E-Paper
Advertisement

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ మహా క్యూట్ స్టోరీ.. కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్ లక్షా..?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ మహా క్యూట్ స్టోరీ.. కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్ లక్షా..?
Advertisement

Podarillu Mahalakshmi : బుల్లితెరా పై ఎన్నో సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి.. అందులో కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంటాయి. ఈ మధ్య బుల్లితెర పై ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్లోనూ కన్నడ యాక్టర్స్ నటిస్తున్నారు. ఒక్కోసారి తెలుగు సీరియల్స్ నా లేక కన్నడ సీరియల్సా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తెలుగులో చాలా మంది అందమైన సీరియల్ హీరోయిన్లు ఉన్నారు. కానీ డైరెక్టర్స్ కు కన్నడ ముద్దుగుమ్మలంటే ఇష్టమేమో అన్న సందేహాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ కొత్త సీరియల్స్ లకు కొత్త వాళ్లను తీసుకుంటారు. ఇక విషయానికొస్తే.. ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో కొత్తగా పొదరిల్లు అనే సీరియల్ ప్రారంభం అయ్యింది. అందులో తమిళ హీరో, కన్నడ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహా పాత్రలో కృతిక ఉమా శంకర్ నటించారు. ఈమె తెలుగులో మగువా ఓ మగువా అనే సీరియల్ లో నటించింది.. దాంతో ఆమె లైఫ్ స్టోరీని తెలుసుకొనేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఆమె క్యూట్ స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం..

మహాలక్ష్మీ రియల్ లైఫ్..

పొదరిల్లు సీరియల్ లో మహాలక్ష్మి పాత్రలో నటించిన అమ్మాయి పేరు కృతిక ఉమా శంకర్.. మగువ ఓ మగువ” అనే సీరియల్‌లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.. కృతిక కర్ణాటకలోని బెంగుళూరుకు చెందినవారు. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేదట.. ఇక బెంగుళూరులోనే చదువును పూర్తి చేసింది. అయితే ఆమె తన కుటుంబ సభ్యుల వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం నటిగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. కన్నడలో పలు సీరియల్స్ లలో నటించింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, ఎక్కువగా తన వృత్తిపరమైన అప్‌డేట్‌లు, ఫోటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటుంది. ఆ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు..

Advertisement

Also Read: బుల్లితెర ఆడియన్స్ కు బ్యాడ్ న్యూస్.. త్వరలో శుభం కార్డు పడబోతున్న టాప్ సీరియల్స్..

రెమ్యూనరేషన్ ఒక్కరోజుకు లక్షా..? 

కన్నడ యాక్టర్స్ కు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. దాంతో ఇక్కడ వాళ్ల కోసం భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.. వేరే రాష్ట్రాల అమ్మాయిలు పనిపై శ్రద్ద పెడతారు. టైం ను చూసుకోరు అనే వాదన గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. అయినా కూడా మన సీరియల్ డైరెక్టర్లు వాళ్లనే తీసుకుంటున్నారు. అంతేకాదు తెలుగు వాళ్ళతో పోలిస్తే కన్నడ ముద్దుగుమ్మలకు ఎక్కువగానే పారితోషికం ఇస్తున్నారు. పొదరిల్లు సీరియల్ హీరోయిన్ తెలుగులో మగువా ఓ మగువా సీరియల్ తో పరిచయం అయ్యింది. అందులో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో రెండో సీరియల్ కు రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం. ప్రస్తుతం అన్నిటికి కలిపి లక్ష తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియలేదు.. ఏది ఏమైనా కూడా కన్నడ, కేరళ ముద్దుగుమ్మలు ఒక్కరోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. దేనికైన అదృష్టం ఉండాలి.

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×