E-Paper
Advertisement

సోషల్ మీడియాలో ట్రోల్స్.. వేస్ట్ ఫెలోస్ అంటూ పవిత్ర ఫైర్!

సోషల్ మీడియాలో ట్రోల్స్.. వేస్ట్ ఫెలోస్ అంటూ పవిత్ర ఫైర్!
Advertisement

Big Tv Kissik Talks:  బిగ్ టీవీలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ కార్యక్రమం కూడా ఒకటి. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ నటి వర్ష యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు హాజరవుతూ వారి వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా మరో జబర్దస్త్ కమెడియన్ పాగల్ పవిత్ర హాజరయ్యారు.

నెగిటివ్ ట్రోల్స్.. పవిత్ర షాకింగ్ రియాక్షన్

ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవిత్ర తన ఫ్యామిలీ గురించి కెరియర్ గురించి మాట్లాడారు అదే విధంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటాయి అయితే తన గురించి వస్తున్న ట్రోల్స్ పట్ల పవిత్ర స్పందిస్తూ ట్రోల్లర్స్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇటీవల కాలంలో పవిత్ర చాలా స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తూ ఇంస్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ వైరల్ అయ్యారు. ఇలా పొట్టి పొట్టి దుస్తులను ధరిస్తూ పవిత్ర ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది ఎన్నో విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

నా గురించి టైం వేస్ట్ చేయొద్దు..

Advertisement

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నెగిటివ్ కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటి అంటూ వర్ష ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు పవిత్ర సమాధానం చెబుతూ నాకు అలాంటి వెస్ట్రన్ వేర్ ధరించడం అంటే చాలా ఇష్టం అందుకే అలాంటి దుస్తులు వేసుకుంటానని తెలిపారు. అయితే నా గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వారంతా వేస్ట్ ఫెలోస్ అని పవిత్ర ఫైర్ అయ్యారు. ఇలా నా గురించి టైం తీసుకుని కామెంట్లు పెట్టీ టైం వేస్ట్ చేసుకోవడం కంటే మీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మంచిది. మంచిగా చదువుకో జిమ్ కు వెళ్లి వర్క్ అవుట్ చేసి మంచి ఆరోగ్యాన్ని పెంచుకో అని చెప్పారు.

Advertisement

తన గురించి ఎవరైతే బాడ్ కామెంట్స్ పెడుతున్నారో వారందరికీ రెస్ట్ ఇన్ పీస్ అంటూ అలాంటి వారందరూ తన దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళతో సమానమని ఈ సందర్భంగా పవిత్ర నెగిటివ్ కామెంట్లపై స్పందిస్తూ తన రియాక్షన్ ఏంటో తెలియజేశారు. ఇక తన జీవితంలో తన స్నేహితులు తనకు వెన్నుపోటు పోవడం గురించి కూడా పవిత్ర మాట్లాడారు. తను ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకుంటే తన స్నేహితులే ఇంత అవసరమా నువ్వు కమెడియన్ వే కదా, ఎందుకంత ఎక్స్పోజింగ్ అంటూ విమర్శించారని, నేను జిమ్ కు వెళ్తున్నా, నన్ని నేను మెయింటెన్ చేసుకుంటున్నా నాకు అవసరమయ్యే వస్తువులు నువ్వు కొనివ్వలేదు అంటూ తన పట్ల విమర్శించిన వారికి తన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు.

Also Read: ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

Related News

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి జంటగా బాలు, మీనా.. మరి ‘గుండె నిండా గుడి గంటలు’ పరిస్థితి ఏమిటీ?

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

ఐబ్రోస్ నచ్చలేదని నామినేషన్ చేస్తానంటున్న రామ్ ప్రసాద్..ఇదెక్కడి గోల రా మావా!

Big Stories

Advertisement
×