BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన రమేష్.. నీలకంఠం ఉచ్చులో పడ్డ ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన రమేష్.. నీలకంఠం ఉచ్చులో పడ్డ ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode December 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి చూపులకు వచ్చిన సంజయ్ మౌనికకు మాయమాటలు చెప్తాడు. రెండు తప్పులు చేశానంటూ చెప్పుకొస్తాడు అందులో ఒకటి గతంలో ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, కానీ అమ్మాయి తనని మోసం చేసి వెళ్లిపోయిందని, ఆ సమయంలో నువ్వు కనిపించావని చూసిన మరుక్షణంలోనే నిన్ను ప్రేమించాను అని చెబుతాడు. మరొకటి బార్ లో మీ అన్నయ్య బాలుకి తనకి గొడవ జరిగిందని, ఆ గొడవ తర్వాత మీ అన్నయ్యకు స్వారీ చెప్పాలని ప్రయత్నించాలని కథలు చెప్తాడు. దీంతో మౌనిక సంజయ్ బుట్టలో పడిపోతుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే అందరు టెన్షన్ పడతారు. ఇక మౌనిక, సంజయ్ కిందకు వస్తారు. అబ్బాయి నచ్చాడా? అని మౌనికను తన తల్లిదండ్రులు అడగగా.. తనకు నచ్చాడని సమాధానం ఇస్తుంది. దీంతో వెంటనే తాంబూలాలు మార్చేసుకుని ముహూర్తం పెట్టేద్దామని నీలకంఠం అంటాడు. బాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు సత్యం. కానీ, ప్రభావతి అవసరం లేదని, నిక్కచ్చిగా చెబుతుంది. మరోవైపు పంతులు కూడా వర్జ్యం వస్తుంది. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటారు. ఇక సత్యం మాత్రం బాలు రాలేదని ఎదురుచూస్తుంటారు. సరిగ్గా తాంబులాలు మార్చుకొనే సమయంలో బాలు ఇంటికి వస్తాడు. రంగా నీలకంఠాన్ని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత సంజీవ్ ని పరిచయం చేయగానే.. వీడా.. మా అమ్మ తెచ్చిన సంబంధం అనగానే.. నాకు అనుమానం వచ్చింది. ఈ దరిద్రపు సంబంధం తనకు ఇష్టం లేదంటూ బాలు తెగేసి చెబుతాడు. నా చెల్లెను నీకు ఇవ్వనని తేల్చి చెప్తాడు.. నీలకంఠమ్ ఫ్యామిలీ మాయమాటలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మన చెడిపోయినందుకు ప్రభావతి కోపంతో రగిలిపోతుంది. బాలుపై చేసుకొని దారుణంగా తిడుతుంది. ఇక బాలు మాత్రం గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు మీనా వచ్చి మీరు ఎందుకండీ అలా బాధపడుతున్నారు అనేసి అడుగుతుంది.. వాడు నిజంగానే మనిషి కాదు తాగినప్పుడే అలా కొట్టాడంటే ఇంక మనుషుల్ని ఏ రేంజ్ లో కొడతాడు ఆలోచించాలి కదా మీనా అనేసి అడుగుతాడు అంతలోకేం మౌనిక వస్తుంది. నేను నీతో గొడవ పడిన విషయం గురించి నాకు చెప్పాడు అన్నయ్య అనేసి మౌనిక అంటుంది ఇక సత్యం కూడా మౌనికను బాధ పెడుతున్నావా రా అనేసి అడుగుతాడు. ఇక మౌనిక ఇష్టం ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పగానే బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజేష్ దగ్గరికి రాగానే పెళ్లిచూపులు అన్నావు కదరా అప్పుడే అయిపోయిందా అనగానే వాడికి ఎదవరా మొన్న బార్ల కొట్టాడు కదా వాడే అని వచ్చాడు. వాడి గురించి నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. అతని దగ్గర పని చేసిన రమేష్ ఉన్నాడని విని అతన్ని అడుగుతాడు. అనిల్ కంఠం గురించి ఆ డ్రైవర్ వాడు ఒక దుర్మార్గుడని వాడి కొడుకు అంతకన్నా పెద్ద దుర్మార్గుడు అని చెప్తాడు.. ఇప్పుడు చెప్పిన ఇదే మాట రేపు మా ఇంటికి వచ్చి చెప్తావా అని అనగానే అతను సరే అంటాడు.

ఇక బాలు ఆ విషయాన్ని ఇంట్లో చెప్తాడు రేపు అతని దుర్మార్గాన్ని బయటపెట్టే ఒకడు వస్తాడని వాడే అదంతా చెప్తాడని అందరితో ప్రగల్బాలు పలుకుతాడు. బాలు చెప్పింది నిజమే అనుకొని అందరూ అనుకుంటారు. కానీ మీన మాత్రం ఎందుకండి మీకు ఇంత మొండి పట్టుదల మీరు తప్పు చేశారని మీ అన్న వదినలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంత పంతం మీకు అసలు ఏం జరిగిందో ఇవన్నీ మీకు ఎందుకండి అసలు అనేసి మీనా అంటుంది ఇదంతా నువ్వు ఊరుకో మీనా నీకు తెలియదు. వాడు ఎంత దుర్మార్గుడు వాడంత నీచుడో రేపు ఒక వ్యక్తి వచ్చి చెప్తాడని బాలు చెప్తాడు. పాలు చెప్పింది నిజమే అని ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అని మీనా ఆరా తీస్తుంది. అన్ని విషయాలు రేపు చెప్తానని, ఆ వ్యక్తి నోట నీలకంఠం ఫ్యామిలీ గురించి వినమని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం బాలు చెప్పిన మనిషి వస్తాడు. కానీ, బాలు అనుకున్న విధంగా కాకుండా ఆ వ్యక్తి ప్లేట్ పిరాయిస్తాడు. వారు చాలా మంచి వారని తన పిల్లలను వారే చదివిస్తున్నారని, ఇక సంజీవ్ ఇంకా మంచివాడు అంటూ గొప్పలు చెప్తాడు. తాను చెప్పిన విషయం కాదు కావాలంటే మరో నలుగురిని అడిగి తెలుసుకోమని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు.. అతను చెప్పిన మాటలకి బాలు షాక్ అవుతాడు.. ఇంట్లో వాళ్ళందరూ ముందర ఫూల్ అవుతాడు ఇక ప్రభావతి తెచ్చిన సంబంధం చాలా గొప్పదని ప్రభావతి రెచ్చిపోతుంది..


ఇక నేను ఆరు నూరైనా అదే సంబంధాన్ని మౌనికకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తుంది. దానికి సత్యం మాత్రం పెళ్లి చేయాలంటే అమ్మాయి అబ్బాయికి నచ్చితే సరిపోదు కుటుంబం కూడా నచ్చాలి. రవి చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయాలని నేను అనుకోవట్లేదు అనేసి అడుగుతాడు. ప్రభావతి ముందుగా చేతులెత్తుతుంది అలాగే మనోజ్ రోహిణి కూడా ఈ సంబంధం ఇష్టమేనని సత్యంతో అంటారు. ఇక మీనా మౌనిక ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది మౌనికకిష్టమైతే మాకు ఇష్టమే మామయ్య అనేసి చెప్తుంది. మౌనిక అతను బాలు అన్నయ్యని కొట్టిన విషయం నాకు ముందే చెప్పాడు నాన్న అనేసి అంటుంది. మౌనికకిష్టమని ప్రభావతి సంతోషపడుతుంది.

ఇక బాలు కోపంగా బారుకెళ్తాడు. ఆ రమేష్ గాడు నిన్న చేసి నిన్న చెప్పిన మాట ఈరోజు చెప్పలేదు అసలు ఎందుకు మోసం చేశాడు అర్థం కావట్లేదు రమేష్ గాడు ఇక్కడ కనక కనిపిస్తే ఇక వాడికి చుక్కలు చూపిస్తానని బాలు తన ఫ్రెండ్స్ తో అంటాడు. రమేష్ వచ్చిందని రాజేష్ చెప్తాడు. వాన్ని చూసి కోపంతో రగిలిపోయిన బాలు వాడి దగ్గరికి వెళ్లి వాడిని కాలర్ పట్టుకుని అడగగా.. తాను మీ ఇంట్లో చెప్పిన విషయం అబద్ధమని, వాస్తవానికి పెళ్లి సంబంధం వారితో సెట్ చేసుకున్న విషయం తనకు తెలియదని, ఒకవేళ తన వాళ్ళని ఈ సంబంధం క్యాన్సల్ అయితే.. తనను చంపి తన ఫ్యామిలీని ఆగం చేస్తారని, భయంతో తాను నిజం చెప్పలేకపోయానని అసలు విషయం చెబుతాడు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో మీ చెల్లెలు సంజీవ్ కు ఇచ్చి మాత్రం చేయొద్దు. వాడు పెద్ద సైకో అని చెబుతాడు. దీంతో బాలు డైలమా లో పడతాడు.. రమేష్ మాటలున్న బాలు ఫుల్లుగా తాగేసి ఇంటికి వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో నీలకంఠ మీ ఇంటికి వెళ్లిన బాలుకి సత్యం ప్రభావతి అక్కడికి వచ్చి షాక్ ఇస్తారు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×