Intinti Ramayanam Today Episode August 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయనకు జాబు రాలేదంటే కచ్చితంగా నువ్వు ఎదురు రావడం వల్ల అని నా మీద వేస్తాడు మామయ్య అని అంటుంది. అక్షయ్ అక్కడికి సంతోషంగా స్వీట్లు పట్టుకుని వస్తాడు. జాబ్ వచ్చింది అన్న విషయాన్ని అందరితో పంచుకుంటాడు.. ఆరాధ్యను ఎత్తుకొని ముద్దాడుతూ నాకు జాబ్ వచ్చిందమ్మా అని సంతోషంగా చెప్తాడు. నీకోసం స్వీట్స్ తెచ్చానని ఆరాధ్యతో అంటాడు. నీ సంతోషాన్ని నాతో పంచుకున్నావు.. అయితే అమ్మతో తాతయ్యతో కూడా పంచుకో అనేసి అంటుంది.. నేనైతే ఇవ్వను నీవు కావాలంటే స్వీట్స్ ఇవ్వు అని అక్షయ్ అంటాడు. వీడికి ఎంత జరిగినా పొగరు మాత్రం తగ్గట్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పల్లవి, శ్రీయాలు వ్రతం ఆగిపోవాలని ప్లాన్లు వేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి శ్రేయ ఇద్దరూ కూడా.. అవనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటారు.. మంటు గదిలోన మిక్సీకి షాక్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. ముందుగా అవని వంట గదిలోకి వెళ్తుందని అందరూ అనుకుంటారు.. కానీ అవని మంట గదిలోంచి మళ్లీ బయటకు వస్తుంది ఆ తర్వాత వెంటనే పార్వతి అక్కడికి వెళ్తుంది. మిక్సీని ఆన్ చేయగానే షాక్ కొడుతుంది.. పార్వతి కేకలు విని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడుతూ వస్తారు.. ముందుగా అవని పార్వతిని కాపాడ్డానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో తనకి గాయం తగిలినా కూడా పట్టించుకోకుండా పార్వతిని షాక్ నుంచి బయటపడేస్తుంది.
పార్వతి కింద పడిపోవడంతో ప్రాణాలతో బయటపడిందని అందరు అనుకుంటారు. అయితే అందరూ పార్వతికి ఏమైందో అని కంగారుపడుతూ ఏడుస్తూ ఉంటారు.. కాసేపు ఆగిన తర్వాత పార్వతి లేస్తుంది. అవని వదిన లేకున్నా అంటే నువ్వు ఈరోజు ఊహించుకోలేని స్థితిలో ఉండేవమ్మా అని కమలంటాడు.. అవనికి పార్వతి చేతులెత్తి దండం పెడుతుంది. అత్తయ్య అదేంటది అని అవని అంటుంది. చెప్పండి అత్తయ్య మీకు ఇప్పుడు ఎలా ఉంది.. బాగానే ఉందా హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతుంది అవని..
నాకేం పర్లేదు అమ్మ బాగానే ఉంది అని పార్వతి అంటుంది.. మీరు ఎంత గొప్ప మనసుతో సత్యనారాయణ వ్రతం చేయాలని అనుకున్నారు ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు అని అవని అంటుంది. ఇప్పుడు ఆజ్ఞలు ఏంది చీమైనా కొట్టదంటారు కదా ఇప్పుడు ఆ దేవుడే మిమ్మల్ని ఇలా ప్రాణాలతో బయటపడేలా చేశాడు అని అంటుంది. ఇక అందరూ కలిసి పార్వతిని రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. రాజేంద్రప్రసాద్ పార్వతి కోసం కాఫీ తీసుకొని వస్తాడు.. అవని గురించి ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది అని తనకి జరిగిన పరిస్థితి గురించి వివరిస్తాడు.
నేను అవని గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు నన్ను ప్రణతిని ఎంతగా ఆదరించి చూసుకుంటుందో అర్థం చేసుకో.. అంతెందుకు గతంలో అవని ఎన్ని మంచి పనులు చేసింది ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించు. ఏదో ఎక్కడో పొరపాటు జరిగితే అదే నిజం అనుకొని నువ్వు నమ్ముతున్నావు.. కావాలని చెప్పట్లేదు నువ్వే ఆలోచించుకో పార్వతి నీకు ఏదైనా కావాలంటే నన్ను పిలువు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు రాజేంద్రప్రసాద్. పార్వతి అవని కాపాడిన దృశ్యాన్ని ఊహించుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
పల్లవి సెట్ చేసిన మనుషులు అవనీని ఎలాగైనా అవమానించాలని అనుకుంటారు. పల్లవి సిగ్నల్ ఇవ్వడంతో అవని దగ్గరకొచ్చి దారుణంగా మాట్లాడుతారు.. కుటుంబాన్ని విడగొట్టిందంటూ ఎన్నెన్నో మాటలు అంటారు. అయితే అవన్నీ విన్న పార్వతి నోరు ముయ్యండి.. ఆ కోడలు గురించి మాట్లాడే అర్హత మీకెవరు ఇచ్చారు అని అరుస్తుంది. అంతేకాదు చెంప పగలగొడుతుంది.. నా కోడలు ఏంటో నాకు తెలుసు మర్యాదగా నా కోడలికి సారీ చెప్పండి అని అంటుంది..
Also Read: లేడీ గెటప్స్ తో నవ్వించే వినోద్ జీవితంలో విషాదం.. సూసైడ్ చేసుకోవాలి ఫిక్స్..
పార్వతిలో ఈ మార్పును చూసిన కుటుంబ సభ్యులు సంతోష పడతారు. మా కుటుంబంలో ఏదైనా జరిగితే అది నాకు నొప్పి.. మీకేం నొప్పి అసలు మీరు ఎందుకు వచ్చారు అని పార్వతి వాళ్లకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. పార్వతిలోని మార్పును చూసి పల్లవి శ్రీయాలు ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో పల్లవి గురించి నిజం తెలిసిపోతుందా? లేదా ఏం జరుగుతుందో చూడాలి…