BigTV English

GundeNinda GudiGantalu Today Episode : మీనా తన భార్య కాదని చెప్పిన బాలు .. రెచ్చిపోయిన ప్రభావతి .. సంజు రియాక్షన్ ..

GundeNinda GudiGantalu Today Episode : మీనా తన భార్య కాదని చెప్పిన బాలు .. రెచ్చిపోయిన ప్రభావతి .. సంజు రియాక్షన్ ..

Gundeninda GudiGantalu Today Episode 19th : నిన్నటి ఎపిసోడ్ లో రవి శృతిలకు నిజం చెప్పి మీనా పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తుంది. అక్కడ శృతి చెప్పిన విషయం పై అందరు షాక్ అవుతారు. ర‌వి త‌న‌కు అబ‌ద్ధం చెప్పి గుడికి తీసుకెళ్లాడ‌ని మీనా ఎంత చెప్పిన బాలు న‌మ్మ‌డు. వ‌దిన ఏ త‌ప్పు చేయ‌లేద‌ని ర‌వి కూడా బాలును క‌న్వీన్స్ చేయ‌బోతాడు. ర‌విపై ఉన్న కోపంతో త‌మ్ముడి మాట కూడా బాలు ప‌ట్టంచుకోడు. రవిని నువ్వు ప్రాణాలతో ఉండాలంటే జీవితంలో నాకు ఎప్పుడు కనిపించకు అని చెప్పి వెళ్ళిపోతాడు.


ఇక ఇవాళ ఎపిసోడ్ కు వస్తే .. పోలీస్ స్టేష‌న్ నుంచి ఇంటికొచ్చిన మీనాను ప్ర‌భావ‌తి గెంటేస్తుంది. మా కుటుంబానికి ద్రోహం చేసిన నిన్ను ఇంట్లోకి రానిస్తాన‌ని ఎలా అనుకున్నావ‌ని మీనాపై ఫైర్ అవుతుంది. నాపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికే ర‌వి, శృతిల పెళ్లిని సీక్రెట్‌గా జ‌రిపించావ‌ని, నా భర్తను పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టిన దాన్ని నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను అని మండిపడుతుంది. మావ‌య్య స‌త్యాన్ని క‌లిసి అస‌లు జ‌రిగింది ఏమిటో, ర‌వి త‌న‌ను ఎలా మోసం చేసింది చెప్పాల‌ని మీనా ప్ర‌య‌త్నిస్తుంది. కానీ స‌త్యాన్ని మీనా క‌ల‌వ‌కుండా ప్ర‌భావ‌తి అడ్డుకుంటుంది. తిండికి గ‌తిలేని నిన్ను ఈ ఇంటి కోడ‌లిగా తీసుకొచ్చిన స‌త్యానికి గొప్ప స‌న్మానం చేశావ‌ని మీనాను ప్ర‌భావ‌తి అవ‌మానిస్తుంది, మ‌నోజ్‌, రోహిణి కూడా మీనానే త‌ప్పుప‌డ‌తారు. నీ వ‌ల్లే ఇంటి ప‌రువు బ‌జారు పాలైంద‌ని, నువ్వు ర‌వి పెళ్లి చేయ‌డం వ‌ల్లే స‌త్యం జైలుకు వెళ్లాడ‌ని కోప్ప‌డుతారు. మీనాను ఇంట్లోకి రానివ్వను అనేసి ప్రభావతి అంటుంది. ఇక మీనాను ఇంట్లో ఉండవను అని వార్ణింగ్ కూడా ఇస్తుంది.

ప్ర‌భావ‌తికి ఎదురుతిరుగుతుంది మీనా. మీరు పొమ్మంటే ఎక్క‌డికి వెళ‌తాన‌ని, ఇదే త‌న ఇళ్లు అని అంటుంది. చ‌చ్చేదాకా ఇక్క‌డే ఉంటాన‌ని చెబుతుంది. మీనాను బ‌ల‌వంతంగా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు నెట్టివేస్తుంది. తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి వీలు లేదు . అస్సలు ఆ హక్కు మీకు లేదని అంటుంది. లోపలి మీనా వెళ్తుంది. నా మెడ‌లో తాళిక‌ట్టిన భ‌ర్త‌కే ఆ హ‌క్కు ఉంద‌ని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌ని బాలు చెబితే వెళ్లిపోతాన‌ని అంటుంది. ఇక భ‌ర్త త‌న‌ను ఉండ‌మంటాడ‌ని మీనా ఆశిస్తుంది. కానీ బాలు ఆమెకు ఊహించ‌ని షాకిస్తాడు. ఇక‌పై నీకు నాకు ఎలాంటి సంబంధం లేద‌ని మీనాతో తెగేసి చెబుతాడు బాలు. ఇక‌పై నీకు ఈ ఇంట్లో స్థానం లేద‌ని అంటాడు. నా భార్య‌గా ఉండే అర్హ‌త‌ను నువ్వు కోల్పోయావ‌ని మీనాను కొట్టాలని అనుకుంటాడు . ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. నా కళ్ళ ముందుకు రావొద్దు అంటాడు.


తన భర్త మాట‌ల‌ తో మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌న్నీళ్ల‌తో అత్తింటి నుంచి బ‌య‌టఅడుగుపెడుతుంది. స‌త్యం మీనాకు స‌పోర్ట్ చేస్తాడా? తిరిగి అత్తింట్లోకి మీనా అడుగుపెడుతుందా? అన్న‌ది నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది.. ఈరోజు ఎపిసోడ్ లో శృతి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిపోతుంది. త‌న‌ను మోసం చేసి ర‌విని పెళ్లిచేసుకున్న శృతిపై ప‌గ‌తో ర‌గిలిపోతుంటాడు సంజు. ర‌విపై ఎటాక్ చేసి శృతి ఎత్తుకొచ్చి పెళ్లిచేసుకోవాల‌ని సంజు ప్లాన్ చేస్తాడు. మ‌రోవైపు త‌మ్ముడి పై కోపం తో అత‌డి కోసం బాలు వెతుకుంటాడు. బాలుకు రవి దొరకడు మరోవైపు సంజు కూడా రవిని చంపాలని చూస్తాడు. వీరిద్దరూ రవి , శృతిల కోసం వెతుకుతారు. సోమవారం ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా ఉండబోతుంది. సత్యం మీనాను క్షమిస్తాడా అన్నది ఆడియన్స్ ను ఆలోచనలో పడేస్తుంది..

Related News

Big tv Kissik Talks: విష్ణుప్రియ పెళ్లిలో ఇన్ని ట్విస్టులా…అమ్మ కోరిక తీరకుండానే అంటూ!

Big tv Kissik Talks: ఆ సీరియల్ ఎఫెక్ట్..ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన విష్ణు ప్రియ ..అలా అవమానించారా!

Ring Riyaz: బై బై ఇండియా.. గల్లీ బాయ్ రియాజ్ వీడియో వైరల్..

Yadammaraju -stella :ఇన్నాళ్లకు కూతురిఫేస్ రివీల్ చేసిన జబర్దస్త్ కమెడియన్..ఎంత క్యూట్ గా ఉందో!

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, నర్మదను అడ్డంగా ఇరికించిన శ్రీవల్లి..పరువు తీసిన భాగ్యం..అమూల్యతో విశ్వం..

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. షాకిచ్చిన చక్రధర్..పల్లవిని గెంటేస్తారా..?

GudiGantalu Today episode: ప్రభావతి షాకిచ్చిన బాలు.. మీనాతోనే ఆ పని..రోహిణికి కడుపు మంట..

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కోసం కనకం ఇంటికి వెళ్లిన రాజ్‌

Big Stories

×