Gundeninda GudiGantalu Today episode April 23 rd : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి బాలు మీనాని అడిగి దోసలు వేయమని వేయించుకొని తింటుంటాడు. ఎన్ని దోశలు వేయాలని మేము అడిగితే నీ చేత్తో ఎన్ని వేసిన నేను తింటానని బాలు అంటాడు. అయితే దోశలు తింటూ బాలు పూలకొట్టులో పని ఎక్కువైతే పనిమనిషిని పెట్టుకోవచ్చు కదా అని అడుగుతాడు. మనం ఏమి పెద్ద బిజినెస్ చేయట్లేదు కదా అండి వచ్చిన డబ్బులు అంతా పనిమనిషికిస్తే మనకే మిగులుతాయి. మరి ఏం పర్లేదు నేను చూసుకుంటాను లేండి అని మీనా అంటుంది. రోహిణి లాగా పెద్ద పార్లర్ కు ఓనర్ అయితే అలాగే పనిమనిషిని పెట్టుకోవచ్చు మనకంత అవసరం లేదులేండి అని మీనా అంటుంది.. రోహిణి నోరు జారి అడ్డంగా దొరికిపోతుంది. మనోజ్ ఉద్యోగం వేట ఫలిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఏదైనా జాబ్ తెచ్చుకోవాలని ఒక హోటల్ కి వెళ్తాడు. ఏదొక జాబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు. అయితే రెస్టారెంట్ లో వెయిటర్ గా జాబ్ ని సంపాదించుకుంటాడు. ఇంకా ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు మనోజ్ స్వీట్లను తీసుకొని ఇంటికి వస్తాడు. అందర్నీ పిలిచి స్వీట్లు ఇవ్వాలని అనుకుంటాడు. బాలు మాత్రం పల్లీలు బదులు స్వీట్లు తెచ్చావా అంటూ కామెంట్ చేస్తాడు. నాకు జాబ్ వచ్చిందని మనోజ్ అంటాడు.
జాబ్ వచ్చిందని అనగానే బాలు ఎవరికైనా నెల తర్వాత జీతం వస్తుంది. కానీ నీకు మొదటి రోజే మనీ ఇచ్చారా.. అని డౌట్ పడతాడు. మనోజ్ షాక్ అవుతాడు. ఏది ఏమైనా రోజువారి కూలీగా పనిచేస్తున్నావా అని అంటాడు.. ఏది ఏమైనా రోహిణి ఫుల్ ఖుషి ఉంటుంది. మౌనిక పై సంజయ్ సెటైర్లు వేస్తాడు. మీ ఇంట్లో వాళ్లను ఏడ్పిస్తాను. వాళ్లు సంతోషంగా ఉంటే చూడలేను. బూడిద చేస్తాను. మీ అన్న చేత కాలు పట్టించుకోవాలని నేను అనుకుంటే మా అత్త చేసిందానికి మీ అన్న కాలే నేను పట్టుకోవాల్సి వచ్చింది అది నేను ఇంకా మర్చిపోలేక పోతున్నానని సంజయ్ తెగ ఫీల్ అయిపోతాడు.
నాకు అంత తెలుసు మీ అత్తని సడన్గా ఫోన్ చేసి ఉన్న బలంగా రమ్మని అన్నప్పుడే మా ఇంట్లో వాళ్ళని అవమానించాలని అనుకున్నట్లు నాకు అర్థం అయిపోయింది. కానీ చూశారా మీకే తిరిగి నష్టం జరిగిందని మౌనిక అనడంతో సంజయ్ రెచ్చిపోతాడు. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావ్ వాళ్ళకి తెలిస్తే కానీ వాళ్ళు బాధపడరు అని సంజయ్ అంటాడు. మీ ఇంట్లో వాళ్ళందరినీ బూడిద చేస్తాను అని అనగానే నువ్వేం చేస్తావ్ ఆ బూడిదని తెచ్చి నెత్తిన చల్లుకుంటావా అని మౌనిక రెచ్చిపోతుంది.
నాకే ఎదురు సమాధానం చెప్తావని మౌనికను తోసేస్తాడు. మౌనిక వెళ్లి తలుపుకు కొట్టుకొని కింద పడిపోతుంది. ఇక మీనా పూల కొట్టు ఎందుకు తీయలేదు అని ఒక ఆవిడొచ్చి అడిగితే వారం రోజులు మా మామయ్య గారి అమ్మగారు ఊరికి వెళ్ళామండి పండక్కి అని చెప్తుంది. గుడి దగ్గర పూలు కొనడమే మానేశామంటే మీరు అక్కడ కొనండి ఇక్కడ కొనండి మా అమ్మ కూడా బ్రతకాలి కదా అనేసి మీనా అంటుంది. సరేగాని నీ మెడలో పసుపు తాడుంది ఏంటి? పుస్తెలతాడు లేదా అని అనగానే మీ అత్త లాక్కొనిందా? చిన్నప్పటి నుంచి నువ్వు బడ్డే కష్టం నాకు తెలుసు అందుకే అడుగుతున్నాను అని ఆవిడ అంటుంది.
అదేం లేదు అక్క పుస్తెలతాడు తెగిపోయింది అక్కడికి వెళ్లి అతుకు వేయించుకోవడానికి టైం లేదు అందుకే అక్కడే ఇంట్లో ఉంది అనేసి మీనా అబద్ధం చెప్తుంది. అత్త ముగ్గురు కోడళ్లను కూతురు లాగా చూసుకుంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మీనా అబద్ధం చెప్తుంది అది విని ఆవిడ సంతోషపడుతూ అలా వెళ్ళిందో లేదో ప్రభావతి వచ్చి ఇంట్లో వంట చేస్తారని గట్టిగా అరుస్తుంది.. ఆ వచ్చిన ఆవిడ మళ్లీ వచ్చి మీ అత్త మంచిది అన్నావ్ ఇలా గయ్యాలి లాగా అరుస్తుంది ఏంటి? అని అంటే నేను పూల కట్టు పెట్టుకొని ఇక్కడ బయట ఉండడం మా అత్తగారికి ఇష్టం లేదు అందుకే అరుస్తుంది అని అబద్ధం చెప్తుంది.
అది విన్న సత్యం మీనా సంస్కారానికి సంతోషపడతాడు. లోపలికి వెళ్లి ప్రభావతిని మృగాలు ఇంట్లో కూడా ఉంటాయని చూస్తున్నానని సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మౌనిక సంజయ్ ని తన క్యాబ్లో ఎక్కించుకుని వెళ్తాడు. సంజయ్ గురించి నిజం చెప్పమని మౌనికని అడుగుతాడు కానీ మౌనిక నిజం చెప్పదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…