E-Paper
Advertisement

CM Revanth Reddy: మెస్సీ తో ఫుట్ బాల్ మ్యాచ్..బ‌రిలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మెస్సీ తో  ఫుట్ బాల్ మ్యాచ్..బ‌రిలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) కొత్త అవతారంలో కనిపించారు. రాజకీయ నాయకుడు గానే కాకుండా, తనలో ఫుట్ బాల్ ప్లేయర్ ఉన్నాడని మరోసారి గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారింది. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ నగరానికి అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి (Lionel Messi) రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆ రోజున హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి తో ఫుట్ బాల్‌ మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

ఫుట్ బాల్‌ ప్లేయర్ గా మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Advertisement

ఫుట్ బాల్‌ ప్లేయర్ల లాగా జెర్సీ ధరించి, సామాన్యుడిలాగా అందరిలో కలిసిపోతున్నారు డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి. MCHRD గ్రౌండ్ లో ప్రొఫెషనల్ ప్లేయర్లతో కలిసి మ్యాచ్ కూడా ఆడారు. గ్లోబల్ సబ్మిట్ ముగింపు సందర్భంగా జరగనున్న ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లో RR-9 జట్టు తరుఫున తెలంగాణ ముఖ్యమంత్రి 9వ నెంబర్ జెర్సీలో బరిలోకి దిగ‌బోతున్నారు. LM-10 జట్టు తరుఫున పదవ నెంబర్ జెర్సీలో లియోనెల్ మెస్సి బరిలో దిగనున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ కూడా ఖ‌రారు అయింది.

సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ తో ఫుట్ బాల్ ఆడ‌టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. క్రీడా స్ఫూర్తి… తెలంగాణ కీర్తి అన్నారు. ఈ నెల 13 న ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ తో ఫుట్ బాల్ క్రీడలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ ప్రారంభించానని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ ను క్రీడా వేదిక నుండి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచన నేపథ్యంతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగానన్నారు. అంతేకాదు, సోమ‌వారం తాను ప్రాక్టీస్ చేసిన వీడియోలు పంచుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన‌ ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Advertisement

కాగా, ప్రపంచ ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్ రాబోతున్నారు. డిసెంబర్ 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఆయన మ్యాచ్ కూడా ఆడతారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్ తో పాటు సెలబ్రిటీల ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

 

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×