BigTV English

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ పై ఓనర్ సీరియస్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాకిచ్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ పై ఓనర్ సీరియస్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాకిచ్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode April 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా దగ్గర పూలు కొనడానికి వచ్చిన ఒక ఆవిడ నీ మెడలో పసుపు తాడుంది ఏంటి?  పుస్తెలతాడు లేదా అని అనగానే మీ అత్త లాక్కొనిందా?  చిన్నప్పటి నుంచి నువ్వు బడ్డే కష్టం నాకు తెలుసు అందుకే అడుగుతున్నాను అని ఆవిడ అంటుంది. అదేం లేదు అక్క పుస్తెలతాడు తెగిపోయింది అక్కడికి వెళ్లి అతుకు వేయించుకోవడానికి టైం లేదు అందుకే అక్కడే ఇంట్లో ఉంది అనేసి మీనా అబద్ధం చెప్తుంది. అత్త ముగ్గురు కోడళ్లను కూతురు లాగా చూసుకుంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మీనా అబద్ధం చెప్తుంది అది విని ఆవిడ సంతోషపడుతూ అలా వెళ్ళిందో లేదో ప్రభావతి వచ్చి ఇంట్లో వంట చేస్తారని గట్టిగా అరుస్తుంది.. సత్యం మీనా సంస్కారానికి సంతోషపడతాడు. లోపలికి వెళ్లి ప్రభావతిని మృగాలు ఇంట్లో కూడా ఉంటాయని చూస్తున్నానని సీరియస్ అవుతాడు. మీనాను బంగారం వేసుకోమని అడిగితే మా ఆయన తెచ్చినప్పుడే వేసుకుంటాను అని శపధం చేస్తుంది. మీనా మాటను బాలు నిలబెట్టుకుంటాడు. పుస్తెలు కొని ఇంటికి తీసుకెళ్తాడు. మౌనికకు గాయం తగిలిందని బాలు బాధపడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు సంజయ్ ఇంటి దగ్గర వాళ్ళని డ్రాప్ చేస్తాడు. అయితే కారు దిగగానే డబ్బులు మొఖానా కొట్టి సంజయ్ వెళ్లిపోతుంటాడు. కానీ బాలు మాత్రం డబ్బులు అంటే లక్ష్మీదేవి నువ్వు ఎందుకు ఇలా విశ్లేష పోతున్నావ్ రేపు డబ్బులు లేక అడగ తింటావా, నా చెల్లెలు ఇబ్బంది పడాలి ముందు ఆ డబ్బులు తీసి చేతికి ఇవ్వు లేదంటే మాత్రం నీవల్ల ముందే నిన్ను కొడతానని వార్నింగ్ ఇస్తాడు.. ఇక సంజయ్ ఏమి చేసేదిలేక కింద పడేసిన డబ్బులను బాలు చేతికి ఇస్తాడు. అప్పుడే సంజయ్ మనుషులలో ఒకరు మాట్లాడాలని సంజయ్ ను పిలుస్తారు. బాలు మౌనికతో ఒట్టేయించుకొని ఈ దెబ్బ ఎలా తగిలిందని అడుగుతాడు. ఒట్టు వేసుకుని ఒక మాట వేయకుండా ఒక మాట నేను చెప్తాను అన్నయ్య.. నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా అని మౌనిక బాలుతో అంటుంది. అది చూసిన సంజయ్ వీడు ఒట్టు వేయించుకుని ఏదో నిజం రాబట్టాలని చూస్తున్నాడు అని మౌనికని వెళ్లి తీసుకొని వస్తాడు.

ఇక బాలు ఇంటికి వెళ్లి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉండే ఏంటి నాన్న మీ ఆవిడ పుట్టింటికి వెళ్లిందా అని సత్యంని అడుగుతాడు. ఈ జన్మకు నాకు అంత అదృష్టం లేదులే నాన్న అని సత్యం అంటాడు. అయితే నాకు అమ్మ కావాలి నాన్న అమ్మ కావాలి నాన్న అని చిన్న పిల్లాడి లాగా చేస్తాడు బాలు. అందరినీ కేకలు వేసి హాల్లోకి రమ్మని పిలుస్తాడు. ఇందాక నేను షష్టిపూర్తి అయిపోయేంతవరకు మీ నాకు పుస్తెలు చేయించలేనని ఎవరు అన్నారు ఇవిగో పుస్తెలు తీసుకొని వచ్చాను అని అనగానే మీనా సత్యం సంతోషపడతారు.


మీనా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పూర్తి చేసుకున్నాను అనేసి సత్యంతో అంటాడు బాలు. సత్యం చాలా సంతోషంగా ఉంది రా నీ భార్య మాటని నువ్వు నిలబెట్టుకున్నావని గర్వంగా చెప్తాడు. కానీ ప్రభావం కడుపు మంట ఓర్చుకోలేక తెచ్చిందే తులం కూడా లేని పుస్తెలు. దానికి ఏదో బంగారు నగలు తెచ్చినట్లు తెగ ఫీల్ అయిపోతున్నారు దీన్ని పట్టుకోలేం ఇక వీడిని పట్టుకోలేని దేవుడో అని ఎగతాళి చేస్తుంది. దానికి శృతి ఓవరాక్షన్ చేస్తుంది వాళ్లు కాదంటే మీరు అని కౌంటర్ ఏస్తుంది.

రవి మాత్రం నీ మనసులో ఏది పెట్టుకున్నా దాచుకోవ శృతి అని అంటాడు. ఏదేమైనా నువ్వు సూపర్ అన్నయ్య వదిన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు నువ్వు గ్రేట్ అని పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ఈ ఆలస్యం ఎందుకు మీనా పుస్తెలు మెడలో వేసుకో అని అనగానే దానికంటే ఒక సమయం సందర్భం ఉందండి ఎప్పుడు పడితే అప్పుడు మెడలో వేసుకోకూడదు అని మీనా అంటుంది.

ఇక మీనా బాలు గదిలోకి వెళ్తారు. మీనా మాట నిలబెట్టుకున్నందుకు బాలుపై ప్రశంసలు కురిపిస్తుంది. నా మాటని మీరు నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి బాలు బంగారం కొనిస్తే భార్యలు ఇలా సంతోషపడతారా అని అడుగుతారు. బంగారం కొన్నందుకు కాదు బంగారం కన్నా ఎక్కువైనా నా మాటని మీరు నిలబెట్టారు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మీనా అంటుంది. దానికి బాలు నువ్వు నీ బంగారు ఇచ్చినప్పుడు లిస్ట్ రాసావు కదా అందులోంచి పుస్తెలు తీసేయి మిగతా ఒక్కోటి ఒక్కోటిగా మనం కొనేద్దామనేసి బాలు అంటాడు. మిగిలినవి నాకు ఇప్పుడు ఏమి అక్కర్లేదండి పుస్తెలు చాలు అని మీనా అంటుంది.

రోహిణి పార్లర్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడే తన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ దిలీప్ నుంచి వస్తుంది. ఏంటి కళ్యాణి నన్ను మర్చిపోయావా నాకు డబ్బులు పంపించలేదు అని వాయిస్ నోటిని పంపిస్తాడు. అది వింటుండగా ప్రభావతి అక్కడికి వస్తుంది. రోహిణి ప్రభావతిని చూసి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. మూడు వెరీ స్పెషల్..

Big Stories

×