OTT Movie : ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి అడ్డా గా మారిపోయింది. సినిమాలు వెబ్ సిరీస్ లతో హోరెత్తిపోతోంది . ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి వై చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో స్టోరీ అసాధారణ ప్రతిభ ఉన్న ఒక బాలుడు చుట్టూ తిరుగుతుంది. చిన్న వయసులోనే కాలేజీ కి వెళ్లి, ఆ పిల్లాడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సిరీస్ మొదటి నుంచి చివరి వరకు చాలా సరదాగా సాగిపోతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ సిట్‌కామ్ టెలివిజన్ సిరీస్ పేరు ‘యంగ్ షెల్డన్’ (Young Sheldon). దీనిని చక్ లోర్రే, స్టీవెన్ మొలారో సృష్టించారు. ఇది సెప్టెంబర్ 25, 2017 నుండి మే 16, 2024 వరకు CBSలో ప్రసారం చేయబడింది. ఈ సిరీస్ 1980 ల సంవత్సరాల కాలంలో పిల్లలను అనుసరించే సమయంలో జరిగే బిగ్ బ్యాంగ్ థియరీకి స్పిన్-ఆఫ్ ప్రీక్వెల్. ఇందులో జో పెర్రీ, లాన్స్ బార్బర్, మోంటానా జోర్డాన్, రేగన్ రివార్డ్, అన్నీ పాట్స్‌లతో, ఇయాన్ ఆర్మిటేజ్ నటించారు. ప్రీక్వెల్ సిరీస్ నవంబర్ 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
షెల్డన్ కూపర్ అనే ఒక బాలుడికి అసాధారణమైన ప్రతిభ ఉంటుంది. షెల్డన్ టెక్సాస్‌లోని ఒక చిన్న పట్టణంలో, తన కుటుంబంతో కలిసి జీవిస్తాడు. అతని అసాధారణమైన నైపుణ్యాల వల్ల తొమ్మిది సంవత్సరాలకే కాలేజ్ లోకి అడుగుపెడతాడు. అతని ప్రతిభ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఇతడు గణితం, సైన్స్‌లో విశేష ప్రతిభ కలిగి ఉంటాడు.షెల్డన్ తల్లి మేరీ కూపర్ తన కొడుకును జాగ్రత్తగా అంటిపెటుకుని ఉంటుంది. తండ్రి జార్జ్ కూపర్ హైస్కూల్ ఫుట్‌బాల్ కోచ్ గా ఉంటాడు. ఇతని అన్నయ్య జార్జ్ కూపర్ తమ్ముడి తెలివితేటలతో విసిగిపోతాడు. షెల్డన్ అసాధారణమైన సామర్ధ్యంతో వచ్చే సవాళ్లు, అతని సాధారణ కుటుంబం ఎదుర్కుంటుంది. షెల్డన్ తన వయసుకు మించిన అకడమిక్ సామర్థ్యాలతో హైస్కూల్ నుంచి కాలేజీలో చేరతాడు. అక్కడ అతను వయసుకు తగ్గట్టు ప్రవర్తించలేక సమస్యలను ఎదుర్కొంటాడు. చివరికి షెల్డన్ సామర్థ్యాలు చూడాలి అనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి. ఈ సిరీస్ 7 సీజన్లతో (2017–2024) నడిచింది. మొత్తం 141 ఎపిసోడ్‌లతో. ప్రతి సీజన్ షెల్డన్ పెరుగుదల, అతని కుటుంబ డైనమిక్స్, అతని విద్యా పురోగతిని అనుసరిస్తుంది. చివరి సీజన్‌లో, షెల్డన్ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. ఇది ‘The Big Bang Theory’ స్టోరీకి కనెక్ట్ అవుతుంది.
Read Also : నోటిలో క్లూ వదిలి వరుస హత్యలు చేసే సైకో … మెంటలెక్కించే మలయాళం క్రైమ్ థ్రిల్లర్