BigTV English

GundeNinda GudiGantalu Today Episode : భర్త కోసం బంగారం ఇచ్చిన ప్రభావతి.. రవిని పంపించిన రంగా..

GundeNinda GudiGantalu Today Episode : భర్త కోసం బంగారం ఇచ్చిన ప్రభావతి.. రవిని పంపించిన రంగా..

Gundeninda GudiGantalu Today episode నవంబర్ 2nd:  నిన్నటి ఎపిసోడ్లో.. బాలు డబ్బుల కోసం అన్ని చోట్ల వెతుకుతాడు. సేటు దగ్గరకు వెళ్తే అవమానిస్తాడు. డబ్బులు లేవని అంటాడు. ఇక బాలు తన కారును అమ్మేద్దామని అనుకుంటాడు. ఒక అతను రావడంతో కారును అమ్మేస్తాడు. డబ్బులను తీసుకొని వచ్చి ఆసుపత్రిలో కడతాడు. ఇక రవి మౌనికకు ఫోన్ చేసి ఏమైందని అడుగుతాడు. దానికి షాక్ అయిన నాన్నకు హర్ట్ ఆటాక్ వచ్చిందని చెప్పడంతో రవి కంగారు పడుతూ శృతి చెప్తాడు. శృతి డబ్బులు కావాలేమో అని చెక్ ఇస్తుంది. ఇక హాస్పిటల్ కు వెళ్లిన రవిని అక్కడ సత్యం ను చూడటానికి ఎవరు ఒప్పుకోరు. ఇంకా ఏం చూడటానికి వచ్చావు.. మీ నాన్నను పోలీస్ స్టేషన్‌లో నిలబెట్టి పరువు పోయేలా చేశావు.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చావు.. ఇంకా ఆయనకు ఏం జరగాలని కోరుకుంటున్నావని రవిపై ప్రభావతి కోపడుతుంది. ఇక బాలు వచ్చింది ఎవరు రా నువ్వు అంటాడు.. ఇక గొడవ జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవీతో బాలు గొడవ పడి బయటకు పంపిస్తాడు. నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్లిపో అని రవిని నెట్టేస్తాడు బాలు. నేను మీలాగే ఆయనకు కొడుకునే…ఆయన్ని చూడకుండా నన్ను ఎందుకు ఆపుతున్నావని బాలుకు ఎదురుతిరుగుతాడు రవి. అతడి మాటలతో బాలు కోపం పట్టలేకపోతాడు. రవిని కొట్టడానికి వెళతాడు.. అన్నయ్య ఇప్పటికే నన్ను చాలా సార్లు కొట్టావు ఇక ఇప్పుడు కూడా కొట్టు.. మీ లాగే నేను ఆయన కొడుకునే కదా అని అంటాడు. కానీ బాలు వినడు. ఇక లాభం లేదు చంపేస్తాను అంటాడు. నాన్న ఆపరేషన్ కోసం డబ్బులను తీసుకొని వచ్చాను అంటాడు. నువ్వు ఎవరు ఇవ్వడానికి నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాలు కోపంగా అంటాడు.

ఇప్పుడు నాన్నకు సీరియల్‌గా ఉంటే నన్ను ఎందుకు ఆపుతున్నావు. నేను కూడా మీలాగే ఆయనకు కొడుకునే కదా అని బాలుకు ఎదురుచెబుతాడు రవి. మాటలతో చెబితే రవి వినడని అర్థం చేసుకున్న బాలు అతడిని కొట్టడానికి చెయ్యేత్తుతాడు బాలును మనోజ్ ఆపేస్తాడు. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని రోహిణి, రంగా మావయ్య రవి పంపించేస్తారు. మాతో సంబంధం లేదని నీ దారి నువ్వు చూసుకున్నావు కదా అక్కడికే వెళ్లమని రవితో అంటుంది ప్రభావతి. అమ్మా అని అడిగితే వేళ్ళు నీ నాదారి నీది ఇక్కడ ఉండకు అని చెప్పడంతో రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ రెండు లక్షలు ఎలా రా అని బాలును అడుగుతాడు. ఊరంతా తిరిగే వచ్చాను ఇక ఎవరిని అడగాలి అని అంటాడు. కానీ ప్రభావతి ఎవరిని ఆడొగొద్దు.. ఈ బంగారు తీసుకొని వెళ్లి కట్టు అని అంటుంది. ఇవి ఆయన చేయించినవే.. తీసుకెళ్ళు కట్టు సరిపోకుంటే పుస్తెలు కూడా తీసుకెళ్ళు అంటుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ ఎమోషనల్ అవుతారు.


ఇక డబ్బులను కట్టేసి ఆపరేషన్ చేయిస్తారు. ఇక అందరు చూడటానికి అక్కడకు వెళ్తారు. అప్పుడే బాలును డాక్టర్ పిలిస్తే అక్కడకు వెళ్తాడు.. లోపల రంగా ఉంటాడు. జ్యోతిష్యురాలు ఇచ్చిన కంకణాన్ని సత్యానికి కట్టే టైమ్ కోసం మీనా ఎదురుచూస్తుంటుంది. డాక్టర్ పిలవడంతో బాలు, ప్రభావతి తో పాటు మిగిలిన కుటుంబసభ్యులు అతడి రూమ్‌కు వెళతారు. రంగా మావయ్య ఒక్కడే సత్యం దగ్గర ఉండటంతో ఇదే మంచి టైమ్‌గా భావించిన మీనా ఐసీయూ దగ్గరకు వస్తుంది.. పూజ చేసి తాయత్తు తెచ్చానని కట్టేసి వెళ్లిపోతానని రంగా మావయ్యతో మీనా అంటుంది. ఈలోపు బాలు వస్తే మళ్లీ పెద్ద గొడవ అవుతుందని రంగా మావయ్య భయపడిపోతాడు. రంగా మాట వినకుండా రెండు నిమిషాల్లోనే బయటకు వస్తానని మీనా ఐసీయూ లోపలికి వెళుతుంది.. ఇక ఐసీయూలో బెడ్‌పై ఉన్న సత్యాన్ని చూసి మీనా ఎమోషనల్ అవుతుంది. సత్యం చేతికి కంకణం కట్టబోతుండగా అప్పుడే ప్రభావతి, రోహిణి ఐసీయూలోపలికి వెళ్లబోతారు. వారిని చూసి రంగా కంగారు పడతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి, రోహిణిలకు మీనా కనిపించిందా?తన పర్మిషన్ లేకుండా తండ్రి రూమ్‌లోకి ఎంటరైన మీనాకు బాలు ఏ పనిష్‌మెంట్ విధించాడు? తండ్రిని బాలు కాపాడుకున్నాడా? లేదా? తండ్రిని చూసే అవకాశం తనకు దక్కకపోవడంతో ఎమోషనల్ అయినా రవిని శృతి ఎలా ఓదార్చింది.. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Big Stories

×