E-Paper
Advertisement

Electric Gloves: చలికాలం కోసం ఎలెక్ట్రిక్ గ్లోవ్స్.. బటన్ ఆన్ చేయగానే చేతులకు వెచ్చదనం.. బైకర్స్ స్పెషల్

Electric Gloves: చలికాలం కోసం ఎలెక్ట్రిక్ గ్లోవ్స్.. బటన్ ఆన్ చేయగానే చేతులకు వెచ్చదనం.. బైకర్స్ స్పెషల్
Advertisement

Electric Gloves Winter| చలికాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి తగ్గుతున్నాయి. చాలా మంది రోజూ ఆఫీస్, పర్సనల్ పనుల కోసం బైక్ లనే ఉపయోగిస్తారు. రైడ్ చేసేటప్పుడు చల్లని గాలి నేరుగా చేతులకి తగులుతుండడంతో బైక్ రైడింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు రైడ్ చేస్తే చేతులు పూర్తిగా చల్లబడి నొప్పిగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసమే ఇప్పుడు ఎలెక్ట్రిక్ గ్లవ్స్ అందుబాటులో ఉన్నాయి.

చల్లబడిన చేతులు ప్రమాదకరం

చలి వల్ల చేతివేళ్లు గట్టిపడతాయి, కొన్నిసార్లు పూర్తిగా స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే చేతులు మత్తు పడతాయి. బ్రేక్స్, క్లచ్ సరిగ్గా పట్టుకోలేరు. ఈ కారణంగా రోడ్డు మీద యాక్సిడెంట్ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయాన్నేలేదా రాత్రి ఆలస్యంగా బైక్ పై ఎక్కువసేపు ప్రయాణం చేస్తే చేతులకు తగిలే చలి వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ.

ఎలక్ట్రిక్ గ్లవ్స్ ఏం చేస్తాయి?

Advertisement

ఎలక్ట్రిక్ గ్లవ్స్ చలికాలంలో బైక్ రైడర్లకి అద్భుతమైన సొల్యూషన్. వీటి లోపల హీటింగ్ టెక్నాలజీ ఉంటుంది. చేతులు ఎప్పుడూ వెచ్చగా ఉంటాయి. బైకర్లు, డెలివరీ వాళ్లు, అవుట్‌డోర్ కమ్యూటర్లకి ఈ గ్లోవ్స్ పర్ఫెక్ట్. ఇప్పటివరకు చాలా మంది చలికాలంలో మందమైన వింటర్ గ్లవ్స్ ఉపయోగిస్తుంటారు. కానీ అవి బరువు ఉంటాయి. కానీ ఎలక్ట్రిక్ గ్లవ్స్ అంత మందంగా ఉండవు. పైగా తక్కువ బరువుతో లైట్ గా ఉంటాయి.

బటన్ ఆన్ చేయగానే వేడెక్కిపోయే గ్లవ్స్

బటన్ ఆన్ చేసిన 30 సెకన్లలోనే చేతులు వేడెక్కుతాయి. హీటింగ్ వైర్స్ వేళ్ల నుంచి మణికట్టు వరకు ఉంటాయి. హీట్ గ్లవ్స్ అంతా సమానంగా ప్రసరిస్తుంది. ఈ కారణంగా చేతులకు వెంటనే కంఫర్ట్ అనుభవం వస్తుంది.

ఎలక్ట్రిక్ గ్లవ్స్ సేఫ్‌గా ఉన్నాయా?

Advertisement

గ్లవ్స్‌లో ఇన్సులేటెడ్ హీటింగ్ వైర్స్ ఉంటాయి. అందుకే కరెంట్ షాక్ జరిగే ప్రమాదం లేదు. హీట్ ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది. చర్మానికి సేఫ్. ఎక్కువ దూరం రైడ్ చేసినా నమ్మకంగా ఉపయోగించవచ్చు.

టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేయాలి?

గ్లవ్స్‌లో మూడు టెంపరేచర్ మోడ్స్ ఉన్నాయి. బ్లూ లైట్ అంటే లో హీట్, గ్రీన్ లైట్ అంటే మీడియం హీట్, రెడ్ లైట్ అంటే హై హీట్ (ఎక్కువ చలి ఉన్నప్పుడు).

గ్లవ్స్ ఎలా ఛార్జ్ చేయాలి?

గ్లవ్స్‌లో USB పోర్ట్ ఉంటుంది. పవర్ బ్యాంక్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని బైక్స్, స్కూటర్లలో USB పోర్ట్ ఉంటుంది. అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు.

గ్లవ్స్ డిజైన్ ఎలా ఉంది?

గ్లవ్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. చేతులు సులువుగా కదులుతాయి. హ్యాండిల్ బార్, బ్రేక్స్, క్లచ్ సులువుగా పట్టుకోవచ్చు. రోజువారీ కమ్యూటింగ్, లాంగ్ రైడ్స్‌కి సరిపోతాయి.

Also Read: ఇంటర్నెట్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? దీనికి కారణం అదే..

ఎక్కడ కొనొచ్చు, ధర ఎంత?

అమెజాన్ ఇండియాలో దొరుకుతాయి. MAKINGTEC Heated Gloves అని టైప్ చేసి చెక్ చేయండి. ధర కేవలం రూ.7,996. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండవచ్చు. ఇతర బ్రాండ్స్ కూడా ఉన్నాయి – రివ్యూలు, వారంటీ చెక్ చేసి కొనండి.

చలికాలంలో బైక్ రైడ్ చేసేవాళ్లకి ఎలక్ట్రిక్ గ్లవ్స్ బెస్ట్ సొల్యూషన్. చేతులు వెచ్చగా ఉంటాయి, సేఫ్టీ పెరుగుతుంది. ఇప్పుడే కొనండి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×