E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి క్లాస్ పీకిన శృతి..మీనాను అవమానించిన ప్రభావతి.. కొత్త కారు కొన్న బాలు…

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి క్లాస్ పీకిన శృతి..మీనాను అవమానించిన ప్రభావతి.. కొత్త కారు కొన్న బాలు…
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ రోహిణి షాప్ లో ఉంటారు.. అక్కడికి ఒక కానిస్టేబుల్ రావడంతో ఏమైంది అని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. పోగొట్టుకున్న ఫర్నిచర్స్ ఇతను కొన్నాడు ఇతను దగ్గర కొన్ని ఉన్నాయి అట వాటికి మీరు డబ్బులు చెల్లించి అతని దగ్గర తీసుకోండి అని అతను అంటాడు. మేమే డబ్బులు ఇవ్వాలా అదేంటి అని రోహిణి అడుగుతుంది ఇతను కొన్న వాటికి లక్ష రూపాయలు అయింది. అయితే మనము మీనా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడు విచ్చి వాటిని డబల్ రేటు కమ్మి డబ్బులు ఇచ్చేద్దామని రోహిణి అంటుంది. ఇక మనోజ్ కూడా రోహిణి మాటను కాదనలేక డబ్బులు ఇస్తాను ఇవ్వండి అని అంటారు. తర్వాత సత్యం వచ్చి ఇంట్లో కూర్చుని పొరమాలినట్లు ఉంటుంది.. సత్యం కు పోరమాలడం చూసిన ప్రభావతి వాటర్ ఇస్తుంది. అని సత్యం మాత్రం ఆ నీళ్లను తాగడానికి ఇష్టపడడు. నేను ప్రాణం పోయినా కూడా మళ్లీ ఆ చేత్తో ఏది తీసుకొని అని అంటాడు. అది విన్న ప్రభావతి కనీసం మంచినీళ్లు కూడా తీసుకోరా అని బాధపడుతుంది.. రోహిణి డబ్బులు ఇస్తుంది. కానీ సత్యం మాత్రం ప్రభావతితో మాట్లాడడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యంని ఎలాగైనా సరే గదిలోకి పంపించాలని బాలు మీనా ప్రయత్నాలు చేసి మొత్తానికి గదిలోకి పంపించేస్తారు. ఇక ప్రభావతి నేను అక్కడేం పడుకొని ఇక్కడే పడుకుంటానని కింద పడుకుంటుంది. ఉదయం మీనా వంట గదిలో కాఫీ చేస్తూ ఉండగా శృతి లేచి వస్తుంది. వెంటనే రోహిణి కూడా వస్తుంది.. ఇంత ఉదయం నువ్వెందుకు లేచావని శృతిని చూసి రోహిణి మీనా ఇద్దరు షాక్ అవుతారు.. ఇక అందరూ కలిసి నగల గురించి మరోసారి చర్చ మొదలు పెడతారు. రోహిణి శృతి మధ్య చిన్నపాటి యుద్ధం మొదలవుతుంది. ఎందుకు నువ్వు ఊరికే అన్ని నీ మీద వేసుకొని మాట్లాడతావు అని రోహిణి అంటుంది.. నేనే మాట్లాడను మనోజ్ చేసిన తప్పు కాదు అని నువ్వు అంటున్నావు.

Advertisement

మనోజ్ చేసింది తప్పు కాదా.. నిజంగా నువ్వు నీ గుండెల మీద చెయ్యి చెప్పు అని శృతి అడుగుతుంది. ఒకవేళ మీనా వాళ్ళ ఆయన నీ నగలను తీసుకెళ్లి అమ్మేసుకొని వస్తే అప్పుడు నువ్వు ఏం అనవా? సర్దుకోవాలి కదా అని అంటావా అని శ్రుతి మాటకు మాట సమాధానం చెప్పి రోహిణికి దిమ్మతిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. రోహిణి ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి ఆ బాలు లాగే మాట్లాడుతున్నావు అని శృతి తో అంటుంది. ఇప్పుడు మీరిద్దరిలా వాదించుకుంటూ ఉంటే అత్తయ్య మామయ్య కలవరు మనం వెళ్లి వాళ్ళిద్దర్నీ కలపాలి అని అంటుంది మీనా..

మీనా నువ్వు మావయ్య గారికి చెప్తే ఒప్పుకుంటాడు కదా మరి నువ్వు ఎందుకు చెప్పలేదు అని రోహిణి అంటుంది. నేను ఎప్పుడో మావయ్య గారితో ఈ విషయం గురించి మాట్లాడాను. కానీ ఆయన మాత్రం అత్తయ్య విషయంలో నేను క్షమించను అని ఒక్క మాటతో చెప్పేసాడు అని మీనా అంటుంది. మావయ్య మనసు మారేలా కనిపించలేదు. ఒకసారి అత్తయ్యతో మాట్లాడి ఆవిడని మామయ్యతో మాట్లాడమని చెబుదామని మీనా అంటుంది. నేనైతే ఆవిడకి అస్సలు చెప్పను ఆవిడ చేసిందే పెద్ద నేరం అలాంటిది ఇప్పుడు నేను ఆవిడ దగ్గరికి వెళ్లి ఇలా చేయండి అని చెప్పడం నాకు అస్సలు నచ్చదు అని శృతి అంటుంది.

Advertisement

నువ్వు మీ అత్తయ్యకి నెల నెల పాకెట్ మనీ ఇస్తావు కదా.. నువ్వే అంకుల్ తో మాట్లాడమని చెప్పొచ్చు కదా రోహిణి అని శృతి అంటుంది.. మనం ఒక్కరం కాదు మన ముగ్గురం వెళ్తే ఆమె ఈ మాట గురించి ఆలోచిస్తుంది అని ముగ్గురు తోడికోడలు కలిసి ప్రభావతి దగ్గరికి వెళ్తారు.. ప్రభావతి ఏంటి ముగ్గురు కలిసే వచ్చారు ఏం జరిగింది అని అడుగుతుంది. మీరు మావయ్య ఇద్దరూ అలా ఉండడం మాకు నచ్చలేదు మీరు వెళ్లి మామయ్యతో మాట్లాడండి అని అంటారు. ఆ మాట వినగానే ప్రభావతి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఆయన మాత్రమే నన్ను దూరం పెట్టేస్తున్నాడు అని అంటుంది.

మీరు ఇలా ఉంటే కుదరదు ఆంటీ మీరు మామయ్య మాట్లాడండి అని అంటారు.. శృతి మీరు ఇదంతా కాదండి మీనాకు సారీ చెప్పండి అంకుల్ ఆటోమేటిగ్గా మాట్లాడతాడు అని అంటుంది… నేను వెళ్లి ఆ పూలు అమ్ముకునే దానికి క్షమాపణలు చెప్పాలా ఇది మీ ఇద్దరినీ రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చిందా అని ప్రభావతి సీరియస్ అవుతుంది.. నేనెప్పుడూ మీ గురించి అలా అనుకోలేదు అంటే అత్తయ్య మీరు మావయ్య కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని మీనా అంటుంది.. ప్రభావతి మాత్రం మీనాని దారుణంగా అవమానిస్తుంది.. మాట్లాడుకోవడం మాట్లాడుకోకపోవడం అది మీ ఇష్టం మీకే వదిలేస్తున్నాము అని మీనా శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Also Read : ‘పొదరిల్లు’ మహా క్యూట్ స్టోరీ.. కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్ లక్షా..?

ఇక ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అన్నది చెప్తుంది.. మీనాని అనకుండా అసలు ఉండలేవా వదిన అని కామాక్షి ప్రభావతికి గడ్డి పెడుతుంది.. నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది.. ఈ పూలు అమ్ముకునేది నన్ను నా ఇంట్లోనే ఉండనివ్వకుండా చేస్తుంది అని ప్రభావతి మీనా పై ఘోరంగా నిందలు వేస్తుంది.. ఇక బాలు సెకండ్ హ్యాండ్ లో మరొక కారు కొనాలని రాజేష్ ని తీసుకొని షో రూమ్ కి వెళ్తాడు. కార్లను చెక్ చేసిన బాలు మీ నాకు ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. ఇద్దరు కలిసి సెలెక్ట్ చేస్తారు కానీ మీనా ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం కొనకపోవడమే మంచిది అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×