Gundeninda GudiGantalu Today episode April 19th: మీనా ఒక ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళని కలవడానికి వెళుతుంది. అక్కడ ఫ్లవర్ డెకరేషన్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటుంది. నాకు ఏదైనా ఒక చిన్న కాంట్రాక్ట్ వస్తే ఇప్పించండి అని అడగ్గానే అతను మొదట లేదని అన్న కూడా.. ఆ తర్వాత వాళ్ళ మేనేజర్ తో మాట్లాడాను అని మీనా అనగానే.. ఓ మీనా అంటే మీరేనా మీ గురించి నాకు చాలా చెప్పారు. నెక్స్ట్ ఆర్డర్ ఏదైనా వస్తే మీకే ఇస్తాను అని అతను చెప్పగానే మీలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తనకు ఆర్డర్ వచ్చింది ఎలాగైనా సరే బాలుకి చెప్పాలని హడావిడిగా బయటికి వస్తుంది.. అక్కడ తనని ఫాలో అవుతున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతూ అతను రావడంతో మీనా టెన్షన్ అవుతుంది. ఏంటి నా వెనకాల పడుతున్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇకనుంచి వెళ్ళిపోవాలా లేదంటే అతనితో మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని మీనా అనుకుంటుంది. అయితే మీనా దగ్గరికి ఆ వ్యక్తి రావడంతో కాస్త కంగారు పడిన సరే అతనితో కచ్చితంగా మాట్లాడాలి అని ఫిక్స్ అవుతుంది.. అతను రాగానే అతను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను అని చెప్పగానే మీనా ఎందుకు అని సీరియస్గా అడుగుతుంది. నాకు శాలరీలో ఇంక్రిమెంట్ రాలేదు అనుకున్నాను కానీ ఒకరోజు మీరు ఎదురుగా రావడంతో నాకు ఆ ఇంక్రిమెంట్ వచ్చింది అప్పటినుంచి మీరు నా అదృష్ట దేవత అని ఫీల్ అవుతున్నాను అని అతను అంటాడు. మనం చేసే పని మీద ఉంటుంది కానీ ఒకరి మీద ఉంటుంది అని ఎప్పుడూ అనుకోకండి అని మీనా అంటుంది. మీకు విషయం చెప్పాలి అని అతని ఎంతగా అనుకుంటున్నా సరే మీరే మాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
విద్య బాలు ఫోన్ ని పోగొట్టుకోవడంతో రోహిణికి కొత్త సమస్య వచ్చేలా కనిపిస్తుంది. ఈ విషయం గనుక రోహిణి తెలిస్తే ఎక్కడ తనని తిడుతుంది అని విద్యా కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే ఆ ఫోను బాలు వాళ్ళ చెప్పులు కుట్టుకునే అవ్వ తాత దగ్గరికి చేరిపోతుంది. వాళ్లు నోరు విప్పితే మాత్రం రోహిణి బండారం బయటపడుతుంది అని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే విద్యా దగ్గర నుంచి ఫోన్ పడింది అని తెలిస్తే మాత్రం బాలుకి రోహిణి మీద అనుమానం పెరుగుతుంది. ఎటు చూసినా కూడా రోహిణి సమస్యల్లో పడే అవకాశం కూడా ఉంది.
మనోజు ఉదయం షాపు దగ్గరికి వెళ్లగానే రోహిణి ఏంటి ఈ మధ్యలో చాలా తేడాగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు. నేనేమీ తేడాగా ప్రవర్తించలేదు. ఎక్కడికి వెళ్ళలేదు కూడా ఫోన్ వస్తే క్లైంట్ తో మాట్లాడుతున్నాను అని రోహిణి ఏదో ఒక అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళగానే షాప్ లో ఉన్న వ్యక్తి ఒకతను కవర్లో ఏమో దొరికే ఈ షాప్ ముందు ఉన్నాయి అని వాటిని తీసుకుని వస్తాడు. అందులో కోడిగుడ్లు ఉండడంతో మనోజ్ ఇవేంటి ఇక్కడ ఉన్నాయని షాక్ అవుతాడు. అయితే రోహిణి అవేంటో గుడ్లు లాగా ఉన్నాయి అని అంటుంది. కానీ షాప్ లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం వాటిని కింద పడేయండి సార్ వాటిని చూస్తుంటే చేతబడి చేసినట్లు అనిపిస్తున్నయి అని అనగానే మనోజ్ ఒక్కసారిగా గుండెల్లో బాంబు పేలినట్టుగా షాక్ అయిపోతాడు..
మనోజ్ ఫ్రెండు అప్పుడే అక్కడికి రావడంతో ఆ గుడ్లను చూసిన నీలకంఠం ఒక స్వామీజీ తెలుసు అతని మనం కలవాలి అనేసి అంటాడు. ఇక రోహిణి మనోజ్ నీలకంఠ ముగ్గురు కలిసి ఆ స్వామిజి దగ్గరికి వెళ్లాలని అనుకుంటారు. అతని దగ్గరికి వెళ్ళగానే నా షాప్ ముందర ఈ గుడ్లు ఉన్నాయి అని మనోజ్ చెప్పగానే వాటిని చూసి నా స్వామీజీ షాక్ అవుతాడు. ఎదుగుదలని తట్టుకోలేక వీటిని నీ షాప్ ముందు పడేశారు. ఎలాగైనా సరే వీటిని నువ్వు ముట్టుకున్నావు కాబట్టి నీకు ఏదైనా జరగొచ్చు అందుకు నేను చెప్పినట్లు చేయాలి అని అతను చెప్పగానే మనోజ్ సరే అని అంటాడు. ఇక మనోజ్ కి గుడిలో చేయాల్సిన పరిహారం గురించి స్వామీజీ చెప్పగానే మనోజ్ సరే అంటాడు అక్కడితో ప్రోమో ఎండ్ అయిపోతుంది. సోమవారం ఎపిసోడ్లో మనోజ్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.