E-Paper
Advertisement

OTT Movie : భర్తను చంపి డాన్ అయ్యే భార్య … గన్ పట్టుకునే కోడళ్ళు … ఒక్కో సీన్ చూస్తే

OTT Movie : భర్తను చంపి డాన్ అయ్యే భార్య … గన్ పట్టుకునే కోడళ్ళు … ఒక్కో సీన్ చూస్తే

OTT Movie :డ్రగ్స్, వయలెన్స్, ఫ్యామిలీ ఇంట్రిగ్‌ల మధ్య నడిచే ‘సాస్ బాహూ ఆర్ ఫ్లమింగో’ సిరీస్ ఇండియాలో టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ 2023 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌లో 5 నామినేషన్లతో వార్తల్లో నిలిచింది. డింపుల్ కపాడియా గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టింది. డ్రగ్స్ రాకెట్ చుట్టూ తిరిగే ఈ సిరీస్ లో రొమాంటిక్ ఘాటు ఎక్కువగానే ఉంది. అయితే సిరీస్ ని ఒక్కసారి మొదలు పెడితే తల కూడా తిప్పలేరు. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘సాస్ బాహూ ఆర్ ఫ్లమింగో’ 2023లో విడుదలైన ఇండియన్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. హన్సల్ మెహతా డైరెక్షన్‌లో, అహానా ప్రొడక్షన్స్ పతాకంపై ఇది రూపొందింది. ఇందులో డింపుల్ కపాడియా (సావిత్రి) ప్రధాన పాత్రలో, రధిక మదన్, ఇషా తల్వార్, అంగిరా ధర్, మోనికా డోగ్రా, దీపక్ దోబ్రియాల్, నసీరుద్దీన్ షా, రోహన్ సింగ్ సపోర్ట్ రోల్స్ లో నటించారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ 2023 మే 5న జియో హాట్ స్టార్ లో ప్రీమియర్ అయింది. ఇది ఐయండిబిలో 7.8/10 రేటింగ్ ని సొంతం చేసుకుంది.

స్టోరీ ఏమిటంటే

రాజస్థాన్, పాకిస్తాన్ బార్డర్ దగ్గర లా మాండా అనే గ్రామం ఉంటుంది. ఇక్కడే సావిత్రి బెన్ (డింపుల్ కపాడియా) ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఆమె ఒక సాధారణ గుజరాతీ విడో మహిళ. హెర్బల్ డ్రింక్ “ఫ్లమింగో” తయారు చేసి అమ్ముతుంది. కానీ అసలు సీక్రెట్ ఆ ఫ్లమింగో 99.9% ప్యూర్ కోకైన్. సావిత్రి ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ కార్టెల్‌ని నడుపుతుంది. ఆమెకి నలుగురు మేన కోడళ్లు కూడా ఉంటారు. వీళ్ళ భర్తలు వీళ్ళని వదిలేసి విదేశాల్లో ఉంటారు. ఇక ఆ నలుగురు దందా నడిపిస్తుంటారు. గన్స్ పట్టుకుని ఎవడైనా దాడి చేస్తే కాల్చేస్తారు. సావిత్రికి షాంతా  అనే కూతురు ఒకరిని లవ్ చేస్తుంటుంది. షాంతా ఫ్యామిలీ బిజినెస్‌ని హ్యాండిల్ చేస్తూ, బాహులతో పోటీ పడుతూ ఉంటుంది. సావిత్రి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది, తన తర్వాత ఎవరు కార్టెల్ నడపాలో డిసైడ్ చేయాలని అనుకుంటుంది.

Read Also : అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్… ఆన్లైన్ చాట్ లో అడ్డమైన పనులు… ఆగమయ్యే జీవితాలు

ఇదే టైమ్‌లో ఆమె ఫ్యాకరిపై శత్రువులు దాడి చేస్తాడు. ఫ్యాక్టరీలో బాంబు కూడా పేలుతుంది. సావిత్రి ఇదే తన వారాసుడి ఎంట్రీ టైమ్ అని అసలు గేమ్ మొదలు పెడుతుంది. ఇప్పుడు సావిత్రి ఒక్కో కోడలికి ఒక్కో టాస్క్ ఇస్తుంది. ఎవరు బెస్ట్‌గా చేస్తారో వాళ్లే వారసురాలు. క్లైమాక్స్‌లో సావిత్రి పాస్ట్ ఓపెన్ అవుతుంది. ఆమె వయసులో ఉన్నప్పుడు భర్తని చంపి కార్టెల్ స్టార్ట్ చేసింది. షాంతా ఆమె కూతురు కాదు. ఆమె తన భర్త మరో పెళ్లానికి పుట్టిన కూతురు. సావిత్రి షాంతాని దూరం పెట్టి, బాహులని ఎంచుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఫైనల్ ఎపిసోడ్‌లో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? సావిత్రి తన వారసురాలిగా ఎవరిని ఎంచుకుంటుంది ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

 

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×