E-Paper
Advertisement

OTT Movie : ప్రెసిడెంట్ మర్డర్ కి స్కెచ్ వేసే డేంజర్ మిషన్… ఒక్కో సీన్ కిరాక్… క్లైమాక్స్ మెంటల్ మాస్

OTT Movie : ప్రెసిడెంట్ మర్డర్ కి స్కెచ్ వేసే డేంజర్ మిషన్… ఒక్కో సీన్ కిరాక్… క్లైమాక్స్ మెంటల్ మాస్
Advertisement

OTT Movie : స్క్విడ్ గేమ్ నటుడు లీ జంగ్-జే తొలిసారిగా ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా కొరియాలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. . ఒక ఉత్కంఠ భరితమైన కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. 1980ల దక్షిణ కొరియా రాజకీయాల నేపథ్యంలో KCIA (కొరియన్ సీఐఏ)లోని ఇద్దరు టాప్ ఏజెంట్ల మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్స్, అనూహ్య ట్విస్ట్‌లతో ఈ కథ ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో వచ్చిన ఈ కొరియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ పేరు ‘హంట్’ (Hunt). ఈ సినిమాకి ‘Squid Game’ స్టార్ లీ జంగ్-జే దర్శకుడు, హీరో, స్క్రీన్‌ప్లే రచయితగా కూడా వ్యవహరించాడు. ఇదే అతని మొదటి దర్శకత్వ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ డబ్బింగ్‌తో పాటు ఒరిజినల్ కొరియన్ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2022 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మిడ్‌నైట్ స్క్రీనింగ్, బ్లూ డ్రాగన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ న్యూ డైరెక్టర్ (లీ జంగ్-జే), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (జంగ్ వూ-సంగ్), గ్రాండ్ బెల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ వంటి 8 అవార్డ్స్ గెలుచుకుంది.

Advertisement

Read Also : తండ్రి హత్య కేసులో కూతురి ఇన్వెస్టిగేషన్… అడుగడుగునా అవాంతరాలు… తమన్నా నటించిన తోపు సిరీస్

స్టోరీలోకి వెళ్తే

1980 కాలం నాటి దక్షిణ కొరియాలో మిలిటరీ డిక్టేటర్ పాలన ఉంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రెసిడెంట్‌పై హత్యాయత్నం జరుగుతుంది, ఉత్తర కొరియా ఏజెంట్లు దేశంలో చొరబడ్డారని సమాచారం వస్తుంది. KCIA (కొరియన్ సీఐఏ) ఫారిన్ యూనిట్ చీఫ్ పార్క్ ప్యోంగ్-హో ఈ కుట్రను ఆపాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో డొమెస్టిక్ యూనిట్ చీఫ్ జంగ్-డో కూడా అదే మిషన్‌లో ఉంటాడు. ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా అనుమానిస్తారు. ఎవరో ఒకరు గూఢచారి అని నమ్ముతారు. ఈ అనుమానం వల్ల ఇద్దరూ ఒకరినొకరు చంపడానికి కూడా సిద్ధమవుతారు, కానీ నిజమైన శత్రువులు మరెవరో ఉన్నారు.

Advertisement

కథ ముందుకు సాగుతుంటే రహస్య ఆపరేషన్స్, బాంబు దాడులు, రోడ్డు చేజింగ్స్ వంటి ఉత్కంఠ సన్నివేశాలు వస్తాయి. చివరి 30 నిమిషాల్లో ఒక్కో ట్విస్ట్ ప్రేక్షకుల మైండ్ షేక్ చేస్తుంది. ఎవరు దేశభక్తులు, ఎవరు ద్రోహులు అన్నది చివరి సెకను వరకు తెలియదు. అసలు నేరస్తులు ఎవరు ? ప్రెసిడెంట్‌పై హత్యాయత్నం ఎందుకు చేశారు ? వీళ్ళను ఆ ఇద్దరు ఏజెంట్లు పట్టుకుంటారా ? అనే విషయాలను ఈ ఈ కొరియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×