E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాను తిట్టిన ప్రభా.. కామాక్షి ఫ్యూజుల్ అవుట్.. మీనాను దొంగను చేసిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: మీనాను తిట్టిన ప్రభా.. కామాక్షి ఫ్యూజుల్ అవుట్.. మీనాను దొంగను చేసిన ప్రభావతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 9th: నీతూ తనకు కాబోయే భర్తను తీసుకొని రెస్టారెంట్ కి వస్తుంది. మాట్లాడే మాటలు వినకుండా రవి ఎప్పుడొస్తాడని ఫోన్ చేసి పిలుస్తుంది. మేమిద్దరం లవర్స్ 2 ఇయర్స్ నుంచి రిలేషన్ లో ఉన్నాము అని చెప్పగానే అతను షాక్ అవుతాడు.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాము అని రవి అనగానే ఆ మాటలు విన్న శృతి షాక్ అవుతుంది.. ఇక వాళ్ళిద్దరిని అలా చూసిన శృతి అపార్థం చేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది.. రవి శృతిని ఎంతగా ఓదార్చాలని ప్రయత్నించిన కానీ శృతి మాత్రం అసలు వినకుండా అక్కడ నుంచి కోపంగా వచ్చేస్తుంది. కానీ నీతూ నిజం చెప్పకుండా మనిద్దరం ఉండి పోదాంలే అనేసి రవితో అనగానే రవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. నీకు సాయం చేయాలని వచ్చే నేను అడ్డంగా ఇరుక్కున్నాను ఏంటి ఇలా చేసావు అంటూ రవి శృతిని వెతుక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..

మీనా కోసం కామాక్షి వెయిటింగ్..

ప్రభావతి డాన్స్ క్లాసులు చెప్పి అలసిపోయి కూర్చుంటుంది.. ఏంటి ఎవరికోసం ఎదురు చూస్తున్నావు అంతగా గుమ్మం చుట్టూ చూస్తూనే ఉన్నావు అని ప్రభావతి అడుగుతుంది.. ఎవరికోసమో కాదు మీనా కోసమే ఎదురు చూస్తున్నాను అని ప్రభావతి అనగానే ఏ ఎందుకు? ఆ పూల దానితో అంత నీకేం పని ఇప్పుడు అని వెటకారంగా మాట్లాడుతుంది.. మీనా నీ పువ్వులు తీసుకురమ్మని చెప్పాను. ఇంకా రాలేదని కామాక్షి అనుకుంటూ ఉంటుంది.. అప్పుడే మీనా రావడంతో నీకోసమే వెయిట్ చేస్తున్నా మీనా వందేళ్లు నీకు అని కామాక్షి అంటుంది.. మీనా కి డబ్బులు ఇస్తూ ఉంటే వద్దనడంతో ఏ ఎందుకు వద్దు ఇలాంటివి వద్దులే పెద్ద పెద్దవి అయితే కావాలి అని వెటకారంగా అవమానించేలా మాట్లాడుతుంది ప్రభావతి.

కాఫీ పెట్టి ఇచ్చిన మీనా.. 

Advertisement

సరే నువ్వు కూర్చుని ఉండమ్మా నేను వెళ్లి కాఫీ పెట్టుకొని వస్తాను అని కామాక్షి ఎంతగా చెప్తున్నా సరే.. మీనా మాత్రం మీరు కూర్చుండి పిన్ని గారు నేను పెట్టిస్తాను అని అంటుంది. అయితే కామాక్షి కూర్చుని పూలు కట్టుకుంటూ ఉండదా మీనా కాఫీ పెట్టి తెచ్చి ఇచ్చుతుంది. మీనా పెట్టే కాఫీ కోసమైనా మీన దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది ఎంత హాయిగా ఉందో అని కామాక్షి అంటుంది. ప్రభావతి మాత్రం ఇంతటి కాఫీ మేం పెట్టరేమో ఏంటి అని అంటుంది.. ఇక తర్వాత మీనా నాకు వేరే పూలు ఇచ్చే పని ఉంది వెళ్ళిపోతాను అని కామాక్షితో అంటుంది. నేను అక్కడి నుంచి వెళ్ళగానే అక్కడ డాన్స్ నేర్చుకుంటున్నా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ వస్తుంది..

ప్రభావతికి అవమానం.. 

అక్కడ డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయి వాళ్ళమ్మ రాదని ఆ అమ్మాయి మాస్టర్ ఇవ్వడం మా అమ్మగారు అని పరిచయం చేస్తుంది. మీ గురించి మా అమ్మాయి చాలా బాగా చెప్పింది అండి మీరు మంచి మంచి చీరలు కడుతూ ఉంటారు అని చెప్పింది అని అంటుంది.. నేను మీలాంటి వారికి చీరల గురించి చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను చీరల వ్యాపారం చేస్తూ ఉంటాను అని ఆమె అనగానే అవునా అని ప్రభావతి కామాక్షి అనుకుంటారు. ఇక ప్రేమ్ అక్కడికి వచ్చి పరిచయం చేసుకోగానే ప్రభావతి సీరియస్ అవుతుంది.. ఇక అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పగానే ఆ చీరలు చూసి ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. ఒక చీర నాకు బాగా నచ్చింది అనగానే అది 45000 ఉంటుంది అని ఆమె అంటుంది.. 45000 మేము కొనలేమా ఏంటి అని కామాక్షిని డబ్బులు తీసుకురమ్మని చెప్తుంది..

డబ్బులు పోయాయని షాక్..

Advertisement

కామాక్షి వచ్చి తన దగ్గర దాచుకున్న రెండు లక్షలు డబ్బులు ఇవ్వాలని లోపలికి వెళ్ళగానే అక్కడ డబ్బులు లేకపోవడంతో షాక్ అవుతుంది.. ఇక్కడున్న డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని ప్రభావతితో చెప్తుంది. ఆ మాట వినగానే ప్రభావతి ఇందాక మీనా వచ్చింది కదా అదే తీసి ఉంటుంది అని అనుకుంటుంది. కానీ మీనా ఇంటికి వెళ్ళగానే ప్రభావతి వచ్చి ఆ రెండు లక్షలు ఎక్కడ దాచావో చెప్పు అని అందరి ముందర అవమానించేలా మాట్లాడుతుంది.. కానీ సత్యం మాత్రం కోడల్ని ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోను బాలు వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎవరు తీసారో వాడే తెలుస్తాడు అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : చక్రీని తిట్టిన మహా.. గాయత్రి పెళ్లికి మహా ప్లాన్..మాధవ్ కు పెళ్లి.. చివరిలో ట్విస్ట్..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×