BigTV English

OTT Movie : తీగలాగితే డొంకంతా కదిలింది … ఒక్క మర్డర్ లో ఇన్ని ట్విస్టులా … ఈ ఇన్వెస్టిగేషన్ కి ఓ దండం సామి

OTT Movie : తీగలాగితే డొంకంతా కదిలింది … ఒక్క మర్డర్ లో ఇన్ని ట్విస్టులా … ఈ ఇన్వెస్టిగేషన్ కి ఓ దండం సామి

OTT Movie : బాలీవుడ్ సినిమాలకు ఎప్పటినుంచో మన ప్రేక్షకులు అభిమానులుగా ఉన్నారు. ఈ సినిమాలు ఎక్కువగా సంగీతంతో ప్రేక్షకుల్ని మైమరపిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక మర్డర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇందులో కామిడీ తో పాటు అన్ని అంశాలు ఉంటాయి. ఇందులో ఇన్వెస్టిగేషన్ చేసే తీరు మాత్రం అదిరిపోతుంది. ఒక్క మర్డర్ చుట్టూ అనేక రహస్యాలు బయట పడతాయి. చివరివరకూ ఈ మూవీ సస్పెన్స్ తో సాగిపోతుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘మర్డర్ ముబారక్’ (Murder Mubarak). 2024 లో వచ్చిన ఈ మూవీకి అనూజా చౌహాన్ అడజానియా దర్శకత్వం వహించారు. ఇది ‘క్లబ్ యు టు డెత్’ నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో మార్చి 15, 2024న విడుదలైంది. ఇందులో పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా వంటి నటీనటులు నటించారు.


స్టోరీలోకి వెళితే

ఢిల్లీలోని రాయల్ ఢిల్లీ క్లబ్‌లో, ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులు తమ విలాసవంతమైన జీవనశైలిని ఆనందిస్తుంటారు. ఈ క్లబ్‌లో ఒక రాత్రి జరిగిన టంబోలా ఈవెంట్ సందర్భంగా, జిమ్ ట్రైనర్ లియో మాథ్యూస్ మరణం అనుమానస్పదంగా సంభవిస్తుంది. మొదట్లో ఇది ప్రమాదంగా భావించబడినప్పటికీ, ఏసీపీ భవానీ సింగ్ ఈ కేసును హత్యగా భావించి దర్యాప్తు ప్రారంభిస్తాడు. క్లబ్‌లోని సభ్యులైన బంబీ (సారా అలీ ఖాన్), ఆకాశ్ (విజయ్ వర్మ), షెహనాజ్ నూరానీ (కరిష్మా కపూర్), రణ్‌విజయ్ సింగ్ (సంజయ్ కపూర్), కూకీ (డింపుల్ కపాడియా), రోషిణీ (టిస్కా చోప్రా) వంటి వారంతా అనుమానితులుగా మారతారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ, లియో అనేక మందిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, అతని మరణం వెనుక డ్రగ్స్, వ్యక్తిగత రహస్యాలు ఉన్నాయని తెలుస్తుంది.

భవానీ సింగ్ తన చమత్కారమైన, అసాధారనమైన దర్యాప్తు పద్ధతులతో, క్లబ్‌లోని సభ్యుల చీకటి రహస్యాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తాడు. బంబీ, ఆకాశ్‌ల మధ్య ప్రేమాయణం, ఒక అనాథాశ్రమంతో క్లబ్ సభ్యుల సంబంధం వంటి అంశాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. చివరికి, హంతకుడు ఎవరనేది ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వెల్లడవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో చీకటి రహస్యాలను మీరు కూడా తెలుసుకోవాలి అంటే, ఈ ఈ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.  ఈ మూవీ కామెడీ, డ్రామా, మిస్టరీ జోనర్‌లతో ఆసక్తికరంగా ఉటుంది. పంకజ్ త్రిపాఠి నటన, హోమీ అడజానియా దర్శకత్వం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

Read Also : కలలో జరిగే హత్యలు నిజంగా జరిగితే … బార్ గర్ల్స్‌ నే టార్గెట్ చేసే సైకో … ట్విస్ట్ లతో అదరగొట్టే సైకలాజికల్ థ్రిల్లర్

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×