BigTV English

Gundeninda GudiGantalu Today episode: సుశీల దగ్గర నిజం దాచిన బాలు..నడిరోడ్డు పై శివ, బాలు ఫైట్..

Gundeninda GudiGantalu Today episode: సుశీల దగ్గర నిజం దాచిన బాలు..నడిరోడ్డు పై శివ, బాలు ఫైట్..

Gundeninda GudiGantalu Today episode May 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి దోమల మందు కొట్టడంతో ఊపిరి ఆడక సత్యం ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. అన్ని టెస్టులు చేసి సత్యం కు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు. బాలు మీనా మనోజ్ ప్రభావతి రవిలు సత్యంలో ఇంటికి తీసుకొని వస్తారు. ఇంట్లోకి రాగానే శృతి బాగున్నారా అంకుల్.. చాలా ప్రమాదం అని చెప్పారు.. బాగానే ఉన్నారు కదా అనగానే..దానికి బాలు కౌంటర్ ఇస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చారేంటి ఏదో సీరియస్ అని అన్నారు కదా అని శృతి అడుగుతుంది. బాలు నువ్వు చాలా ఫీలవుతున్నట్లున్నావే అన్ని సెటైర్ వేస్తాడు. ఒక వారం అలా పడుతుందేమో అనుకున్నాను అప్పుడే వచ్చేశారు కదా అని అలా అడిగాను అని శృతి అంటుంది.


ఆ మాట వినగానే బాలుకు కోపం శివాలెత్తిపోతుంది. ఓ చాలా పెద్ద ప్లానే చేసావే? చూసావా అమ్మ నీ డబ్బు ఉన్న కోడలు ఎలా మాట్లాడుతుందో అని ప్రభావతిపై బాలు సీరియస్ అవుతాడు. నువ్వు చేసిన దానికే కదా మా నాన్నకి పరిస్థితి వచ్చింది అని శృతి పై వచ్చి రాగానే బాలు కౌంటర్లు వేస్తాడు. ఇక రోహిణి మావయ్య గారు మీకు ఇప్పుడు బాగానే ఉంది కదా నేను వస్తానంటే మనోజ్ ఇంటికి తీసుకొస్తున్నామని చెప్పారు అందుకే రాలేకపోయానని అంటుంది. శృతి మాత్రం బాలుకి ఏ మాత్రం తగ్గకుండా అరుస్తూ ఉంటుంది. మొత్తానికి శృతి సత్యం కు క్షమాపణలు చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే సత్యం మీనా దగ్గరికి వచ్చి ఒక కాఫీ ఇవ్వమని అడుగుతాడు. మీనా సత్యం కి కాఫీ ఇస్తుంది. అప్పుడే ఫోన్ రావడంతో మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మమ్మ గారు ఫోన్ చేశారని మాట్లాడుతుంది. సుశీల మీనా తో సరదాగా మాట్లాడుతుంది. ఇక్కడ నిన్ను మహారాణి లాగా కాపాడుకున్నాను.. అక్కడ బాగా పనులతో బిజీ అయిపోయావు కదా అని అంటే పూలకట్టు పెట్టాను కదా అమ్మమ్మ అక్కడ పని ఇంట్లో పని కాస్త బిజీగానే ఉన్నానని మీనా అంటుంది. మేమందరం బాగున్నాం కానీ మావయ్యకి చిన్న సమస్య అనబోతుంది. సత్యం చెప్పొద్దని సైగ చేయడంతో ఆగిపోతుంది. ఆ తర్వాత బాలు వచ్చి మందులు వేసుకున్నావా నాన్న ఇప్పుడు నీకు బాగానే ఉందా అని అడుగుతాడు.


ఈ పూలగంప ఏంటి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అని బాలు ఫోన్ తీసుకుంటాడు.. శీల డార్లింగ్ బాగున్నావా మేమంతా చాలా బాగున్నాం అని అడుగుతుంది. మొత్తానికి మీనాని మళ్లీ పెళ్లి చేసుకున్నావు..ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావంటే మేము కూడా సంతోషంగా ఉన్నాను రా అని సుశీల అంటుంది. ఫోటోలు పంపిస్తే నేను ప్రేమ్ కట్టుకుంటాను అనగానే పెళ్లి ఫోటోలు అయితే నిన్ననే పంపించాను. మళ్లీ అడుగుతున్నావేంటి షీలా డార్లింగ్ అని బాలు అడుగుతాడు. అది కాదురా మనమంతా మొన్న ఉగాదికి దిగిన ఫోటో ఉంది కదా అది పెద్ద చేసిస్తే నేను ఫ్రేమ్ ఇంట్లో పెట్టుకుంటాను అని అంటుంది..

ఇక సత్యం మనకు కూడా ఒక ప్రేమ్ తీసుకురారా మనం ఇంట్లో పెట్టుకుందామని అంటాడు. ఇక సుశీల ఫోన్ పెట్టగానే ప్రభావతి మనకెందుకు? ఎక్కడ పెడతారు? అని అడుగుతుంది.. ఫ్యామిలీ ఫోటో అన్నాక ఇంట్లోనే పెట్టాలి బయట పెడితే బాగోదు కదా కావాలంటే నీ ఫోటో బయట పెడతాను దిష్టిబొమ్మగా బాగా సరిపోతుందని బాలు ప్రభావతి పై సెటైర్లు వేస్తాడు. ఇక మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్నా నాకు ట్రిప్ వచ్చింది నేను వెళ్లే చూస్తానని చెప్పి వెళ్తాడు..  వెళ్తూ దారిలో ఫోటోషాప్ కనిపించడంతో అక్కడ ఆగి ఫోటోలు ఫోటోషాప్ అతనికి చూపించి ప్రేమ కోసం అడుగుతాడు.

అయితే ఆ ఫోటోషాప్ అతను ఫోటోలని వ్యక్తి మీ అమ్మనా అని అడుగుతాడు. అవునన్నా మా అమ్మే ఏమైంది? ఎక్కడైనా చూసినట్టుంది అంటే మొన్న ఈమధ్య మీ అమ్మ బ్యాగులోంచి డబ్బులు ఎవరో కొట్టేస్తారు కదా అని అడుగుతాడు. అవును కొట్టేసారన్న కానీ ఎవరో తెలియదు అని బాలు అనగానే ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో మొఖానికి హెల్మెట్ పెట్టుకోగలరు మాస్క్ పెట్టుకో ఉన్నారు కదా అన్న సరిగా కనిపించలేదు అని బాలు అడుగుతాడు. ఫోటోషాప్ వ్యక్తి మాత్రం మరో వీడియోని చూపిస్తాడు.. అందులో శివ గుణ అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారని బాలు తెలుసుకుంటాడు.

ఈ శివని పోలీసులు పట్టుకున్న వీడికి కొంచెం కూడా బుద్ధి లేకుండా మళ్లీ వాడి వెనకాల తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నాడు అని బాలు అనుకుంటాడు. శివ మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు అంటే మీనా బాధపడుతుంది ఈ విషయాన్ని మీ నాకు తెలియకుండా చూసుకోవాలని బాలు అనుకుంటాడు. ఇక గుణ రాజేష్ దగ్గరికి నెల డబ్బులు కట్టలేదని నిలదీసి మాట్లాడతాడు..

డబ్బు కట్టలేదని గుణ అతడ్ని ఆపుతాడు. రాజేష్ డబ్బు కట్టకపోవడానికి కారణం సత్యం ఆసుపత్రిలో ఆ బిల్ అతడే కట్టాడు. వద్దురా ఎవరికో వడ్డీ ఇవ్వాలన్నావ్ కదా.. నేనే ఎవరినోకరిని అప్పు అడిగి తెస్తా అని బాలు అంటే.. వద్దురా తర్వాత చూసుకుందాం.. ముందు కట్టేద్దాం అని రాజేష్ ఆపి.. గుణాకు వడ్డీగా ఇవ్వాల్సిన డబ్బుని అక్కడ ఆసుపత్రి బిల్ కట్టేస్తాడు. ఇక ఇప్పుడు గుణ వడ్డీ డబ్బులు అడిగితే లేవు రెండు రోజుల్లో ఇస్తాను అని సద్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు రాజేష్. దాంతో గుణ కోపంగా.. అయితే ఈ రెండు రోజులు నీ పెళ్లాన్ని పంపించు అంటాడు. దాంతో రాజేష్ కోపంగా గుణాని కొడతాడు. గుణ రాజేష్ ని కొట్టబోతుంటే బాలు వచ్చి అడ్డుకుంటాడు. గుణ బాలు గొడవ పడుతుంటే మధ్యలో శివ వచ్చి అడ్డుపడతాడు.అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగేలా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×