E-Paper
Advertisement

Sangamarmar Series OTT : పాతిక సంవత్సరాల ప్రేమ కథ… ఓటీటీలోకి వస్తున్న సరికొత్త సిరీస్

Sangamarmar Series OTT : పాతిక సంవత్సరాల ప్రేమ కథ… ఓటీటీలోకి వస్తున్న సరికొత్త సిరీస్
Advertisement

Sangamarmar Series OTT : ఫ్యామిలీ డ్రామాని ఇష్టపడే వాళ్ళకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక ఎమోషనల్ డ్రామా సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. పాత సినిమాలను తలపించే ఈ సిరీస్ చాలా మందికి నచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ట్రెండింగ్ సినిమాలను చూసిన అడియన్స్ కి ఇలాంటి కంటెంట్ ఒక మంచి విందు ఇవ్వబోతోంది ఇప్పుడు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సిరీస్ ను చూడకుండా ఉండలేరు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఫ్యామిలీ ఎమోషనల్ సిరీస్ పేరు Sangamarmar. ఇందులో బుల్లితెర నటులతో పాటు, వెండితెర ప్రముఖులు కూడా నటిస్తున్నారు. ఈ సిరీస్ లో అమృత పాత్రలో షీన్ సావితా దాస్ కథానాయికగా నటిస్తోంది. సౌరభ్ రాజ్ జైన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇక స్మితా బన్సల్, అవినాష్ వాధవన్, ఖలీద్ సిద్ధిఖీ, జయ ఓజా ఫరూక్ సయీద్ ముఖ్య పాత్రల్లో నటించారు. రాజశ్రీ ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన ఈ సిరీస్ కి విక్రమ్ ఘై దర్శకత్వం వహించారు. ఇది 2026 ఫిబ్రవరి 26 నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రధానంగా హిందీలో రూపొందింది. హాట్‌స్టార్ సాధారణంగా సిరీస్‌లను తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి డబ్ చేసే ఆకకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో అమృత, ఆదిత్య అని ఇద్దరు ప్రేమికులు ఉంటారు. అమృతకు తన లైఫ్‌లో కొన్ని ఆశయాలు ఉంటాయి, కానీ అకస్మాత్తుగా వచ్చిన ఫ్యామిలీ బాధ్యతల వల్ల తన సొంత ఇష్టాలను, ఆదిత్యతో ఉన్న ప్రేమను వదులుకోవాల్సి వస్తుంది. కుటుంబం ముందా? ప్రేమ ముందా? అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఫ్యామిలీకే ఓటు వేస్తుంది. అలా విడిపోయిన ఈ జంట మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఎలా కలిశారు? ఇన్నేళ్లు ఒకరి కోసం ఒకరు ఎలా ఎదురుచూశారు? అనేది చాలా ఎమోషనల్‌గా చూపిస్తారు ఈ సిరీస్ లో.
ఇది మన పాత సినిమాల తరహాలో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. ఒకరి కోసం ఒకరు చేసే త్యాగాలు, మాటల్లో చెప్పలేని భావాలను ఇందులో చూడ చక్కగా తెరకెక్కించారు.

Read Also : లియోనార్డో డికాప్రియో బ్లాక్ కామెడీ యాక్షన్ చిత్రం ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×