BigTV English

GudiGantalu Today episode: మీనాను అవమానించిన రోహిణి.. మనోజ్ దెబ్బకు చెమటలు.. రౌడీగా మారిన బాలు..

GudiGantalu Today episode: మీనాను అవమానించిన రోహిణి.. మనోజ్ దెబ్బకు చెమటలు.. రౌడీగా మారిన బాలు..

Gundeninda GudiGantalu Today episode August 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. పోలీస్ వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇవ్వడానికి వెళుతుంది.అయితే అక్కడ మీనాన్ని చూసి నువ్వు చాలా ధైర్యవంతురాలు అమ్మ అని మెచ్చుకుంటారు. అంతేకాదు అయితే బాలు ని ఇరికించడానికి కారణం సంజయ్ ని చెప్పడంతో మీనా షాక్ అవుతుంది.. మౌనిక తన అన్న మీద పడ్డ నింద పోయింది అని సంతోషంగా ఉంది. సంజయ్ ని ఇదంతా చేశాడని తెలుసుకొని సంజయ్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. ఇదంతా చేసింది నేనే అని నీకు తెలిసిపోయిందా అని మౌనికను సంజయ్ అంటాడు. మీ ఇంట్లో వాళ్ళు అందులోను మీ అన్న అంటే నాకు చాలా కోపం ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుని ఇదంతా చేశాను అని సంజయ్ అంటాడు. సంజయ్ మౌనికను కొట్టబోతాడు. అడ్డుకున్న మేన సంజయ్ ఇదంతా చేస్తున్నాడని తెలిసి కొడుతుంది. శృతిని ఎవరో ఎదవ ఏడిపిస్తుంటేనే చావబాదాను.. నిన్ను కొట్టడం పెద్ద పని కాదు అని చెంప పగలగొడుతుంది. మా ఆయన మీద నీకు కోపం ఉండొచ్చు కానీ ఇలా నీ కోపాన్ని తీర్చుకోవాలని ఇంకోసారి చూస్తే అస్సలు ఊరుకోను.. మౌనిక నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా నువ్వు మారతావని ఆశగా ఎదురుచూస్తుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది మీనా. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి కారు కొన్నావు కదా మరి పార్టీ ఏది అన్నయ్య అని మనోజ్ ని అడుగుతాడు. రాత్రి టెర్రస్ పై పార్టీ కావాలి మాకు అని రవి అడుగుతాడు. ఇక రాత్రి అవ్వగానే రవి సైగలు చేస్తూ ఉంటాడు బాలుని పైకి రమ్మని అడుగుతాడు. బాలు మాత్రం మీనాకి ఇచ్చిన మాట ప్రకారం తాగకుండా పైకి వెళ్లి కూర్చుంటాడు. మనోజ్ బిజినెస్ ఐడియాల గురించి అడుగుతుంటే బాలు అతనిపై సెటైర్ల వర్షం కురిపిస్తాడు. కింద ముగ్గురు కోడళ్ళు ఒక చోటికి చేరి ముచ్చట్లు పెట్టుకుంటారు. మీనా ఇచ్చిన బిజినెస్ ఐడియా వల్ల రోహిణి దారుణంగా మీనాని అవమానిస్తుంది..

మనోజ్ రవి ఇద్దరూ పర్మిషన్ తోనే బీర్ తాగుతున్నారు.. కానీ బాలుకు మాత్రం మీనా పర్మిషన్ అవసరం లేదు.. తాగాలనుకుంటే తాగేస్తాడు.. ఈపాటికి రెండు మూడు బీర్లు తాగేసి పడిపోయి ఉంటాడు పైన రచ్చ చేసేది కూడా బాలునే అని రోహిణి అంటుంది. బాలుని తాగేసి వాగుతున్నాడు బెట్టెంత అని రోహిణి అడుగుతుంది. బెట్టెందుకు పైకెళ్ళి చూద్దాం పదని శృతి అంటుంది. పైకి వెళ్ళగానే మనోజ్ నా కళ్ళజోడు ఎక్కడ పోయిందంటూ డాబాపై మొత్తం తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు.


వీడు ఒక్క బీరుకే ఇలా అయిపోయాడు ఏంట్రా అని వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు.. అప్పుడే రోహిణి శృతి మీనా పైకి వస్తారు. ఏమైంది ఏం వెతుకుతున్నారు అని అడిగితే గుడి ముందర వెతికాను. ఇప్పుడు పార్కులో వెతుకుతున్నాను నా కళ్ళజోడు ఎక్కడ కనిపించలేదు అంటూ మనోజ్ అటు ఇటు తిరగడం చూసి రోహిణి షాక్ అవుతుంది.. బాలు మీకు ఇంత డబ్బులు రావడానికి కారణం ఎవరు అని అడుగుతాడు.. నాకు డబ్బులు ఇచ్చింది ఒక దేవత అని మనోజ్ అంటాడు. అయితే రోహిణి మధ్యలో ఆపేసి మనోజ్ కి బాగా ఎక్కింది మా నాన్నను పట్టుకుని నన్ను దేవత అంటున్నాడు అని కిందకు తీసుకొని వెళ్ళిపోతుంది.

రవి శృతిని తీసుకొని కిందకు వెళ్ళిపోతాడు.. మీనా మీరు తాగలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సరే అని అంటుంది. వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కాస్త మల్లెపూల వరకు వెళుతుంది. ఇక బాలు ఉదయాన్నే కష్టమని తీసుకొని షాపు దగ్గరికి వెళ్తాడు. అక్కడ కొంతమంది రౌడీలు అతన్ని ఇబ్బంది పెట్టడం చూసి వాళ్ళని చితక బాదుతాడు. అసలు ఏంటి సర్ మ్యాటర్ ని అడుగుతాడు.. షాప్ అతను అసలు విషయాన్ని బయట పెడతాడు. మీది ఈ షాప్ నమ్మాలి అనుకుంటున్నారు కదా మా అన్నయ్య ఒకడున్నాడు వాడికి బిజినెస్ ఐడియా చాలా ఉన్నాయి వాడిని తీసుకొస్తానని అంటాడు.

ఇక రోహిణి మనోజ్ రాత్రంతా బాగాడు కాస్త ఇంతే దొరికించేవాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే మనోజ్ లేస్తాడు నాకు తలనొప్పిగా ఉంది రోహిణి ఏదైనా చెయ్యు అని అడుగుతాడు.. మనోజ్ రోహిణి కిందకొస్తారు. ప్రభావతి ఏంట్రా ఇంత లేట్ అయింది అని అడుగుతుంది.. నాకు తలనొప్పిగా ఉంది అమ్మ ఎందుకంత గట్టిగా అరుస్తావు అని అంటాడు. మీనా నిజం చెప్పబోతే రోహిణి అడ్డుపడుతుంది.. అప్పుడే రవి కూడా కిందకి వస్తాడు. ఎందుకమ్మా అంత గట్టిగా అరుస్తున్నావ్ తలనొప్పి తీస్తుంది అని అంటాడు.

ఏంట్రా ఏమైందిరా మీ ఇద్దరికీ ఒకేసారి తలనొప్పి ఎందుకు వచ్చింది రా అని ప్రభావతి అడుగుతుంది.. వీళ్లంతా రాత్రి బాగా అని మీనా మొదలు పెడుతుంది. కానీ తాగిన విషయం తెలిస్తే సత్యం సీరియస్ అవుతాడని వాళ్ళు మేనేజ్ చేస్తారు. అప్పుడే ఇంట్లోకి బాలు వస్తాడు. బిజినెస్ గురించి ఏం ఆలోచించావు రా అని అడుగుతాడు. వీళ్ళు రాత్రంతా బాగా ఆలోచించారు అని బాలు అంటాడు. దానికి ప్రభావతి మీ అందరికీ ఏమైంది అందరూ ఒకేలా మాట్లాడుతున్నారు ఏంటి అని అడుగుతుంది. అయితే నేను ఒక బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాను అని బాలు అంటాడు.

Also Read :పల్లవి ప్లాన్ రివర్స్.. పార్వతి ప్రాణాలను కాపాడిన అవని.. అవనికి ఘోర అవమానం..

నువ్వు తెచ్చిన ఐడియా అయితే కచ్చితంగా ఏ పూల షాప్ ఓకే రానా షాపు అయే ఉంటుంది అని ప్రభావతి అంటుంది. పూల షాప్ ని బాగా డెవలప్ చేసి ఓకే షాప్ లాగా మార్చొచ్చు అని బాలు అంటాడు. ఓకే షాప్ కాదన్నయ్య బొకే షాప్ అని రవి అంటాడు. అటు కిరాణా షాప్ ని సూపర్ మార్కెట్కు కూడా మార్చొచ్చు అని అంటాడు.. ఇదంతా కాదు ఒక ఫన్నీ చర్చ షాప్ ని చూశాను ఆయన తక్కువ రేటుకే అమ్ముతున్నాడు అని అంటాడు బాలు.. దాంతో వీడింత మంచి ఐడియాను తీసుకొచ్చాడు అని అందరూ షాక్ అవుతారు. ప్రభావతికి నోట మాట రాదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Today Movies in TV : గురువారం టీవీలల్లోకి వచ్చే సినిమాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ పై మాజీ లవర్ రివేంజ్.. శ్రీవల్లికి మరో షాక్.. చందుకు అవమానం..

Nindu Noorella Saavasam Serial Today August 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రగుప్తుడిని తిట్టిన ఆరు

Brahmamudi Serial Today August 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్పృహ కోల్పోయిన రాజ్ – దుఖః సంద్రంలో కావ్య

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. పార్వతి ప్రాణాలను కాపాడిన అవని.. అవనికి ఘోర అవమానం..

Big Stories

×