BigTV English

Gundeninda GudiGantalu Today episode: రోహిణిని అడ్డంగా బుక్ చేసిన మాణిక్యం.. బాలును ఓడించాలని ప్రభావతి ప్లాన్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణిని అడ్డంగా బుక్ చేసిన మాణిక్యం.. బాలును ఓడించాలని ప్రభావతి ప్లాన్..

Gundeninda GudiGantalu Today episode April 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మనోజ్ కు కావాలని తాగించాడని అందరు దారుణంగా తిడతారు. మజ్జిగను బలవంతంగా మనోజ్ నోట్లో పోస్తాడు. మనోజ్ మాత్రం మత్తు దిగకుండా ఇంకో పెగ్గు కావాలి ఇంకో బాటిల్ కావాలి అంటూ నానా రచ్చ చేస్తాడు. ఒక్కసారిగా మనోజ్ బాలు లాగా మారిపోతాడు. షీలా డార్లింగ్ నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని భామను పట్టుకొని వింతగా మాట్లాడతాడు.. అదేవిధంగా అందరితోనూ అలాగే వాగుతూ ఉంటాడు. మందావతి బుద్ధిలేనివతి అంటూ బాలు లాగే అచ్చం తిడుతూ మాట్లాడతాడు.. ఇక రోహిణి, ఏంట్రా మందు ఒక్కరోజు తాగితేనే వాడిలాగా తయారయ్యావ్ అంటూ ప్రభావతి అడుగుతుంది.


మనోజ్ మాత్రం పాలరమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను వదిలేసి నువ్వు మలేషియాకి వెళ్ళిపోవు కదా అనేసి అంటాడు. రోహిణి మాత్రం ఆ బాలు వల్ల ఇదంతా చేసింది ఆ బాలుకు చెప్తాను ఇప్పుడు అనేసి కోపంగా వెళుతుంది. బాలు రాజేష్ తో మాట్లాడటం విని షాక్ అవుతుంది.. మనోజ్ తో మందు తాగించింది బాలు కాదని తెలుసుకొని, మాణిక్యమని తెలిసి కొట్టడానికి తన రూమ్ కి వెళుతుంది. మాణిక్యం పై కోపంతో వెళ్లి నీళ్లు కొట్టి లేపుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు ఆ మాణిక్యం గురించి బయట పెట్టాలని ప్లాణ్ చేస్తాడు. ఎలాగోలా రాజేష్ తో బాలు మాట్లాడటం రోహిణి వింటుంది. కచ్చితంగా ఈ బాలు అనుకున్నట్లు చేసేస్తాడు ఎలాగైనా ఈ మాణిక్యం ను వెంటనే పంపించాలని అనుకుంటుంది. రోజు ఉదయం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు హాల్లోకి మాణిక్యం వస్తాడు. ఏమైంది అని అంటే ఏం కాలేదు ఒకసారి మీ మటన్ షాపు ఎక్కడుంది ఏ ఏరియాలో ఉందంటే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా అనేసి అన్ని అడ్డంగా దొరికిపోతాడు. అయితే బాలు మాత్రం నువ్వు కచ్చితంగా మలేషియా నుంచి రాలేదు మటన్ కొట్టు నడుపుతున్న అని అర్థం అయిపోయింది ఏంటి నాటకం గురించి అని అడుగుతాడు రోహిణి అడ్డంగా దొరికిపోయిందని ఫీల్ అవుతుంది.


రోహిణి గుట్టు ఎక్కడ బయట పడుతుందోనని మాణిక్యంను ఎలాగైనా పంపించాలని అనుకుంటుంది. ఫోన్ రాకున్నా కూడా వచ్చింది అని ఎదో డ్రామా ఆడుతుంది. అక్కడ నుంచి పంపించాలని అందరిని నమ్మిస్తుంది. మా అత్తయ్యకు బాగోలేదని ఆలోచించి పంపింద్దా అని అనుకుంటుంది. కానీ మేక మాంసం కదా తినకపోతే ఫీల్ అవుతారని అంటాడు. మీ వైఫ్ కు సీరియస్ గా ఉంటే నువ్వు మేకని అంటావేంటి? కానీ రోహిణి ప్రవర్తన చూసి ఇంట్లో వాళ్లు అంతా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. పోనీలే అమ్మ రోహిణి తినేసి వెళ్తారు ఆయన కోసమే కదా ఇదంతా చేసింది అని ప్రభావతి అంటుంది.

కానీ రోహిణి మాత్రం ఆయన ఇప్పుడు వెళ్ళకుండా అంటే చాలా ప్రమాదం మా ఇంటికి చాలా సీరియస్ గా ఉందంట వెళ్ళి తీరాల్సిందే అని పట్టు పట్టి మరి అతని పంపించే ప్రయత్నం చేస్తుంది. మరి మరిది గారు మీరు వెళ్లినప్పుడు మనోజ్ బిజినెస్ గురించి మాట్లాడండి అని ప్రభావతి అంటుంది. ప్రభావతిని రోహిణి సోది అనేసి అంటుంది. ప్రభావం ఒక్క మాట అనగానే అందరూ షాక్ అవుతారు నువ్వేంటి మమ్మల్ని అంటున్నావేంటి అని బాలు కూడా అంటాడు. సారీ ఆంటీ నేను కావాలని లేదు ఏదో కోపంలో అనేసాను మా ఇంటికి ఎలా జరిగిందని టెన్షన్ లో ఉన్నాను అనేసి అంటుంది.

మాణిక్యం ఉంటే తన గుట్టు ఎక్కడ రట్టు అవుతుందని అతనిని పంపేయాలని వెంటనే బ్యాగ్స్ అవి తీసుకొని వస్తుంది. త్వరగా బయటికి వెళ్దామని అందరికీ చెప్పేసి బయటకు తీసుకెళ్తుంది. ఏంటి మేడం నాకు క్యారెక్టర్ ఇంకా అవ్వలేదు కదా నన్ను ఎందుకు పంపించాలి అనుకుంటున్నారు అని మాణిక్యం రోహిణి అని అడుగుతాడు. అదేం లేదు నువ్వు సెలెక్ట్ అయిపోయావని రాజమౌళి గారు అన్నారు అందుకే నేను పంపిస్తున్నాను మళ్ళీ నేను డైరెక్ట్ సినిమాలోకి పిలుస్తారంట అని మాణిక్యం కి ఏదో ఒకటి చెప్పేసి బయటికి పంపిస్తుంది.

బాలుకు మాత్రం రోహిణి మీద అనుమానం వస్తుంది. ఎందుకు నేను ఈయన మేక మటన్ గురించి అడిగితే రోహిణి కంగారుపడి బయటికి పంపించేస్తుంది ఏదో జరుగుతుంది అది కచ్చితంగా తెలుసుకునే తీరుతానని బాలు రాజస్థానడం రోహిణి వింటుంది. అందరూ కలిసి వెళ్లిపోవాలని పనుందని అనుకుంటారు కానీ సుశీలము మాత్రం మీ అందరి కోసం మంచి ప్రోగ్రామ్ని అండ్ ఏర్పాటు చేశాను. దాన్ని చూస్తే మీరు కచ్చితంగా ఇకనుంచి వెళ్ళిపోరు అని అంటుంది. మన ఊర్లో ఆడే ఆటలు గురించి నీకు తెలిసిందే కదా అవి ఇప్పుడు ఏర్పాటు చేయించాను మీరు కచ్చితంగా ఆడి తెలుసుకోవాలని ఇలా అంటుంది.

శృతి, రవిలు, అలాగే మనోజ్, రోహిణిలు కూడా ఇప్పుడు ఆడే పోటీల్లో బాలుని ఎలాగైనా ఓడించాలి అప్పుడే మన ఊరికినే కాపాడినట్టుగా ఉంటుంది. ఊరికివే ఒలంపిక్స్ కాబట్టి మనం కచ్చితంగా ఇందులో గెలవాలని ప్రభావతి అని టీం ఆలోచిస్తూ ఉంటారు. మీనా బాలు మాత్రం మనం లో ఎవరు గెలిచినా కూడా మంచిదే అనేసి ఆలోచిస్తారు. అప్పుడే సుశీల వచ్చి చూశారా వీళ్ళ మంచితనం వీళ్లు ఎలా ఉన్నా మనమే గెలుస్తామని అంటారు కానీ వాళ్ళు మాత్రం వీడ్ని ఎలాగైనా ఓడించాలని చూస్తున్నారని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Big Stories

×