Winter Weather Report: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తుంది.. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీలు వణిపోతున్నాయి. చలితో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులున్నాయంటున్నారు నిపుణులు. సాయంత్రం 5 అయ్యిందంటే చాలు చల్లగాలులు వీస్తున్నాయి. ఇది మరుసటి ఉదయం 10 గంటల వరకూ తగ్గడం లేదు.
ఇంత స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడానికి గల కారణలేంటి.. ఎందుకు ఇంతలా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అనే దానిపై కూడా వాతావరణశాఖ పలు విషయాలు వెల్లడించింది. ఉత్తరాధి నుంచి వీస్తున్న గాలులు.. ముఖ్యంగా హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి గాలుల కారణంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయంటుంది. ఆ గాలుల వల్ల తెలంగాణలో టెంపరేచర్లు రికార్డు స్థాయిలో పడిపోనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలను ఏ మాత్రం తగ్గకుండా తెలంగాణలో టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో నమోదు అయిన్నట్లు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క జిల్లా.. ఒక్క ప్రాంతమనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను వణికిస్తోంది.
ఆదిలాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ జిల్లాల్లో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్‌లోని అర్లి టీలో 5.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఉత్తరాది రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోని జిల్లాల్లోనూ సాయంత్రం 5 దాటగానే మొదలవుతున్న చలిగాలులు.. తెల్లారి మిట్టమధ్యాహ్నం దాటినా తగ్గుముఖం పట్టడం లేదు.
తెలంగాణలో 2014 తర్వాత మళ్లీ అదే రేంజ్‌లో రాత్రి టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. చలితో జనాలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో 27 జిల్లాలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అవుతున్నాయి. మరో మూడు జిల్లాలో 11 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మొత్తం జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే.. ప్రస్తుతం సాయంత్రం సమయంలో టెంపరేచర్లు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య పతనమవుతున్నాయి.
Also Read: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన..!
ఉత్తరాది, హిమాలయాల నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఆ పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలతోపాటు దక్షిణాది జిల్లాలపైనా చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరో 3,4 రోజులపాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో ఆదివారం రాత్రి అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలుగా నమోదైంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
నేడు, రేపు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ- వాయువ్య దిశగా మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతుంది.దీని ప్రభావంతో రాగల 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీగా, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశముంది. ఇవాళ, రేపు తిరుపతి, నెల్లూరు,అన్నమయ్య,చిత్తూరు జిల్లాలలోనూ వానలు పడే అవకాశం ఉంది.రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు కూడా భారీ వర్ష సూచన ఉంది.
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం…పశ్చిమ- వాయువ్య దిశగా మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతుంది.దీని ప్రభావంతో రాగల 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీగా, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశముంది. ఇవాళ, రేపు తిరుపతి, నెల్లూరు,అన్నమయ్య,చిత్తూరు జిల్లాలలోనూ వానలు పడే అవకాశం ఉంది.రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు కూడా భారీ వర్ష సూచన ఉంది. నెల్లూరు,తిరుపతి, చిత్తూరు,విశాఖ శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయి.19న అల్పపీడనం ప్రభావం పెరుగుతుంది.