E-Paper
Advertisement

Vivekananda Case: బాబాయ్ కేసు.. అబ్బాయి బయటపడినట్టేనా? హైకోర్టుకి వెళ్లే ఆలోచనలో సునీత?

Vivekananda Case: బాబాయ్ కేసు.. అబ్బాయి బయటపడినట్టేనా? హైకోర్టుకి వెళ్లే ఆలోచనలో సునీత?
Advertisement

Vivekananda Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగిందా? ఈ కేసులో జగన్ ఫ్యామిలీ సేఫేనా? సీబీఐ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు సునీతారెడ్డి ప్లాన్ చేస్తున్నారా? హైకోర్టుకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారా? అదే జరిగితే జగన్ ఫ్యామిలీకి ఇబ్బందులు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వివేకానంద కేసులో మళ్లీ సీబీఐ దర్యాప్తు

Advertisement

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు సీబీఐ ప్రత్యేక‌కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు సునీల్‌యాదవ్‌ బ్రదర్ కిరణ్‌- అర్జున్‌రెడ్డి మధ్య ఫోన్ సందేశాలు, వారి పాత్రపై దర్యాప్తు చేసి నెలరోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది.

డిసెంబర్ 10న ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ కేసులో అసలు నిందితులు తప్పించుకున్నట్టేనని కొందరు బలంగా వాదిస్తున్నారు. ఆ మాత్రం దానికి మళ్లీ సీబీఐ విచారణ దేనికన్నది మరికొందరి ప్రశ్న.

Advertisement

హైకోర్టుకి వెళ్లే ఆలోచనలో బాధితురాలు సునీత?

న్యాయం కోసం బాధితులు కోర్టు గడప ఎక్కుతారని, వారి కోరిక మేరకు దర్యాప్తు చేయాలి కానీ, ఫలానా విషయంలో మాత్రమే దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఏంటన్నది వివేకానంద అనుచరుల మాట. ఒకవిధంగా చెప్పాలంటే జగన్ ఫ్యామిలీ సభ్యులంతా బయటపడినట్టే ఉందని అంటున్నారు.

దర్యాప్తు చేయాలా.. వద్దా? అనేది కోర్టు నిర్దేశించాలి. ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలి అనేది దర్యాప్తు సంస్థకు నిర్దేశించకూడదని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కింది కోర్టు ఆదేశాలపై బాధితురాలు సునీతరెడ్డి షాకయ్యారు. ఆమె న్యాయ నిపుణులతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పుని హైకోర్టులో అప్పీల్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ALSO READ: వేదికపై రోడ్డు కోసం గిరిజన యువకుడు విన్నపం.. డిప్యూటీ సీఎం ఆదేశాలు

వివేకానంద మృతి తర్వాత జగన్‌ ఫోన్‌ కాల్‌ అందుకోవడంపై తదుపరి దర్యాప్తు అవసరం లేదని తేల్చేసింది ప్రత్యేక కోర్టు. ఫ్యామిలీ సభ్యుడు మృతి చెందినప్పుడు దగ్గరి బంధువులకు తెలియపరచడం సహజమని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

మాజీ ఐఏఎస్‌ అజేయ కల్లాం 2023 ఏప్రిల్‌ 29న ఓ వాంగ్మూలం ఇచ్చారు. తాను జగన్‌తో 2019 మార్చి 15న సమావేశంలో ఉన్నప్పుడు భారతి నుంచి సమాచారం వచ్చినట్టు చెప్పారని న్యాయమూర్తి గుర్తు చేశారు. జగన్‌కు ఫోన్‌కాల్‌ వచ్చిన వ్యవహారంపై తదుపరి దర్యాప్తు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడినట్టు తీర్పులో ప్రస్తావించారు.

వివేకానంద చనిపోయిన తర్వాత అంటే 2019 మార్చి 15న తెల్లవారుజామున 1.42 గంటలకు కిరణ్‌యాదవ్‌ నుంచి అర్జున్‌రెడ్డికి మెసేజ్‌ వచ్చినట్లు సీబీఐ తేల్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సంభాషణల వ్యవహారాన్ని తేల్చాలని తీర్పులో ప్రస్తావించారు న్యాయమూర్తి. ఈ క్రమంలో సునీతారెడ్డి హైకోర్టు వెళ్లి మళ్లీ సీబీఐ చేత దర్యాప్తు చేయిస్తే ఈ కేసు కొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు.

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×