BigTV English

Viral Video: గోల్డ్ ఏటీఎం.. బంగారం కరిగించి 30 నిమిషాల్లో డబ్బు జమ, అదెలా?

Viral Video: గోల్డ్ ఏటీఎం.. బంగారం కరిగించి 30 నిమిషాల్లో డబ్బు జమ, అదెలా?

Viral Video: చైనాలో కాపీ క్యాట్ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు తయారు చేసే వస్తువును తక్కువ సమయం,లో బడ్జెట్‌లో తయారు చేస్తుందని అంటుంటారు. ఆ విషయం మాట కాసేపు పక్కనబెడదాం. ప్రపంచవ్యాప్తంగా ఏటీఎం పద్దతి వచ్చిన తర్వాత చాలామంది బ్యాంకులకు వెళ్లడం మానేశారు. ఆ తర్వాత పేటీఎం, జీ పే వచ్చిన తర్వాత వాటి ద్వారానే మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు వినియోగ దారులు. ఏటీఎంలు ఖాళీ దర్శనమిస్తున్నాయి. ఆ విధంగా కంపెనీలు ప్రజలకు అలవాటు చేశాయి.. ఆపై పడిపోయారు. ముఖ్యంగా అరచేతిలో ఫోన్ ఉండడంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి.


ఇప్పటికీ చాలామంది బ్యాంకులకు వెళ్తున్నారు. ఎందుకంటే బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. దీనికి సెపరేట్‌గా పద్దతి ఉంటుంది. బంగారం అమ్మేసి డబ్బులు తెచ్చుకోవాలంటే గోల్డ్ షాపులు ఏలాంటి మోసం చేస్తారో అన్న భయం సగటు వినియోగదారుడ్ని వెంటాడుతోంది. తాజాగా బంగారాన్ని ఏటీఎంలో డిపాజిట్ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు. అదెలా సాధ్యమంటారా అక్కడికే వచ్చేద్దాం.

గోల్డ్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చింది చైనా. ఇందులో విశేషం ఏంటంటే.. కేవలం బంగారు నగలు, గోల్డ్ బిస్కెట్లు మాత్రమే ఏటీఎంలో వేయాలి. అందులో వేసిన అరగంటలో క్యాష్ మన అకౌంట్లో జమ అయిపోతుంది. తొలుత ఏటీఎంల్లో వేసిన బంగారాన్ని 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తుంది. ఆ తర్వాత దాని ప్యూరిటీని లెక్కిస్తుంది. దాని బరువు కొలచి దానికి విలువైన డబ్బులు డిస్ ప్లే చేస్తుంది.


ఆ రోజుకు మార్కెట్‌‌లో ఉన్న ధరల ప్రకారం ఎంత డబ్బు వస్తుందో చెబుతుంది. మనం ఓకే అని బటన్ ప్రెస్ చేస్తే, మన అకౌంట్ డీటేల్స్ ఇస్తే మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇదంతా కేవలం 30 నిమిషాలలో జరుగుతుంది. ఇదేదో విచిత్రంగా ఉంది.

ALSO READ: ఐటీఐ, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు, ప్రారంభం 40 వేలు పైమాటే

అయితే గోల్డ్ ఏటీఎం మూడు గ్రాముల పైనున్న బంగారాన్ని మాత్రమే తీసుకుంటుంది. 50 శాతం బంగారంలో స్వచ్ఛత ఉండాలి. షాంఘై ఎక్స్చేంజ్ రేటు ఆధారంగా క్యాష్‌ ఇస్తుంది. సర్వీస్ ఛార్జెస్ వంటివి తీసుకుని మన అకౌంట్‌కు డబ్బులు ట్రాన్సఫర్ చేస్తుందన్నమాట.

కింగ్ హుడ్ గ్రూప్ ఈ ఏటీఎంని తయారు చేసింది. ఈ వీడియో వైరల్ అయ్యింది. దానిపై ఓ లుక్కేద్దాం. ఆ మధ్య తెలంగాణలో గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. కాకపోతే కావాల్సిన గోల్డ్ తూకం ఆధారంగా ఏటీఎంలో డబ్బులు తీసుకునే సదుపాయం.

 

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×