BigTV English

Himachal floods: ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. ఉప్పొంగిన రావి, బియాస్‌ నదులు

Himachal floods: ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. ఉప్పొంగిన రావి, బియాస్‌  నదులు

Himachal floods: ఉత్తరాదిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రావి, బియాస్‌ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.


వరద ప్రవాహం కారణంగా మనాలిలోని రైసన్ టోల్‌ ప్లాజా మునిగింది. టోల్‌ ప్లాజా నీట మునగడంతోపాటు చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. పురాతన భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో, రావి, బియాస్‌ నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఫలితంగా పరీవాహక ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. చాలా చోట్ల మనాలీ–లేహ్‌ రహదారి నదీప్రవాహం కారణంగా కొట్టుకుపోయాయి. మనాలీలోని బహంగ్‌ ప్రాంతంలో ఒక మల్టీ స్టోరేజీ బిల్డింగ్ నీటి ప్రవాహ ధాటికి కూలి నదీ ప్రవాహంలో పడింది.


రెస్టారెంట్లు, దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున షాపులు ధ్వంసమయ్యాయి. రహదారిపై నిలిచిన వాహనాలు నదీప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న యాత్రికులు పలు చోట్ల చిక్కుకుపోయారు.

ALSO READ: అమెరికాను దెబ్బ కొట్టేందుకు మోదీ స్వదేశీ మంత్రం ఫలిస్తుందా?

పత్లీకుహాల్‌ ప్రాంతంలో ఇళ్లు నీట మునిగాయి. కులూ ప్రాంతంలో బియాస్‌ నది ఉధృతంగా ప్రవహించింది. కినౌర్‌ జిల్లాలోని కన్వీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. కంగ్రా, చంబా, లహౌల్‌ స్పితి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

మణి మహేష్ కోసం యాత్రను చేపట్టిన వేలాది మంది భక్తులు హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలోని అనేక ప్రదేశాలలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు తెలిపారు. మణిమహేష్ యాత్ర ఆగస్టు 17న ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 వరకు జరుగుతుంది. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో యాత్రికులు చంబా, భర్మౌర్, సలోని జిల్లాలోని ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు.

యాత్రికుల సంఖ్య దాదాపు 10,000 ఉంటుందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆ రాష్ట్రర చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా తెలిపారు. చంబాలో ఆకస్మిక వరదల కారణంగా చిక్కుకున్న 3,269 మంది యాత్రికులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రక్షించింది.

వరద కారణంగా ఆర్ని విశ్వవిద్యాలయంలో చిక్కుకున్న 400 మందికి పైగా విద్యార్థులను NDRF రక్షించింది. ఎత్తైన ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడంతో విశ్వవిద్యాలయ ప్రాంగణం నీట మునిగింది.

Related News

Gadchiroli Encounter: 8 గంటలపాటు గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి, గాలింపు ముమ్మరం

Modi New Strategy: అమెరికాను దెబ్బ కొట్టేందుకు మోదీ స్వదేశీ మంత్రం.. ఫలిస్తుందా?

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావం వీటిపైనే

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Big Stories

×