BigTV English

సార్ నేను బతికే ఉన్నా..పోస్ట్ మార్టంకు వెళుతుంటే లేచి కూర్చున్నాడు..!

సార్ నేను బతికే ఉన్నా..పోస్ట్ మార్టంకు వెళుతుంటే లేచి కూర్చున్నాడు..!

చ‌నిపోయాడ‌నుకున్న వ్య‌క్తి లేచి నిలుచున్నాడు. మ‌రికొద్ది నిమిషాల్లో పోస్ట్ మార్టం ఉంటుంద‌నగా సార్ నేను బ‌తికే ఉన్నా అంటూ లేచి కూర్చున్నాడు. నిజానికి ఇలాంటి ఘ‌ట‌న‌లు సినిమాల్లోనే జ‌రుగుతుంటాయి. ఓ సినిమాలో సంపూర్ణేష్ బాబు తీవ్ర‌గాయాల‌తో మ‌ర‌ణించి చితిలో నుండి లేచి వ‌స్తాడు. అయితే ఇలాంటి ఘ‌టనే రియ‌ల్ లైఫ్ లోనూ జ‌ర‌గ‌టం ఆశ్చ‌ర్య‌క‌రం. వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. మేరట్ జిల్లా గోట్కా గ్రామానికి చెందిన ష‌గుణ్ శ‌ర్మ అనే యువ‌కుడు త‌న సోద‌రుడితో క‌లిసి బుధ‌వారం రాత్రి క‌తౌలి వైపున‌కు వెళుతుండ‌గా వేగంగా వ‌చ్చిన ఓ వాహ‌నం ఢీ కొట్టింది.


ఈ ఘ‌ట‌న‌లో ష‌గుణ్ తీవ్రంగా గాయ‌డ‌ప‌డ్డారు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వెంట‌నే మేర‌ట్ లోని వైద్య క‌ళాశాల‌కు చికిత్స కోసం త‌ర‌లించారు. అక్క‌డి వైద్యులు యువ‌కుడిని చూసి అప్ప‌టికే చ‌నిపోయాడ‌ని నిర్దారించారు. దీంతో అత‌డిని మార్చ‌రీకి త‌ర‌లించే ఏర్పాట్లు చేశారు. అదే స‌మ‌యంలో పోస్టు మార్టం చేసేందుకు డాక్ట‌ర్ తీసుకువెళుతుండా ష‌గుణ్ ఒక్క‌సారిగా లేచి కూర్చున్నాడు. సార్ నేను బ‌తికే ఉన్నా అంటూ కేక వేశాడు. వెంట‌నే పోస్టుమార్టం చేసే డాక్ట‌ర్ సైతం ఆశ్చ‌ర్య‌పోయాడు. తిరిగి అత‌డిని ఎమ‌ర్జెన్సీ వార్డుకు త‌ర‌లించారు. ప్రస్తుతం అత‌డికి వైద్యం చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై వైద్య కళాశాలప్రిన్సిప‌ల్ సీరియ‌స్ అవ్వ‌డంతో పాటు విచారణ‌కు ఆదేశించాడు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మీడియాకు తెలిపారు. ఇక ఈ ఘ‌ట‌న‌లో డాక్ట‌ర్ల నిర్వాకం క్లియ‌ర్ గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొన ఊపిరితో ఉన్న‌ప్ప‌టికీ ప‌ల్స్ కొట్టుకుంటుంది. అలాంటిది పేషెంట్ మాట్లాడే స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ డాక్ట‌ర్లు చ‌నిపోయాడ‌ని మార్చ‌రీకి పంపడం దారుణం. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి చోటు చేసుకోవ‌ద్దంటే స‌ద‌రు డాక్ట‌ర్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్స్ వ‌స్తున్నాయి..


Related News

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Big Stories

×