OTT Movie : మలయాళం సినిమాలు థియేటర్లతో పాటు, ఓటిటి లో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మలయాళం లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా వీటిని రిలీజ్ చేస్తున్నారు. ఈ దర్శకులు స్టోరీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో బాగా సక్సెస్ అవుతున్నారు. అందువల్లే రీసెంట్గా వస్తున్న చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా గ్యాంగ్ స్టర్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. జోజు జార్జ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో ఎమోషన్స్, క్రైమ్ వంటివి ప్రేక్షకులు ఆలోచనలో పడేస్తాయి. మొత్తానికి ఈ సినిమాలో ఎమోషన్ డ్రామా ఉండటంతో, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? వివరాల్లోకి వెళితే ..
ఆహా (aha) లో
ఈ మలయాళ యాక్షన్ డ్రామా మూవీ పేరు ‘ఆంటోనీ’ (Antony). 2023 లో విడుదలైన ఈ సినిమాకు జోషి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జోజు జార్జ్ టైటిల్ రోల్‌లో నటించగా, కల్యాణి ప్రియదర్శన్, చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయరాఘవన్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రధాన ఫోటోగ్రఫీ మే 2023 లో వెల్లికులంలో ప్రారంభమైంది. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ రెనాదివ్, ఎడిటింగ్ శ్యామ్ శశిధరన్ నిర్వహించారు. ‘ఆంటోని’ 2023, డిసెంబర్ 1న ఆహా (aha) ఓటీటీలో విడుదలైంది.
స్టోరీలోకి వెళితే
ఆంటోనీ ఒక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ గా ఉంటాడు. అవరన్ అనే పట్టణంలో తన స్నేహితులతో కలసి ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇలా నేరాలు చేస్తున్న క్రమంలో, అతని జీవితం ఒక సంఘటనతో మారిపోతుంది. అతను పొరపాటున ఒక స్థానిక గుండా జేవియర్ ని చంపేస్తాడు. జేవియర్ కుమార్తె అన్ మరియా బాక్సింగ్ లో శిక్షణ పొందిన కళాశాల విద్యార్థిని గా ఉంటుంది. తల్లి జెస్సీని ఒక ప్రమాదంలో కోల్పోయి అనాథగా మిగిలిపోతుంది. ఫాదర్ పాల్ కట్టకాయం మధ్యవర్తిత్వంతో, ఆంటోనీ అన్ మరియాకు సంరక్షకుడిగా మారతాడు. అన్ మరియా బాక్సింగ్ నేర్చుకుని, ఒక దూకుడు స్వభావం కలిగి ఉంటుది. తన తండ్రి చావుకు కారణమైన ఆంటోనీని మొదట అసహ్యించుకుంటుంది. కానీ ఆతరువాత వారి సంబంధం క్రమంగా బలపడుతుంది. ఆంటోనీ జీవితంలో మాయ అనే ఒక హోమ్ నర్స్ తో కూడా ఎమోషనల్ పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో ఆంటోనీ గతంలోని శత్రువు టార్జన్ తిరిగి వచ్చి, అతనిపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ శత్రుత్వం ఆంటోనీ, అన్ మరియాను మరింత సవాళ్లలోకి నెట్టివేస్తుంది. ఆంటోనీ, మరియా ఎలా తమ సమస్యలను అధిగమించారు ? తమ శత్రువులను ఎలా ఎదుర్కుంటారు ? శత్రువుల దాడినుంచి ఆంటోనీ బయట పడతాడా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ యాక్షన్ డ్రామా సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : రాజకీయాలలో అబద్ధాల హరిశ్చంద్రుడు … పొట్ట చెక్కలయ్యేలా ఉందయ్యా ఈ సిరీస్ ని చూస్తే