BigTV English

Gundeninda Gudigantalu Today Episode : బాలును చంపాలని సంజూ ప్లాన్.. మీనా బాలును కాపాడుకుందా..?

Gundeninda Gudigantalu Today Episode : బాలును చంపాలని సంజూ ప్లాన్.. మీనా బాలును కాపాడుకుందా..?

Gundeninda GudiGantalu Today episode December 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను చూసి ఇంట్లో అందరు భయపడతారు. ఏదైనా అడగాలని అన్నా కూడా కొడుతుందేమో అని టెన్షన్ పడతారు. ఇక బాలు భార్య చేసిన దానికి ఫుల్ ఖుషి అవుతుంటాడు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. తన ఫ్రెండ్స్ మీనా చేసిన సాహసానికి నువ్వు ఎలాగైనా పార్టీ ఇవ్వాలని అడుగుతారు. ఇక బాలు మీ నాన్న చూసి మురిసిపోతూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. బాలు మాత్రం అస్సలు నమ్మడు.. నువ్వు నిజంగా ఆ రాయితో కొట్టావా? నాకు ఇంకా డౌట్ గానే ఉంది అనేసి బాలు అంటాడు. మీరు మీ ఎదవలు అనుమానాలు అంటుంది. నన్ను తక్కువ చేసి చూస్తున్నారు నా గురించి మీకు తెలియదనుకుంటాను అని అనగానే ఆపమ్మ నీ గురించి బాగా తెలిసింది చూశాంగా ఎలా కొట్టావో అనేసి అంటాడు. ఇక దానికి మురిసిపోతుంది మీనా.. ఇక టీవీ లో కూడా చూస్తారు. ఇంట్లో అందరూ పొగుడుతూ ఉంటారు. ఇక సత్యంతో ప్రభావతి అప్పుడు నేను కూడా సెలబ్రేటి అయిపోతాను కదా అనేసి అంటుంది. మీనా సెలిబ్రిటీగా మారిన సందర్భంగా తన స్నేహితులుకు పార్టీ ఇవ్వాలని బాలు అనుకుంటాడు. పార్టీకి వెళుతున్నానని తెలిస్తే తండ్రి బాధపడతాడని అనుకుంటాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియకుండా నువ్వే మ్యానేజ్ చేయాలని మీనాను బతిమిలాడుతాడు బాలు. సరేనని మీనా అంటుంది.. మీనాకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు.. ఇక మీనా మురిసిపోతూ ఉంటుంది. ఇక బార్లో రాజేష్ మీనా గురించి పొగడ్తలతో ముంఛేత్తుతాడు.. ఇక పక్కనే సంజయ్ తన ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుంటాడు. మీనాను పొగుడుతుంటే వాళ్ళు రగిలిపోతాడు. రాజేష్ కాలు తగిలి కింద పడిపోవాలని సంజయ్ కాలు అడ్డుగా పెడతాడు. దాంతో గొడవకు దిగుతాడు సంజయ్. తన ఫ్రెండుని కొడతావని బాలు సంజయ్ ని చిత్కగొట్టేస్తాడు. బాలు తన స్నేహితులకు బార్‌లో పార్టీ ఇస్తుంటాడు. అదే బార్‌లో సంజు కూడా మందు తాగుతుంటాడు. శృతిపై ఎటాక్ చేసిన వాళ్లను నరికేయాలని బాలు స్నేహితుడు రాజేష్ అంటాడు. అతడి మాటల్ని సంజు వింటాడు. కోపం పట్టలేకపోతాడు. రాజేష్ వెళ్లబోతుంటే కావాలనే తన కాలును అతడికి అడ్డుగా పెడతాడు.. సంజుతో పాటు అతడి గ్యాంగ్‌ను చితక్కొడతాడు. సంజు షర్ట్ మొత్తం చించేసి అతడిని అవమానిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజూ తో బార్ లో రాజేష్ తప్పుగా బిహేవ్ చేస్తాడు. కావాలనే గొడవ పెట్టుకుంటాడు. బాలు చూసి నా ఫ్రెండ్ ను కొడతావా అని కొడతాడు. బార్ లో పెద్ద రచ్చ చేస్తారు. సంజూ ను వదలకుండా కొడతాడు.. నేనెవ్వరో తెలుసా అని అంటాడు. కానీ బాలు మాత్రం నువ్వెవరైనా నాకేంటి అంటారు. ఇంకా నాలుగు పీకుతాడు. ఇక బార్ నుంచి బాలు ఇంటికొస్తాడు. ఇంట్లో ఎవరు లేరని చూసి మీనా దగ్గరికి వస్తాడు. కొట్టిన రాయికి పూజలు చేస్తూ పెద్ద హంగామా చేస్తాడు. అంత ధైర్యం ఉంది కదా మరి పోలీస్ స్టేషన్లో నన్నెందుకు కొట్టలేదు నిన్ను అలా కొట్టాను కదా అనేసి అడిగితే మీనా ఉండి మీరు నా భర్త అండి నేను ఎవరికీ గౌరవం ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను అనేసి అంటుంది. ఇక మొన్నటివరకు నన్ను రౌడీ అనే వాళ్ళు.. నిన్నేమో రౌడి గారి పెళ్ళాం అనేవాళ్ళు. ఇప్పుడేమో రౌడీ మీనా గారి మొగుడు అనేసి అంటున్నారని బాలు చెప్తూ పొగడ్తలతో ముంచేస్తాడు. ఇక మీద బాలు కలిసి ఒకే బెడ్ మీద పడుకుంటారు.

ఉదయం లేవగానే ప్రభావతి టీ తాగుతూ బయట కూర్చుని ఉంటుంది. కామాక్షి రెడీ అయ్యి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ఇంత పొద్దున్నే ఇంత డెకరేషన్ చేసుకొని ఎక్కడికో వెళ్తున్నావ్ అనేసి అడుగుతుంది. దగ్గరికి వచ్చాను వదిన అనేసి కామాక్షి అంటుంది. మీనా వీడియో చూసి తాను భయపడ్డానని, తనతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. లేకపోతే చంద్రముఖి సినిమాలో జ్యోతిక మంచం లేవట్టినట్టు నిన్ను కూడా ఎత్తి పారేస్తుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇదే మంచి సమయం అని రవిని శృతిని ఇంటికి తీసుకురావాలని చెబుతోంది. వారిని రక్షణ లేదని ఒప్పించడానికి ఇది కరెక్ట్ సమయమని సలహా ఇస్తుంది కామాక్షి.. ప్రభావతి, మీనాక్షిలు కలిసి రవి ఇంటికి వెళ్లారు. రవి తన అమ్మను చూడగానే ఎంతో సంతోషిస్తాడు. తన కోడలికి ఏమైందని ఆరా తీస్తుంది. ఇంతకీ తన కోడలు ఏది అని ప్రశ్నిస్తుంది? దీంతో రవి శృతిని పిలవడానికి వెళ్తాడు. రెస్టు తీసుకుంటున్న శృతిని నిద్రలేపే సరికి రవిపై చిరాకు పడుతోంది. అనవసరంగా తనను డిస్టర్బ్ చెయ్యొద్దంటూ అరుస్తుంది. తన మమ్మీ వచ్చిందని చెబుతాడు. దాంతో శృతి కిందకు వస్తుంది.


శృతి రాగానే షాకిస్తుంది. శృతి ప్రవర్తనను చూసి ప్రభావతి షాక్ అవుతుంది. శృతి రాగానే తన కాళ్లకు నమస్కరిస్తుందని ప్రభావతి భావిస్తుంది. కానీ, ఊహించని విధంగా వచ్చి కాలు మీద కాలు వేసుకుని సోఫాలో దర్చాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుంది. ఇంతలోనే మీనాక్షి.. శృతి వర్క్ టైమ్స్ గురించి అడుగుతుంది. తాను డైలీ రాత్రి 11 గంటల సమయం కు డబ్బింగ్ కు వెళ్లి మూడు గంటల ప్రాంతంలో వస్తానని చెబుతుంది. అర్ధ రాత్రి వరకు అంటే కష్టం కదా.. మన ఇంటికి వెళదామని అంటుంది. ప్రభావతి.. అక్కడైతే ఒకరికి మరొకరు తోడు ఉంటారు కదా అంటుంది. శృతి ఇలా సమాధానం చెప్పాలో తెలియక ఇంట్లో బాలు ఉంటాడని, అతడు ఇంట్లో ఉండగా.. తాము ఆ ఇంట్లో అడుగుపెట్టలేమని చెబుతోంది. దీంతో ప్రభావతి వాడి గురించి పట్టించుకోకమ్మ.. అన్ని నేను చూసుకుంటా.. అని చెప్తుంది. దీంతో శృతి కన్విన్స్ అయి ఇంటికి వస్తానంటూ మాట ఇస్తుంది. కానీ, ఇంతలోనే శృతి అమ్మ శోభ వారింటికి చేరుకుంటుంది.. శృతి వాళ్ళ శోభ ఇంటికి వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×