JD Chakravarthi: జేడి చక్రవర్తి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. దెయ్యం, గులాబీ లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ హీరోగా ఉన్నాయి కాకుండా వైపు సినిమాలు చేస్తూ మరోవైపు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే మొన్నటి వరకు తెలుగులో కీలక పాత్రలో నటించిన జేడీ ఈమధ్య తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. ఎందుకు అయినా తెలుగు సినిమాలకు దూరమయ్యాడో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జేడీ సినిమా కెరీర్..
హీరో జెడీ చక్రవర్తి తన 17 వ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. శివ అనే సినిమాలో తన తెలుగు సినిమా కెరీర్ మొదలు పెట్టాడు. మొదటి సినిమానే పెద్ద హిట్ అవ్వడం చాలా అదృష్టం. అదే సినిమా హిందీ రిమేక్ లో కూడా ఆయనను మళ్ళీ తీసుకున్నారు. తర్వాత కేవలం 20 ఏళ్లకే తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. అతి చిన్న వయసులోనే అన్నీ భాషల్లో సినిమాలు చెయ్యడం మామూలు విషయం కాదు.. రొమాంటిక్ లేదా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తారు కానీ ఈయన అలా కాదు. తన సినిమా కెరీర్ లో లవ్ స్టొరీ, యాక్షన్, థ్రిల్లర్, హారర్, గెంగ్స్టర్ ఇలా అని రకాల సినిమాలు నాలుగు భాషలలో చేసాడు.. అయితే ఏమైంది తెలియదు.. తెలుగులో హీరోగా చెయ్యడం మానేశాడు. కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు..
Also Read:‘మామగారు’ గంగ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
తెలుగు సినిమాలకు జెడీ గుడ్ బై..
హీరోగా ఒకప్పుడు రాణించిన ఈయన ఆ తర్వాతతమిళం, మలయాళం సినిమాలలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఈయనను తమిళం, మలయాళం సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయడం చూసి కొద్దిగా బాధగా అనిపిస్తుంది అలాగే కొంచెం ఆశ్చర్యం కూడా కలుగుతుంది సొంత తెలుగువారే ఈయనకు అవకాశాలు ఇవ్వట్లేదని వార్తలు వినిపించేవి.. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఆయన ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించలేదు. నాలుగు భాషలలో నటించే, అన్ని రకాల సినిమాలు చేసే, డైరెక్షన్ కూడా చేసే, పాటలు కూడా పాడే జే డీ చక్రవర్తి వంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా తక్కువ, అసలు లేరనే చెప్పవచ్చు.. ఈయనను తెలుగు ప్రజలు దాదాపుగా మర్చిపోయారు. మరి ఈసారి మంచి మూవీతో కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి..
ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికొస్తే.. కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే పలు వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ బాగానే సంపాదిస్తున్నాడని టాక్.. ఇంకో విషయం ఏంటంటే.. తెలుగుకు సంబంధించిన ఇంటర్వ్యుల్లో కూడా ఎక్కడ ఈయన కనిపించకపోవడం గమనర్హం. ఇంత మంచి నటుడిని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు మిస్ చేసుకుంటుందో తెలియట్లేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను పలకరిస్తారేమో చూడాలి…