇపుడు టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది .ఇంకెవరూ అలా హత్యలు చేయకూడదని మోటివేషన్ ఇచ్చేందుకేమో!
సో అదీ ప్రపంచంలో కరుడు గట్టిన ఏడుగురు మృగాళ్ళ కథ !

ALSO READ :గాయపడ్డ సింహం రివ్యూ…గాయపడ్డ సింహం గర్జించిందా లేదా?

Tags

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×