E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు పై ప్రశంసలు.. మళ్లీ అడ్డంగా దొరికిపోయిన మనోజ్.. ప్రభావతికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనా, బాలు పై ప్రశంసలు.. మళ్లీ అడ్డంగా దొరికిపోయిన మనోజ్.. ప్రభావతికి షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా లక్ష రూపాయలు చెక్కుతో పాటుగా మరికొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ లను కూడా సొంతం చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి అక్కడకు వచ్చిన జంటలు వాళ్లతో కలిసి సెల్ఫీలు దిగుతారు. మొత్తానికి భార్యాభర్తల పోటీ ఎపిసోడ్కి ముగింపు పలికేశారు. అక్కడ ఇచ్చిన లక్ష రూపాయలు చెక్కుతో బాలు మీనా సంబరాలు చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతారు. మీరు గెలుస్తారని మేము అనుకున్నాం కచ్చితంగా మీరే గెలిచారు మాకు చాలా సంతోషంగా ఉంది అని శృతి అంటుంది. ఇక రవి కూడా మీరిద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ కనిపించే వాళ్ళు కానీ ఇప్పుడు మీ మధ్య ఉన్న బంధాన్ని అందరికీ తెలియజేశారు గ్రేట్ అని పశంసలు కురిపిస్తారు. కానీ అక్కడ జడ్జిలు మాత్రం మూడు జంటలని నిలబెట్టి వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ని చెప్తూ వాళ్లకి కొన్ని సలహాలు ఇస్తారు. ఆ తర్వాత ఈ పోటీలో గెలిచిన విన్నర్ ని అనౌన్స్ చేస్తారు.. వాళ్ళిద్దరు కూడా మీనా బాలు అన్యోన్యతను చూసి మురిసిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… పోటీ ముగిసింది ఇందులో పాల్గొన్న మూడు జంటల గురించి చెప్పాలి అని జడ్జీలు అంటారు.. అలాగే జడ్జిలు మూడు జంటలకి కొన్ని సలహాలు కూడా ఇస్తారు. ముందుగా రోహిణి మనోజ్ లను మీరు ఇంకా గొడవలు లేవు అనుకుంటున్నారు కాబట్టి మీ మధ్య ఏవో రహస్యాలు ఉంటున్నాయని అంటారు.. గొడవలు చికాకులు ఉంటేనే ఆ కాపురం సవ్యంగా సాగుతుంది అని జడ్జీలు అంటారు. ఆ తర్వాత రవి శృతి లు ఇంకా లవర్స్ లాగే ఉన్నట్లు అది ఫీలవుతున్నారు. వాళ్లు భార్యాభర్తలు అవ్వాలంటే ఇంకాస్త సమయం పడుతుంది అని వాళ్ళకి సలహా ఇస్తారు.. ఇక చివరిగా బాలు మీనాలపై ప్రశంసలు కురిపిస్తారు. వీళ్ళ లాంటి జంటని నేను ఎప్పుడు చూడలేదు నేను ఒక జడ్జిగా ఎన్నో జంటలకు విడాకులు ఇప్పించాను కానీ ఈ జంట లాంటి వారిని ఇదే మొదటిసారి చూడమని ఒక జడ్జ్ వాళ్లపై ప్రశంసలు కురిపిస్తారు.

Advertisement

ఇక విన్నర్ గా బాలుమినాలను అనౌన్స్ చేస్తారు.. వాళ్లకి లక్ష రూపాయల చెక్కుని ఇస్తే బాలు మాత్రం డబ్బులు ఇలా ఇస్తారా వీటిని ఏం చేసుకోవాలి అని అడుగుతారు. అయితే మీ అకౌంట్ నెంబర్ ఇచ్చారు కదా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఈ చెక్కు కేవలం ఫార్మాలిటీ కోసమని జడ్జిలు అంటారు. ఇక వాళ్ళు చాలా సంతోషంగా ఆ చెక్కును తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. కానీ బయట కార్ వచ్చి నిలబడిన సౌండ్ వినపడటంతో ప్రభావతి మనోజ్ రోహిణిలు విన్నర్ గా నిలిచారని హారతిపల్లం పట్టుకొని వస్తారు. కామాక్షి సత్యం కూడా ప్రభావతి వెనకాల వస్తారు. మనోజ్ రోహిణి లు చాలా డల్లుగా రావడంతో కామాక్షి ఇంకా అర్థం కాలేదు వదిన వీళ్ళు గెలిచినట్టు లేరు అని అంటుంది.

మరి ఎవరికి లక్ష రూపాయలు వెళ్ళింది రా ఆ లక్ష రూపాయలు ఎక్కడా అని ప్రభావతి పదేపదే అడుగుతుంది. కానీ మనోజ్ మాత్రం మౌనంగా ఉండడంతో దీనికి కూడా నువ్వు పనికిరావా అని ప్రభావతి అంటుంది. వాళ్లు పరువు తీసి ఇక్కడ నువ్వు పరువు తీస్తావా అమ్మ అని మనోజ్ అడుగుతాడు. ఆ తర్వాత రవి శృతి రావడంతో కచ్చితంగా విన్నర్ గా వీళ్ళే నిలిచి ఉంటారు అని ప్రభావతి అనుకుంటుంది.. మేం విన్నర్ గా నిలవలేదు మాకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదని అన్నారని శృతి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది. మీరిద్దరూ గెలవకుండా ఎవరు గెలిచారు అని ప్రభావతి అంటుంది.

Advertisement

అప్పుడే బాజాల సౌండ్ వినిపించడంతో పెళ్లిళ్లు సీజన్ కూడా కాదు కదా ఎవరు డప్పుల సౌండ్ తో వస్తున్నారు అని ప్రభావతి అంటుంది. అంతలోకే పార్వతి సుమతి అక్కడికొస్తారు. ఏంటి వీళ్లు ఎలాగో ఓడిపోయారని తెలుసుకోవడానికి వచ్చారా ఏంటి అని ప్రభావతి అంటుంది. సౌండ్ విని బయటికి వెళ్ళగానే బాలు మీనా చెక్కుతో డాన్సులు వేసుకుంటూ ఇంటికొస్తారు. బాలు మీనా ఆ లక్ష రూపాయలు గెలిచారని చెప్పగానే ప్రభావతి దిమ్మతిరిగిపోయే షాక్ అవుతుంది. అప్పుడే బాలు మేళ తాళాల మధ్య తనకు వచ్చిన లక్ష రూపాయలు చెక్కులు తీసుకొని లోపలికి వస్తాడు. రవి శృతి వాళ్ళ వెనకాలే వచ్చి వాళ్లతో కలిసి బయట డాన్స్ చేస్తారు. అది చూసిన ప్రభావతి ఏంటి ఈ లక్ష రూపాయలు కూడా నీకు రాలేదా? అని అంటుంది.

Also Read :‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. డిసెంబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్…

మీరిద్దరూ ఎంతో అన్యోన్యమైన జంట అందుకే మీకే ఈ ప్రైజ్ వచ్చిందని పార్వతి అనడంతో ప్రభావతి అవును. వీల్లే అని వెటకారంగా మాట్లాడుతుంది.. ఆ తర్వాత సత్యం ప్రభావం ఇంట్లోకి వెళుతుంటే ఆపుతాడు.. ఎక్కడికి వెళ్తున్నావ్ వీళ్లు కూడా నీ కడుపున పుట్టిన వాడే కదా నువ్వు వీళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళు అని అంటాడు. మాట కాదనలేక ప్రభావతి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వస్తుంది. తర్వాత మనోజ్ రోహిణి ప్రభావతి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి మనోజ్ నీ తిడుతుంది. రోహిణి ముగ్గురు మాట్లాడుకోవడం విన్న బాలు కావాలనే వాళ్ళపై సెటైర్లు వేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్లో లక్ష రూపాయల గురించి పెద్ద రచ్చే చేస్తారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×