BigTV English

YS Jagan Tadepalli Palace: తాడేపల్లి ప్యాలెస్‌.. జురాసిక్ పార్క్? ఇంతకీ ఎవరా దొంగ పిల్లి? టీడీపీ యానిమేషన్ స్టోరీ వైరల్

YS Jagan Tadepalli Palace: తాడేపల్లి ప్యాలెస్‌.. జురాసిక్ పార్క్? ఇంతకీ ఎవరా దొంగ పిల్లి? టీడీపీ యానిమేషన్ స్టోరీ వైరల్

YS Jagan Tadepalli Palace: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. అయినా వారి అలవాట్లు ఇప్పటి నేతలు కంటిన్యూ చేస్తున్నారు. రాజకీయాల్లో ఈ పోకడ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కూడా. ప్రజల డబ్బును నేతలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పేందుకు ఇదొక ఎగ్జాంఫుల్.


పూర్వం రాజులు తమ ఇల్లు శత్రువులకు కనిపించకుండా పొడవైన గొడలు కట్టేశారు. ఎవరొచ్చినా, ఏం చేసినా బయటకు కనిపించేది కాదు. వాటి ఆనవాళ్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఏపీలో రాజుల పద్దతినే మన నాయకులు ఫాలో అవుతున్నారు. తాడేపల్లి మాజీ సీఎం జగన్‌ ప్యాలెస్‌కు  సంబంధించి కొత్త కొత్త విషయాలు బయట పెడుతోంది చంద్రబాబు సర్కార్.

2019 వైసీపీ అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్‌కు మరమ్మతులు చేసింది.  ప్రభుత్వం మనదేకదా.. అడిగేవారు ఎవరున్నారని భావించారు ఆనాటి పెద్దలు.  ఏకంగా 12.85 కోట్ల రూపాయలతో పనులు చేయించారు. ప్యాలెస్ లోపల విషయం కాసేపు పక్కనపెడదాం.


మాజీ సీఎం జగన్ ప్యాలెస్ చుట్టూ ఐరన్ పెన్సింగ్ నిర్మించారు. ఇంటికి నాలుగు వైపులా 30 అడుగుల ఎత్తైన పెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీని విలువ అక్షరాలా 12 కోట్ల పైమాటే. ఈ విషయాన్ని  ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో సహా బయటపెట్టింది చంద్రబాబు సర్కార్.

ALSO READ: నెక్ట్స్ టార్గెట్ జగన్.. సజ్జల జస్ట్ శాంపిల్, వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ప్లాన్

ఒకవిధంగా చెప్పుకోవాలంటే అదంతా ప్రజాధనం. కంచెకి క‌రెంటు స‌ర‌ఫ‌రా కూడా ఉంద‌ట‌. గడిచిన ఐదేళ్లు ప్యాలెస్ వైపు ఎవరు చూడకుండా ఉండేలా రోడ్లను సైతం బ్లాక్ చేసింది అప్పటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిబంధనలను తొలగించింది.

జగన్ క్యాంప్ ఆఫీసు ఫర్నీచర్ విషయంలో ప్రభుత్వానికి డబ్బులు ఇస్తామని చెప్పారు ఆ పార్టీ నేతలు. కంచె నిర్మాణానికి సంబంధించిన నిధులను ప్రభుత్వ ఖజానాకు ఆ పార్టీ జమ చేస్తుందా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

తాడేపల్లి ప్యాలెస్‌ కంచెకు సంబంధించి ఓ నిమిషం నిడివి గల యానిమేషన్ వీడియోను విడుదల చేసింది టీడీపీ. దొంగ పిల్లి కథతో భావి తరాలకు అర్థమయ్యేలా ప్యాలెస్ కంచె గురించి బాధ్యత గల తండ్రి, తన కొడుకును ఆ రోడ్డపై తీసుకుంటూ వివరించే ప్రయత్నం చేశాడు.

 

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×