E-Paper
Advertisement

ఫ్రెండ్ ఇంట్లో చంపి, ట్రాలీ బ్యాగ్‌లో.. మౌనిక హత్య కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..

ఫ్రెండ్ ఇంట్లో చంపి, ట్రాలీ బ్యాగ్‌లో.. మౌనిక హత్య కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..
Advertisement

Vizag Incident: విశాఖపట్నం గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో పోలీసులు జరిపిన విచారణలో వెన్నులో వణుకు పుట్టించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్రను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయగా.. సినిమా ఫక్కీలో సాగిన ఈ కిరాతక వ్యూహం బయటపడింది.

స్నేహితుడి ఇల్లే మరణవాంగ్మూలం.. పక్కా ప్లాన్‌తోనే హత్య
అయితే మౌనికను రవీంద్ర తన సొంత ఫ్లాట్‌లో కాకుండా, తన స్నేహితుడి ఇంట్లో హత్య చేసినట్లు విచారణలో తేలింది. మార్చి 29న తన స్నేహితుడి వద్ద గది తాళాలు తీసుకున్న రవీంద్ర, అది తన సొంత ఫ్లాట్ అని నమ్మించి మౌనికను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, మౌనిక కేకలు వేయకుండా ఆమె నోరు నొక్కిపట్టి, గొంతుపై మోకాలితో బలంగా అదిమి నిందితుడు ఆమెను ప్రాణాలను తీశాడు.

Advertisement

ట్రాలీ బ్యాగ్‌లో శవం.. అపార్ట్‌మెంట్‌కు తరలింపు
హత్య చేసిన అనంతరం రవీంద్ర ఏమాత్రం భయపడకుండా మృతదేహాన్ని మాయం చేసే పనిలో పడ్డాడు. మౌనికను చంపిన తర్వాత తన ఫ్లాట్‌కు వెళ్లి ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్‌ను తీసుకువచ్చాడు. స్నేహితుడి ఇంట్లోనే మృతదేహాన్ని ఆ బ్యాగ్‌లో కుక్కి, ఎవరికీ అనుమానం రాకుండా తన అపార్ట్‌మెంట్‌కు తరలించాడు. అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాల్లో మౌనిక నేరుగా వచ్చిన ఆధారాలు లేకపోవడంతో తొలుత పోలీసులకు మిస్టరీగా మారింది, కానీ రోడ్డుపై ఉన్న కెమెరాలను జల్లెడ పట్టగా అసలు విషయం బయటపడింది.

ఆన్‌లైన్ ఆర్డర్లు.. అత్యంత కిరాతకంగా ముక్కలు
మృతదేహాన్ని తన ఫ్లాట్‌కు తెచ్చిన తర్వాత రవీంద్ర ప్రవర్తన రాక్షసంగా మారింది. మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు అవసరమైన కత్తులు, క్లీన్ చేయడానికి వైపర్, డస్ట్ బిన్, ప్లాస్టిక్ కవర్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు. ఎలాంటి తడబాటు లేకుండా మృతదేహాన్ని ముక్కలు చేసి, వాటిని ఫ్రిజ్‌లో దాచాడు. ఈ విచారణలో అతను చెప్పిన వివరాలు విని సాక్షాత్తూ పోలీసులే విస్తుపోయారు.

Advertisement

జీడితోటలో సాక్ష్యాల దహనం
ఫ్రిజ్‌లో భద్రపరిచిన శరీర భాగాలను దశలవారీగా బయటకు తీసుకెళ్లి, సమీపంలోని జీడి తోటలో పెట్రోల్ పోసి నిందితుడు తగులబెట్టాడు. అయితే, తన స్నేహితుడికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని, అతను కేవలం గది తాళాలు మాత్రమే ఇచ్చాడని రవీంద్ర విచారణలో పేర్కొన్నాడు. సాక్ష్యాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు అతను చేసిన ప్రయత్నాలు పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Also Read: జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని తాకుతున్న మంటలు, భయాందోళనలో స్థానికులు!

ముగిసిన కస్టడీ.. రెండోసారి విచారణకు సిద్ధం
మూడు రోజుల పాటు సాగిన పోలీసు కస్టడీ ముగియడంతో రవీంద్రను తిరిగి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో ఇంకా కొన్ని లొసుగులను పూడ్చడానికి, మరిన్ని కీలక ఆధారాలు సేకరించడానికి గాజువాక పోలీసులు రవీంద్రను రెండోసారి కస్టడీకి తీసుకోవాలని కోర్టును కోరే యోచనలో ఉన్నారు. ఈ కిరాతక ఘటన విశాఖ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×