BigTV English

Sandeep Reddy Vanga: యానిమల్ తో విధ్వంసం సృష్టించిన సందీప్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

Sandeep Reddy Vanga: యానిమల్ తో విధ్వంసం సృష్టించిన సందీప్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

Sandeep Reddy Vanga:ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన.. అదే సినిమాను బాలీవుడ్ లో కూడా ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కించి, మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత ‘యానిమల్’ సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయారు. ఈ సినిమా సౌత్ ఆడియన్స్ నే కాదు నార్త్ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సందీప్ రెడ్డి వంగ పేరు భారీగా మారుమ్రోగిపోయింది. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు ఎంత అనే విషయం వైరల్ గా మారింది.


ఎన్నో ఊహించని అవమానాలు..

సందీప్ రెడ్డి వంగ సైకోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఇకపోతే మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’తో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఆ తర్వాత ‘యానిమల్’ సినిమాతో సక్సెస్ అందుకున్నా.. కానీ ఈ సినిమాలో ఆడవాళ్లను కించపరిచేలా చూపించాడని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇక అందుకే తాను కూడా ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. తన బయోడేటాను పట్టుకొని ఇండస్ట్రీలో చెప్పులు అరిగేలా తిరిగాడట. అసిస్టెంట్ డైరెక్టర్ కావడానికి ఎంతో ప్రాక్టీస్ చేశాడట. అసిస్టెంట్ డైరెక్టర్గా మారడం కోసం పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇంటికి, అలాగే నిర్మాతలు ఇంటి చుట్టూ తిరిగే వాడట. కానీ ఈయనను చూసిన చాలా మంది గేటు దగ్గర రెస్యూమ్ పెట్టి వెళ్ళు అంటూ ఎంతో అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు.


మొదటి సినిమా కోసం ఆస్తులు అమ్ముకున్న సందీప్..

అయితే పట్టుదలతో సినిమాకు డైరెక్టర్ అవ్వాలనుకున్న సందీప్ రెడ్డివంగా.. అద్భుతమైన సినిమాను రెడీ చేసుకున్నాడు. ఫైనాన్షియర్స్ కూడా సిద్ధమయ్యారు. ఇక సినిమా తీసే సమయానికి ఫైనాన్షియర్స్ వెనక్కి తగ్గడంతో.. దీంతో తన పూర్వీకుల నుంచి వచ్చిన 36 ఎకరాల పొలాన్ని కూడా అమ్మి మొదటి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ సినిమాను సొంత బ్యానర్ లోని నిర్మించారు. అంత తనపై నమ్మకంతోనే సొంత భూమిని కూడా సినిమా తీసి ఆ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో తాను తిరిగి తన 36 ఎకరాల పొలాన్ని కూడా కొనుగోలు చేశారు.

నేడు వందల కోట్లకు అధిపతి..

ఇక తర్వాత హిందీలో కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో రూ.1267 కోట్ల బిజినెస్ చేశారు. అందులో సందీప్ రెడ్డివంగా నిర్మాతగా దాదాపు రూ.450 కోట్లకు పైగా సంపాదించినట్లు ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. వీటితో పాటూ ఈయనకు పూర్వీకుల ఆస్తులు కూడా భారీగా వచ్చినట్లు తెలుస్తోంది. అలా సుమారుగా రూ.550 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకప్పుడు తన సినిమాల కోసం ఆస్తిని అమ్ముకున్న సందీప్ రెడ్డివంగా ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తూ వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×