E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ యాక్టర్స్ ఏజ్.. మీనా వయసు ఎంతంటే..?

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ యాక్టర్స్ ఏజ్.. మీనా వయసు ఎంతంటే..?
Advertisement

Gundeninda Gudigantalu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు కూడా ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్కు జనాలు నిరాజనం పలుకుతున్నారు.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో ప్రతి సీరియల్ ని మిస్ అవ్వకుండా జనాలు చూస్తున్నారు.. అందుకే ఈ మధ్య ఇక్కడ ప్రచారం అవుతున్న సీరియల్స్ కి మంచి టిఆర్పి రేటింగ్ నమోదు అవుతుంది. అయితే ఎక్కువ మంది తెలుగు ఆడియన్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.. కేవలం సీరియల్స్ చూడడం మాత్రమే కాదు.. ఆ సీరియల్ లో నటిస్తున్న యాక్టర్స్ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు.. ఇప్పుడు మనం ఈ సీరియల్ యాక్టర్స్ రియల్ ఏజ్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

‘గుండెనిండా గుడిగంటలు’ యాక్టర్స్ ఏజ్.. 

బాలు.. 

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్నాడు బాలు.. ఈయన తెలుగు నటుడు కాదు తమిళ నటుడు.. ఇతని అసలు పేరు విష్ణుకాంత్.. తమిళ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్టర్ ప్రస్తుతం తెలుగులో గుండెనిండా గుడి గంటలు సీరియల్ ద్వారా అడుగు పెట్టాడు. ఈ సీరియల్ అతనికి మంచి క్రేజ్ ని అందించింది. అంతే కాదండోయ్ రెమ్యూనిరేషన్ కూడా దాదాపు 50 వేలకు పైగా తీసుకుంటున్నాడు. ఈ లెక్కను చూస్తే ప్రతినెల అతనికి లక్షల్లోనే రెమ్యూనరేషన్దక్కుతుంది.. ఇకపోతే ఈ బాలు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అతనికి ఆల్రెడీ పెళ్లయి విడాకులు అయ్యాయి.. ప్రస్తుతం అతని వయసు 38 సంవత్సరాలు.. అయితే మొదటి పెళ్లి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు అతను పెళ్లి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.

మీనా.. 

Advertisement

ఈ సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది మీనా.. ఈమె అసలు పేరు అమూల్య గౌడ.. ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కార్తీకదీపం సీరియల్ లో చిన్న పాత్రలో నటించింది. ఇప్పుడు ఈ సీరియల్ లో ఏకంగా హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. మీనా ఇంకా పెళ్లి చేసుకోలేదు.. కన్నడ నటుడు నిరంజన్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈమె వయసు 30 సంవత్సరాలు.

మౌనిక.. 

ఈ సీరియల్లో ముగ్గురు అన్నల ముద్దుల చెల్లెలు మౌనిక పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. భర్త టార్చర్ భరించలేక మామ గారి పోడు భరించలేక, పుట్టింటిలో తన బాధల్ని చెప్పుకోలేక, తనలో తానే బాధపడుతూ ముందుకు సాగే ఒక మామూలు అమ్మాయి పాత్రలో ఆమె నటించింది.. ఈమె అసలు పేరు జ్యోతి గౌడ.. ఈమె కూడా కన్నడ నటే.. ఈమె వయసు ప్రస్తుతం 26 సంవత్సరాలు.

ప్రభావతి.. 

Advertisement

ఈ సీరియల్లో తల్లి పాత్రలో నటించింది ప్రభావతి. డబ్బుపై వ్యామోహంతో కోడల నుంచి డబ్బులు రావాలని ఆశతో బ్రతుకుతూ ఉంటుంది. అయితే తన ముగ్గురు కోడళ్లో ఒక కోడలు మాత్రం పూల అమ్ముకునే ఇంటి నుంచి వస్తుంది. ఆమెని చాలా చులకనగా చూస్తూ ప్రతి విషయంలోనూ బాధ పెడుతూ ఉంటుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే గయ్యాలి అత్త పాత్రలో నటిస్తుంది. ఈమె అసలు పేరు అనీలా.. ఈమె మలయాళ నటి.. తెలుగులో ఇప్పటికే పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం ఈమె వయసు 53 సంవత్సరాలు..

Also Read :

అలాగే ఇందులో నటించిన శృతి వయసు 32 సంవత్సరాలు, ప్రస్తుతం రోహిణి పాత్రలో నటిస్తున్న జ్యోతి వయసు 30 సంవత్సరాలు.. ఇక మనోజ్ పాత్రలో నటిస్తున్న వ్యక్తి వయసు 32.. ఈ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నా సుశీలమ్మ అలియాస్ డబ్బింగ్ జానకి వయసు దాదాపు 70 సంవత్సరాలకు పైగానే ఉంటుంది.. ఈ సీరియల్ ఇప్పటివరకు ప్రసారమైన సీరియల్స్ తో పోలిస్తే టాప్ టెన్ లో మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుతం సీరియల్లో స్టోరీ ట్విస్టులతో నడుస్తుంది కాబట్టి ఈ రేటింగ్ ఈ వారం పెరిగే అవకాశం కూడా ఉంది.. మరి ఈ సీరియల్ రేటింగ్ పెరుగుతుందా? మధ్యలోనే బ్రేక్ ఇస్తుందా చూడాలి…

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×