Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున 16 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. ఇక హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ టాస్కులు పెట్టడం, అలాగే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టడంతో ఈ కార్యక్రమం పై ఆసక్తి కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి గుడ్డ నిండా గుడిగంటలు (Gundeninda Gudigantalu)సీరియల్ నటీనటులు బాలు(Balu) మీనా(Meena) ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో బాలు మీనా నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారా? మరి గుండె నిండా గుడి గంటలు పరిస్థితి ఏంటి? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం మీనా, బాలు పర్మినెంట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లలేదని తెలుస్తోంది. కేవలం బిగ్ బాస్ 10 ప్రమోషన్లలో భాగంగానే హౌస్ లోకి వెళ్లారు. ఇక ఈ వీడియో బిగ్ బాస్ హౌస్ హోమ్ టుర్ లాగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే మీనా మనం కూడా మన ఇంటి మేడ మీద ఒక గది కట్టుకోవాలని అనుకుంటున్నాము కదా మోడల్ హౌస్ చూద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ బిగ్ బాస్ హౌస్ మొత్తం కలియ తిరుగుతూ ఉంటుంది. కిచెన్ ఇలాగే ఉండాలి బెడ్ రూమ్ ఇలాగే కట్టుకోవాలి హాల్ ఈ మాత్రం ఉండాలి అంటూ బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరుగుతూ ఒక హోమ్ టూర్ చేసేసింది. ఇలా మీనా తన గది ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతుంటే బాలు మాత్రం ఇది ఎవరిలో తెలుసా అని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా మీనా మన ఇల్లు ఇలాగే ఉండాలి అంటూ మాట్లాడటంతో వెంటనే బాలు ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ గొడవలు, పోట్లాటలు, ఎలిమినేషన్లు తప్ప ఇంకేమీ ఉండవు అంటూ చెప్పుకు వచ్చారు.
ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి మీనా బాలు ఇద్దరు అడుగుపెట్టడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి నిజంగానే బాలు మీనా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు కానీ ప్రస్తుతం వీరిద్దరూ నటిస్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంచి రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న నేపథ్యంలో బాలు బిగ్ బాస్ వెళ్లలేదని తెలుస్తుంది. కానీ మీనా పాత్రలో నటిస్తున్న అమూల్య గౌడ్ మాత్రం కన్నడ బిగ్ బాస్ కార్యక్రమంలో ఇదివరకే పాల్గొన్నారు. మరి తదుపరి తెలుగు సీజన్ లో అయినా వీరిద్దరూ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: సోషల్ మీడియాలో ట్రోల్స్.. వేస్ట్ ఫెలోస్ అంటూ పవిత్ర ఫైర్!