E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు కొత్త టెన్షన్.. కొత్త కారు కొన్న బాలు.. ఒక్కటైన సత్యం, ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు కొత్త టెన్షన్.. కొత్త కారు కొన్న బాలు.. ఒక్కటైన సత్యం, ప్రభావతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 17th: నిన్నటి ఎపిసోడ్ లో..  సుశీల 40 లక్షలు తిరిగి ఇవ్వాలని అంటుంది. ఇప్పుడు అంత డబ్బులంటే కష్టం కదా అత్తయ్య అని ప్రభావతి అంటుంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని బాలు అంటాడు. ప్రతి నెల 50 వేలు ఇవ్వాలని అంటాడు. బాలు చెప్పింది నిజమే.. ఇవ్వాలి అని సుశీల కూడా అనడంతో మనోజ్ షాక్ అవుతాడు. నాకే సంబంధం లేదు నువ్వు చేసే ప్రతి తప్పుని నా మీద వేసుకోలేను అని రోహిణి అంటుంది. నువ్వు కచ్చితంగా డబ్బులు ఇవ్వాలి రా ఒప్పుకో అనేసి ప్రభావతి అంటుంది. బాలు ఏమి చేయలేక ఒప్పేసుకుంటాడు.. గదిలోకి వెళ్లిన రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు.. అయితే ప్రభావతి కూడా మనోజ్ కి డబ్బులు ఇవ్వాలని అంటుంది.. నువ్వు ఎంత చెప్పినా కూడా ఇక మారవు.. నిన్ను కన్నందుకు నాకు కట్టుకున్నందుకు రోహిణికి ఎటువంటి ప్రయోజనం లేదు అని ప్రభావతి అంటుంది. నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చే ప్రయత్నం చెయ్యి అనేసి మనోజ్ కి ప్రభావతి చెప్తుంది.. ఆ మాట వినగానే మనోజ్ నేను డబ్బులు తినేస్తాను సరే మరి నువ్వేం చేసావు అని అంటాడు. నేను డబ్బులు సంపాదించాలని అనుకున్నావు. నా డబ్బులతో నువ్వు బ్రతకాలని అనుకున్నావ్ అని అనగానే రోహిణి గేమ్ మాట్లాడుతున్నావ్ మనోజ్ అని షాక్ అవుతుంది. సుశీల దోస ప్లాన్ వర్కౌట్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ షాప్ కి వెళ్లి నా పరిస్థితి ఏంటి దేవుడా బిజినెస్ మాన్ అవ్వాలని ఎంతో అనుకున్నాను కానీ ఇలా మార్చేసావ్ ఏంటి అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడే ఓ వ్యక్తి వచ్చి ఒక లెటర్ ఇస్తాడు.. మీ చుట్టూ ఉన్నవాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. అది చూసి ఈ షాక్ లో ఉంటాడు మనోజ్… రోహిణి రాగానే ఆ విషయాన్ని చెప్తాడు.. ఆ లెటర్ ని చూసినా రోహిణి ఎవరో ఫ్రాంక్ చేసి ఉంటారులే అని అంటుంది.. కానీ మనోజ్ మాత్రం ప్రాంక్ అయితే కచ్చితంగా కెమెరాలు ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేవు అని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు.

Advertisement

ఎవరూ కావాలని ఇది చేస్తూ ఉంటారులే నువ్వు అవేమీ పట్టించుకోవద్దు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వు అని రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది. అయితే విజ్జి మాత్రం మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఆ దినేష్ గాడు అయి ఉంటాడు అని అంటుంది. వాడు జైల్లో ఉన్నాడు కదా వాడు ఎందుకు ఇలా చేస్తాడు అని రోహిణి అంటుంది. అయితే కెనడాలో ఉన్న కల్పనా ఏమైనా ఇలా చేస్తుందేమో అని రోహిణి తో విజ్జి అంటుంది.. ఏదేమైనా కూడా మనోజ్ మాత్రం చిన్న విషయాన్ని కూడా ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అని రోహిణి అంటుంది.

ఇక బాలు మీనాకు ఫోన్ చేసి నా రెండో పెళ్ళాన్ని తీసుకొని వచ్చాను నువ్వు ఒకసారి బయటికి రా ఎండిపోతుంది హారతి ఇవ్వాలి అని అంటాడు.. వీరిద్దరి కన్వర్జేషన్ కాస్త కామెడీగా ఉండడంతో ఎపిసోడ్కి హైలైట్ గా ఉంటుంది.. ఇక మీనా ఈ విషయాన్ని అందరితో చెప్తుంది. ఏంటి వాడు మీకు అన్యాయం చేసి రెండో దాన్ని తెచ్చుకున్నాడా అని అంటుంది. లేదు అమ్మమ్మ రెండో కారుని తీసుకొచ్చాడు.. మీ అందరిని బయటికి రమ్మంటున్నాడు వెళ్దాం పదండి అని అంటుంది. రెండో కారణం కొన్నాడా ఇలా రోజురోజుకీ వాడు ఎదిగిపోతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని సుశీల అంటుంది..

Advertisement

అయితే వాడేమీ హెలికాప్టర్ ఏమి కొనలేదు కదా ఎందుకంత ఇది చేస్తున్నారు అని ప్రభావతి అనగానే అందరూ ప్రభావతి పై సీరియస్గా ఒక లుక్ ఇస్తారు.. బయట ఉన్న కారుకి మీనా హారతి ఇచ్చి గుడికి వెళ్దామని అంటుంది. అయితే సుశీల చెప్పిన ప్లాన్ ప్రకారం సత్యం ప్రభావతిని మాత్రమే బాలు గుడికి తీసుకుని వెళ్తాడు.. వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పోగొట్టాలని బాలుతో అంటుంది సుశీల.. ఆ మాట వినగానే బాలు ఇంకాస్త రెచ్చిపోతూ రోడ్డుపై అటు ఇటు కుదుపులు లేకపోయినా సరే కారుని తిప్పుతూ నడుపుతాడు. లోపల సత్యం ప్రభావతి ఎంతగా నెమ్మదిగా పొమ్మని అడుగుతున్న సరే బాలు మాత్రం రోడ్ అలా ఉంది అని వాళ్ళిద్దరిని మొత్తానికి కలిపేస్తాడు.

Also Read :‘జగదాత్రి ‘ కౌశిక రియల్ లైఫ్..పేరెంట్స్ కు అబద్దం చెప్పి ఆ పని..

ఇక తర్వాత శృతి రవి సిగ్గుబిళ్ళ ఫోటో ని చూసి ఆడుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన బాలు మీనా ఏంట్రా శృతిని ఏడిపిస్తున్నావా అని అడుగుతారు.. నేను ఏడిపించడం కాదు అదే నన్ను ఏడిపిస్తుంది అని రవి అంటాడు.. దాని గురించి తెలుసుకున్న మీనా ఆ ఫోటోని ఇప్పుడు చూపించకుండా ఉండడమే మంచిది అని అంటుంది. ఇక ప్రభావతి సత్యం ఇద్దరు కలిసి ఇంటికి రావడంతో అందరూ షాక్ అవుతారు. వీరిద్దరూ మొత్తానికి కలిసిపోవడం చాలా సంతోషంగా ఉంది అని అంటారు. మొత్తానికి ఒక్కటైన ఈ జంటతో ఇంట్లోని వాళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×