E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు బీపిఎల్ స్టార్ట్.. మనోజ్ ను ఆడుకున్న నిమ్మకాయ.. మనోజ్, ప్రభావతికి టెన్షన్ టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బాలు బీపిఎల్ స్టార్ట్.. మనోజ్ ను ఆడుకున్న నిమ్మకాయ.. మనోజ్, ప్రభావతికి టెన్షన్ టెన్షన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. నిమ్మకాయకు పరిష్కారం కావాలంటే కామాక్షి కి ఫోన్ చేసి నిజాన్ని కనుక్కోవాలి అని ప్రభావతి అంటుంది. కామాక్షి కి ఫోన్ చేయ్యగానే కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. చివరికి రేపు ఉదయం మీరు బతికుంటే చూసుకుందాంలే అని అంటుంది.  దాంతో ఇద్దరు ఇంకాస్త టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా తెల్లవారు ఎంతవరకు నిద్రపోకుండా ఆ నిమ్మకాయ గురించి ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు.. కామాక్షి నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు ఆయన నిన్నుకామాక్షి నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు ఆయనను ఉదయం వెళదామని అంటుంది..

రోహిణి లేవక ముందే మనోజ్ లేచి రెడీ అవ్వడం చూసి రోహిణి షాక్ అవుతుంది. పొద్దున్నే రెడీ అయ్యావ్ ఏంటి నువ్వు ఈ పాటకి లేవు కదా అనేసి రోహిణి అడుగుతుంది. నాకు డీలర్స్ తో పని ఉంది అమ్మని కామాక్షి అత్త ఎక్కడికో వెళ్తున్నారంట డ్రాప్ చేస్తాను అని అంటాడు.. అటు ప్రభావతి కూడా కామాక్షికి బాగాలేదు నేను వెళ్ళాలి అని అబద్ధం చెప్పేసి రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతారు. కలిసి వెళ్తున్నారు అంటే ఏదో ఉంది అనేసి బాలు అనుమాన పడతాడు.. బాలు అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..ప్రభావతి, కామాక్షి, మనోజ్ ముగ్గురు కలిసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు.. ఆ స్వామీజీకి నిమ్మకాయ గురించి చెప్తారు.. అతను మంత్రించి మరొక నిమ్మకాయని ఇస్తాడు.. ఈ నిమ్మకాయని మీ ఇంట్లో నిమ్మకాయ దగ్గర పెట్టండి దాని పవర్ అంతా తగ్గిపోతుంది అని చెప్పగానే ప్రభావతి సంతోషపడుతూ ఆ నిమ్మకాయని తీసుకొని వస్తుంది. మనోజ్ ప్రభావతి ఆ నిమ్మకాయని ఎలాగోలాగా నిమ్మకాయ పక్కన పెట్టేస్తారు.. ఇక బాలు ఆ నిమ్మకాయను చూసి.. ఏంటి నా నిమ్మకాయ పక్కన ఇంకొక నిమ్మకాయ వచ్చింది అని కామెడీ చేస్తాడు. ఈ ఇంకో నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చింది అని రోహిణి అడుగుతుంది. నా నిమ్మకాయ వచ్చేటప్పుడు కడుపుతో ఉంది. అదే కాస్త పని నుండి నిమ్మకాయని కన్నట్టుంది అని బాలు కామెడీ చేస్తాడు..

అది విన్న ప్రభావతి నోరు ముయ్యి రా నిమ్మకాయను తెచ్చిపెట్టింది నేనే అనేసి అంటుంది. ఎందుకు అమరావతి ఆ నిమ్మకాయ తెచ్చావని బాలు అడుగుతాడు. కామాక్షిని చూపించుకుని వచ్చేటప్పుడు గుడికి వెళ్లేసీ వచ్చాము. అక్కడ ఒక స్వామిజి ఈ నిమ్మకాయని ఇచ్చారు. అందుకే ఇక్కడ పెట్టాను అని అంటుంది. ఏంటండీ ఈ రెండో నిమ్మకాయ కదా అంటే నువ్వేం భయపడకు ఇవాళ ఏదో ఒకటి తేల్చేస్తానని బాలు అంటాడు. ఇప్పటినుంచి బిపిఎల్ స్టార్ట్ అవుతుంది అని బాలు అంటాడు.. బిపిఎల్ ఏంటి అని మీనా అడుగుతుంది.. బాలు ప్రీమియర్ లీగ్ అని బాలు అంటాడు..

Advertisement

రాత్రి ప్రశాంతంగా పడుకోను మనోజ్ కి కాళ్లు చేతులు ఏదో అయిపోయినట్లు భ్రమలో ఉంటాడు.. నిద్ర పట్టడం లేదు నాకు చాలా టెన్షన్ గా ఉంది అని అనుకుంటాడు. అయితే అప్పుడు ఎవరు బయట తలుపు కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. ఎవరో తలుపు కొడుతున్నారు ఏంటి అని అనుకుంటారు. కానీ ముందుగా తలుపు తీయకుండా కాసేపు ఆగిన తర్వాత మళ్లీ సౌండ్ వినిపించడంతో తలుపు తీసి ఎవరు రా అని చూస్తాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో భయపడుతూ లోపలికి వచ్చేస్తాడు. ఈసారి ఎవరు తలుపు కొడతారు నేను చూస్తానని తలుపు తెరిచి పడుకుంటాడు. అది గమనించిన బాలు తలుపు తెరిచి పడుకున్నావా అనేసి మనోజ్ మీద నిమ్మకాయలు వేస్తాడు.. ఆ నిమ్మకాయ కాస్త మనోజ్ దగ్గరికి రావడంతో భయపడిపోతాడు.

నిమ్మకాయ మెల్లగా బయటకు వెళ్లిపోవడంతో మనోజ్ కూడా నిమ్మకాయని పట్టుకోడానికి వెళ్తాడు. నాతో నిమ్మకాయ ఆడుకుంటున్నారు అనేసి మనోజ్ అంటాడు. పైన గాల్లో తేలుతున్నట్లు నిమ్మకాయ కనిపిస్తుంది.. నేనే అని నిమ్మకాయ మాట్లాడడంతో మనోజ్ అక్కడి నుంచి పరుగులు పెడుతూ రూమ్ లోకి వెళ్ళిపోతాడు.. ప్రభావతి కి ఫోన్ చేసి నిమ్మకాయ ఇలా చేస్తుంది అని చెప్తాడు.. నిమ్మకాయ టెన్షన్ తగ్గాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అమ్మ అనేసి అంటాడు. ఏం చేయాలి రా అంటే ఈ రెండు నిమ్మకాయలను తీసుకెళ్లి బయట పడేద్దాం.. ఆ తర్వాత ఏం జరిగినట్టు కామ్ గా ఉండిపోదామనేసి అంటాడు..

వాళ్ళిద్దరూ దొంగ చాటుగా నిమ్మకాయలను తీసుకొని వెళ్లడం ఇంట్లోని వాళ్ళందరూ చూసేస్తారు. అక్కడ ఉండాల్సిన నిమ్మకాయలు మీ చేతిలో ఎలా ఉన్నాయని సత్యం అడుగుతాడు. ఇలాంటి నిమ్మకాయలు ఇంట్లో ఉంటే భయంగా ఉంది అందుకనే వాటినిఇలాంటి నిమ్మకాయలు ఇంట్లో ఉంటే భయంగా ఉంది. అందుకనే వాటిని బయటపడేడానికి తీసుకెళ్తున్నామని ప్రభావతి అంటుంది.. రేప్పొద్దున కూడా పడేయొచ్చు కదా మాకు ఎవరికీ లేని భయం మీకెందుకు అని నేను అడుగుతుంది. ఏంట్రా నగలు మింగినోడా ఇప్పటికైనా నిజం చెప్తావా లేక అబద్ధమే చెప్తావా అనేసి బాలు అడుగుతాడు.

Also Read : ‘నిండు నూరేళ్ల సావాసం’ అరు లవ్ స్టోరీలో ట్విస్టులు.. చివరికి విడాకులు..

అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మనోజ్ నేను ఆ నగలను తీయలేదు అని చెప్తాడు. ప్రభావతి మనోజ్ కోసం ఎంతగా సపోర్ట్ చేయాలని చూసినా కూడా సత్యం ఊరుకోడు. ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా తప్పించుకోలేక అసలు అన్ని బయట పెడతారు. నువ్వు చేతగాని వెధవ మళ్ళీ తప్పు చేసావా నువ్వు ఇక మారవా అని సత్యం మనోజ్ నీ కొడతాడు. మధ్యలో అడ్డుగా వచ్చిన ప్రభావతిని కూడా కొడతాడు.. నీవల్లే వీడిలా చెడిపోయాడు. ఇప్పుడు మీనా నగలు ఎలా తీసుకొస్తావో తీసుకురా అనేసి సత్యం వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి ఎంత చెప్తున్నా కూడా సత్యం మాత్రం మాట వినకుండా మనోజ్ ని కొట్టి అసలు నిజాన్ని రాబడతాడు. ఇన్ని రోజులు మాకు నీ మీద అనుమానం ఉండేది అందుకే ఇలా చేసాము అని అంటారు. అది విని ఈ ప్రభావతి మనోజ్ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రభావతిని ఇంట్లోంచి పంపించేందుకు సత్యం నిర్ణయం తీసుకుంటాడు.. మరి ప్రభావతిని ఇంట్లోంచి పంపిస్తాడా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×