E-Paper
Advertisement

ప్రాణ స్నేహితుల మధ్య అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఆవేశం… మనుషుల నైజానికి అద్దం పట్టే మైండ్ బెండింగ్ డ్రామా

ప్రాణ స్నేహితుల మధ్య అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఆవేశం… మనుషుల నైజానికి అద్దం పట్టే మైండ్ బెండింగ్ డ్రామా
Advertisement

Feel Good Drama: ప్రేమ కోసం ప్లాన్ చేసిన ఓ ట్రిప్… పెళ్లి ప్రపోజల్‌ కు సిద్ధమవుతున్న ప్రియుడు… కానీ ఆ ప్రపోజల్‌ను తప్పించుకోవాలని చూస్తున్న ప్రేయసి. ఇంతలో అనుకోకుండా విమాన సర్వీసులన్నీ ఆగిపోతే ? ఇంటికి తిరిగి వెళ్లే దారి మూసుకుపోయిన సమయంలో, గతంలో తనకు ఎంతో దగ్గరైన ఓ వ్యక్తిని కలిస్తే ? అప్పటి వరకు తనలోనే దాచుకున్న భావాలు మళ్లీ బయటకు వస్తే ? తన జీవితంలో అసలు ఏం కావాలో ఓ యువతి తెలుసుకునే ప్రయాణమే ‘ఎరుప్సియా’ (Erupcja).మరి ఈ ఫీల్ గుడ్ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

బ్రిటిష్ పర్యాటకురాలు బెథానీ తన ప్రియుడు రాబ్‌తో కలిసి పోలాండ్ రాజధాని వార్సాకు రొమాంటిక్ వెకేషన్ కోసం వస్తుంది. రాబ్‌కు మాత్రం ఈ ట్రిప్ చాలా ప్రత్యేకం. బెథానీకి ప్రపోజ్ చేసి, ఆమెను పెళ్లి చేసుకోవాలని అతను నిర్ణయించుకుంటాడు. కానీ బెథానీ మాత్రం పెళ్లి అనే బాధ్యత గురించి ఆలోచించగానే వెనక్కి తగ్గుతుంది. రాబ్ తనకు ప్రపోజ్ చేయబోతున్నాడని తెలుసుకున్న ఆమె, ఆ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. అదే సమయంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది.

Advertisement

ఓ అగ్నిపర్వతం బద్దలవడంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో బెథానీ, రాబ్ వార్సాలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంటికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఈ పరిణామాన్ని బెథానీ ఒక సంకేతంగా భావిస్తుంది. రాబ్‌ ను కొంతకాలం పక్కన పెట్టి, వార్సాలో ఫ్లవర్ షాప్ నడుపుతున్న తన చిన్ననాటి స్నేహితురాలు నెల్‌ ను కలవాలని నిర్ణయించుకుంటుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఇద్దరూ కలుసుకోవడంతో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తాయి. నగర వీధుల్లో తిరుగుతూ, పార్టీలకు వెళ్తూ, గతాన్ని గుర్తు చేసుకుంటూ గడిపే క్రమంలో బెథానీ, నెల్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బలపడుతుంది.

అయితే ఈసారి ఆ బంధంలో స్నేహం మాత్రమే ఉండదు. ఇద్దరి మధ్య దాచిపెట్టిన ఆకర్షణ, ప్రేమ భావనలు బయట పడతాయి. దీంతో బెథానీ మరింత గందరగోళంలో పడుతుంది. ఒకవైపు తనను ప్రేమించే రాబ్, మరోవైపు తనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొస్తున్న నెల్. అసలు తాను కోరుకునే జీవితం ఏంటి ? తన ప్రేమ, తన ఐడెంటిటీ విషయంలో ఇప్పటివరకు తాను నిజంగా ఏం కోరుకుంది ? అనే ప్రశ్నలు ఆమెను వెంటాడతాయి. చివరికి ఈ అనుకోని ప్రయాణం బెథానీ జీవితంలో ఓ కీలక నిర్ణయం తీసుకునే స్థాయికి తీసుకెళ్తుంది. తన మనసును తానే అర్థం చేసుకునే ఈ ఎమోషనల్ జర్నీనే ‘ఎరుప్సియా’ అసలు కథ.

ఏ ఓటీటీలో చూడొచ్చు ?

Advertisement

‘ఎరుప్సియా’ (Erupcja) ప్రస్తుతం MUBIలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ పాప్ స్టార్ చార్లీ ఎక్స్‌సిఎక్స్ (Charli XCX) తొలిసారి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఒరిజినల్ ఇంగ్లీష్, పోలిష్ భాషల్లో మాత్రమే చూడొచ్చు. సాధారణ కమర్షియల్ లవ్ స్టోరీల కంటే భిన్నంగా, రిలేషన్‌షిప్స్, ఐడెంటిటీ, స్వీయ శోధన చుట్టూ సాగే ఇండీ డ్రామాలను చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చొచ్చు.

Read Also: మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

Tags

Related News

నగరంలో బాంబ్ డిఫ్యూజన్ హడావుడి… అదిరిపోయే హై-వోల్టేజ్ హీస్ట్ థ్రిల్లర్

చీకటి కోనలో చిత్రమైన రాక్షసి… క్షణం క్షణం వణికించే హర్రర్ మిస్టరీ

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×